తాడో పేడో: యుద్ధం ఆపే ప్రసక్తే లేదు- ట్రంప్ కు నెతన్యాహు అర్జంట్ ఫోన్ కాల్
ఇరాన్ యుద్ధంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాత్కాలిక సంధి ప్రకటన తర్వాత పశ్చిమాసియాలో అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటోన్నాయి. ట్రంప్ స్టేట్ మెంట్ ను లెక్క చేయట్లేదు ఇజ్రాయెల్. ఇరాన్‌పై తన దాడులను కొనసాగిస్తోంది. యుద్ధాన్ని ఆపే ప్రసక్తే లేదని ఆ దేశ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు తేల్చి చెప్పారు. ఈ క్రమంలో ఆయన ఫోన్ లో డొనాల్డ్ ట్రంప్ తో మాట్లాడారు. ఇరాన్ సహా లెబనాన్ పైనా తాము దాడులు సాగిస్తోన్నట్లు వివరించారు.
పశ్చిమాసియా రీజియన్ లో ఉద్రిక్తతను తగ్గించేందుకు డొనాల్డ్ ట్రంప్ దౌత్యపరమైన పరిష్కారాన్ని సూచించిన అనంతరం తాజా పరిణామలు సంభవించాయి. తమ సైనిక చర్యలను కొనసాగిస్తామని నెతన్యాహు తేల్చిచెప్పారు. ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ బలగాలు ఇరాన్‌లో చురుగ్గా కదులుతున్నాయని, తమ లక్ష్యాలు నెరవేరే వరకు ఈ కార్యకలాపాలను ఎట్టి పరిస్థితుల్లో నిలిపివేయబోమని ఆయన స్పష్టం చేశారు. ఇదే విషయాన్ని ట్రంప్ కూ తేల్చి చెప్పారు.

ట్రంప్ తో ఫోన్ లో మాట్లాడినట్లు నెతన్యాహు వెల్లడించారు. ఈ సందర్భంగా చర్చకు వచ్చిన అంశాలను క్లుప్తంగా ప్రస్తావించారు. ఈ మేరకు తన అధికారిక ఎక్స్ అకౌంట్ లో దీనికి సంబంధించిన సమాచారాన్ని ఆయన పోస్ట్ చేశారు. తమ సైనిక చర్యలు ఇంకా ముగియలేదని, ఇరాన్ ఒక్కటే కాకుండా లెబనాన్‌తో సహా ఈ సంఘర్షణకు సంబంధించిన ఇతర సరిహద్దు ప్రాంతాలలో సైతం తదుపరి చర్యలు ఉంటాయని హెచ్చరించారు.
డొనాల్డ్ ట్రంప్‌తో మాట్లాడానని, యుఎస్ సైన్యంతో ఇజ్రాయెల్ కొన్ని అద్భుత విజయాలను సాధించిందని నెతన్యాహు పేర్కొన్నారు. వీటిని ఉపయోగించుకొని రెండు దేశాల కీలక ప్రయోజనాలను కాపాడే ఒప్పందంలో భాగంగా యుద్ధ లక్ష్యాలను సాధించడానికి ఒక అవకాశం ఉందని ట్రంప్ నమ్ముతున్నారని వ్యాఖ్యానించారు. అదే సమయంలో తాము ఇరాన్, లెబనాన్ రెండింటిలోనూ దాడులు కొనసాగిస్తున్నామని స్పష్టం చేశారు.
מוקדם יותר היום שוחחתי עם ידידנו הנשיא טראמפ.
— Benjamin Netanyahu - בנימין נתניהו (@netanyahu) March 23, 2026
הנשיא טראמפ מאמין שיש סיכוי למנף את ההישגים הכבירים שהשגנו עם צבא ארה"ב, כדי לממש את יעדי המלחמה בהסכם - הסכם שישמור על האינטרסים החיוניים שלנו.
במקביל, אנחנו ממשיכים לתקוף גם באיראן וגם בלבנון. אנחנו כותשים את תוכנית הטילים… pic.twitter.com/EHG9geofkl
ఇరాన్ కు చెందిన అన్ని రకాల క్షిపణి, అణు కార్యక్రమాలను తుడిచి వేస్తోన్నామని నెతన్యాహు తెలిపారు. లెబనాన్ లో హిజ్బుల్లాపై అతి తీవ్రమైన దాడులను కొనసాగిస్తున్నామని వివరించారు. కొద్ది రోజుల కిందటే తాము మరో ఇద్దరు అణు శాస్త్రవేత్తలను మట్టుబెట్టినట్లు ప్రకటించారాయన. అక్కడితో తమ దాడులు ఆగిపోవట్లేదని, ఏ సందర్భంలోనైనా, ఎటువంటి సంక్లిష్ట పరిస్థితుల్లో అయినా తమ ప్రయోజనాలను కాపాడుకుంటామని అన్నారు. ఈ వ్యాఖ్యలతో యుద్ధ తీవ్రతను మరింత పెంచే ప్రమాదం ఉందనే అభిప్రాయాలు వ్యక్తమౌతోన్నాయి.
-
స్వయానా ట్రంప్ నోట -
అన్నా - చెల్లి కాస్తా.. భార్యాభర్తలు అయ్యారుగా ??? -
ఏపీలో ఇంటర్ ఫలితాల విడుదలపై బోర్డు తాజా నిర్ణయం, మార్కుల్లో ఈ సారి కొత్తగా..!! -
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ? -
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా












Click it and Unblock the Notifications