Titanic Tourist Submarine: ఇంకా లభించని మినీ సబ్ మెరైన్ ఆచూకీ.. ఆశలు లేనట్లే..!
అంట్లాంటిక్ సముద్రంలో ఉన్న టైటానికి శిథిలాలను చూసేందుకు వెళ్లిన ఐదుగురితో వెళ్లిన మినీ సబ్ మెరైన్ ఆచూకీ ఇంకా లభించలేదు. ఇందులో ఉన్నవారు ప్రాణాలతో బయటపడడం కష్టమేనని తెలుస్తోంది. మీని సబ్ మెరైన్ లో కొద్ది గంటలకు సరిపడ మాత్రమే ఆక్సిజన్ ఉంది. ఆలోపల వారిని గుర్తిస్తేనే వారు ప్రాణాలతో బయటపడతారు. మనీ సబ్ మెరైన్ కోసం అమెరికా, కెనడా బృందాలు జల్లెడ పడుతున్నాయి. అయితే ఇప్పటి వరకు ఎలాంటి పురోగతి లేనట్లు తెలుస్తోంది.
గురువారం మధ్యాహ్నానికి కల్లా మినీ సబ్ మెరైన్ లో ఉన్న ఆక్సిజన్ అయిపోతుందని తెలుస్తోంది. దీంతో వారు బతికే అవకాశాలు చాలా తక్కువగా ఉంది. రెండు రోజుల క్రితం సముద్రం నీటి అడుగులు సబ్ మెరైన్ శబ్దాలను గర్తించినట్లు యూఎస్ కోస్ట్ గార్డ్ బృందం తెలిపింది. కెనడాకు చెందిన పీ-3 నిఘా విమానం ఈ శబ్దాలను పసిగట్టినట్లు వివరించారు. 30 నిమిషాలకు ఒకసారి.. దాదాపు 4 గంటల పాటు శబ్దాలను గుర్తించినట్లు పేర్కొంది.

కెనడాలోని న్యూఫౌండ్‌ల్యాండ్ తీరానికి దాదాపు 400 మైళ్ల దూరంలో ప్రస్తుతం గాలింపు చేపడుతున్నారు. మినీ సబ్ మెరైన్ కోసం US, కెనడియన్ కోస్ట్ గార్డ్ నౌకలు, విమానాలు 7,600 చదరపు మైళ్లు (20,000 చదరపు కిలోమీటర్లు) విస్తిర్ణంలో సముద్రంలో గాలిస్తున్నాయి. గల్లంతైన మనీ సబ్ మెరైన్ లో బ్రిటిష్ బిలియనీర్ హమీష్ హార్డింగ్, పాకిస్తానీ వ్యాపారవేత్త షాజాదా దావూద్, అతని కుమారుడు సులేమాన్ ఉన్నారు.

వీరితో పాటు ఓషన్‌గేట్ ఎక్స్‌పెడిషన్స్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ స్టాక్‌టన్ రష్, ఫ్రెంచ్ సబ్‌మెరైన్ ఆపరేటర్ పాల్-హెన్రీ నార్గోలెట్ ఉన్నారు. గల్లంతైన వారికి కోసం వారి కుటుంబాలు ఎదురు చూస్తున్నాయి. టైటానిక్ 1912లో తన తొలి ప్రయాణంలో మంచుకొండను ఢీకొట్టి అట్లాంటిక్ సముద్రంలో మునిగింది. టైటానిక్ మునిగిపోవడంతో 1,500 మందికి పైగా మరణించారు. ఓడ శిథిలాలు 1985లో అట్లాంటిక్ మహాసముద్రం దిగువన గుర్తించారు
-
అన్నా - చెల్లి కాస్తా.. భార్యాభర్తలు అయ్యారుగా ??? -
ఏపీలో ఇంటర్ ఫలితాల విడుదలపై బోర్డు తాజా నిర్ణయం, మార్కుల్లో ఈ సారి కొత్తగా..!! -
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ? -
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా -
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, పథకాలు ఇక నుంచి..!!












Click it and Unblock the Notifications