హిందువులపై దాడులతో అట్టుడుకుతున్న బంగ్లాదేశ్‌లో మరో విధ్వంసం

Bangladesh: పొరుగు దేశం బంగ్లాదేశ్‌- హిందువులు, ఇతర మైనారిటీలపై దాడులు, గృహ దహనాలు, అఘాయిత్యాలు, ఆకృత్యాలతో అట్టుడికిపోతోంది. రోజుల తరబడి ఇవి కొనసాగుతూ వస్తోన్నాయి. భారత్ సహా ఇతర దేశాలు బంగ్లాదేశ్ ప్రభుత్వంపై అన్ని రకాలుగా ఒత్తిళ్లు తీసుకొస్తోన్నప్పటికీ- దీనికి మాత్రం బ్రేకులు పడట్లేదు.

గత ఏడాది ఆగస్టు 5వ తేదీన ప్రధానమంత్రి షేక్ హసీనా సారథ్యంలోని ప్రభుత్వం కుప్పకూలిన విషయం తెలిసిందే. అప్పటి నుంచీ బంగ్లాదేశ్‌లో అమానుష ఘటనలు చోటు చేసుకుంటూ వస్తోన్నాయి. ప్రత్యేకించి- హిందువులపై విపరీతంగా దాడులు సాగుతున్నాయి. దోపిడీలు, గృహ దహనాలు నిత్యకృత్యం అయ్యాయి.

Mob vandalized the residence of Bangladesh s founding father Sheikh Mujibur Rahman in Dhaka

హిందువులతో పాటు ఇతర మైనారిటీలపై ఇస్లామిక్ మతఛాందసవాదులు విరుచుకుపడుతున్నారు. హైందవ ఆలయాలను ధ్వంసం చేయడం, భక్తిశ్రద్ధలతో పూజలందుకున్న విగ్రహాలను పగులగొట్టడం, మంటల్లో పడేయడం, తగులబెట్టడం రోజువారీ కార్యక్రమంగా మారింది. మహ్మద్ యూనుస్ సారథ్యంలో మధ్యంతర ప్రభుత్వం అక్కడ ఏర్పడినప్పటికీ ఎలాంటి ఫలితమూ ఉండట్లేదు.

ఈ పరిణామాల మధ్య బంగ్లాదేశ్‌లో మరో విధ్వంసం చోటు చేసుకుంది. ఆ దేశ జాతిపిత షేక్ ముజీబుర్ రెహ్మాన్ స్మారక నివాసంపై ఆందోళనకారులు దాడులకు పాల్పడ్డారు. నిప్పంటించారు. స్వైరవిహారం చేశారు. ఈ ఘటనలో స్మారక నివాసం మొత్తం ధ్వంసమైంది. అక్కడి ఫర్నిచర్ బుగ్గిపాలైంది.

రాజధాని ఢాకాలోని దన్మొండి ఏరియా 32లో ఉంటుందీ బంగ్లా. ముజీబుర్ రెహ్మాన్ స్థాపించిన ఆవామీ లీగ్ పార్టీని నిషేధించాలని డిమాండ్ చేస్తూ బుధవారం సాయంత్రం ఆందోళనకారులు ఢాకాలో బుల్డోజర్ ర్యాలీ నిర్వహించారు. రాత్రి పొద్దుపోయేంత వరకూ ఈ ర్యాలీ కొనసాగింది. ఆ తరువాత ఆందోళనకారులు ఈ ఘాతుకానికి పాల్పడ్డారు.

ఆందోళనకారులు ముజీబుర్ రెహ్మాన్ స్మారక నివాసంపై దూసుకెళ్లారు. వేల సంఖ్యలో ఉండటం వల్ల అక్కడి సెక్యూరిటీ సిబ్బంది చేష్టలుడిగి చూస్తుండిపోవాల్సి వచ్చింది. తొలుత ఆందోళనకారులు అన్ని వైపుల నుంచి బంగ్లాను చుట్టుముట్టారు. అనంతరం ఇంట్లోకి ప్రవేశించారు. విధ్వంసానికి పాల్పడ్డారు. తమ వెంట తెచ్చుకున్న పెట్రోల్ క్యాన్లతో ఇంటిని తగులబెట్టారు.

దేశం విడిచి పారిపోయిన బంగ్లాదేశ్ మాజీ ప్రధానమంత్రి షేక్ హసీన ఆయన కూతురే. తండ్రి స్థాపించిన ఆవామీ లీగ్‌కు నాయకత్వాన్ని వహిస్తోన్నారు. ప్రభుత్వం కుప్పకూలేంత వరకూ ఈ పార్టీనే అధికారంలో కొనసాగిన విషయం తెలిసిందే. ఇప్పుడు దీన్ని నిషేధించాలంటూ ఆందోళనకారులు డిమాండ్ చేస్తోన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+