Nobel Prize 2023 in Literature: ఏడేళ్ల ప్రాయంలోనే సాహిత్యం వైపు మొగ్గు
స్టాక్‌హోమ్: ప్రఖ్యాత శాస్త్రేవేత్తలు, ఆర్థికవేత్తలు, సాహితీవేత్తలు, రచయితలు, ఇతర సామాజిక ఉద్యమకారులకు ప్రతి సంవత్సరం అందించే అత్యంత ప్రతిష్ఠాత్మకమైన నోబెల్ బహుమతుల ప్రకటనలు కొనసాగుతున్నాయి. వారం రోజుల పాటు ఈ అవార్డుల ప్రకటన ఉంటుంది. ఒక్కో రోజు ఒక్కో రంగంలో కృషి చేసిన వారికి నోబెల్ బహుమతుల ప్రకటన చేస్తూ వస్తోన్నారు జ్యూరీ కమిటీ సభ్యులు.
ఆర్థికం, వైద్యం, సామాజిక అంశాలు, పర్యావరణం, ఫిజిక్స్.. ఇలా విభిన్న రంగాల్లో నూతన ఒరవడిని సృష్టించిన, వాటికి ఆద్యులైన శాస్తవేత్తలకు అందించే ఈ అవార్డుల ప్రకటనల పరంపర సోమవారం ప్రారంభమైంది. ఇప్పటికే మెడిసిన్, ఫిజిక్స్‌లో నోబెల్ బహుమతి కోసం ఎంపికైన శాస్త్రవేత్తల పేర్లను వెల్లడించారు.

మెడిసిన్‌లో అద్భుతాలను ఆవిష్కరించిన హంగేరియన్- అమెరికన్ బయో కెమిస్ట్ కటాలిన్ కరికో, అమెరికన్ ఫిజీషియన్ సైంటిస్ట్ డ్రూ వీస్‌మన్‌లకు మెడిసిన్‌లో నోబెల్ బహుమతి వరించింది. ఫిజిక్స్‌లో పియర్రీ అగొస్టిని, ఫెరెంక్ క్రాస్జ్, అన్నె ఎల్ హ్యులియర్‌కు జాయింట్‌గా నోబెల్ ప్రైజ్‌ను ప్రకటించారు.
తాజాగా సాహిత్యంలో నోబెల్ ప్రైజ్‌ను ప్రకటించారు నోబెల్ కమిటీ సెక్రెటరీ జనరల్ ఒలావ్ జోల్‌స్టాడ్ తెలిపారు. నార్వేకు చెందిన ప్రఖ్యాత నాటక రచయిత జోన్ ఒలావ్ ఫోస్సే పేరును ప్రకటించారు. స్వీడన్‌లోని స్టాక్‌హోమ్‌లో గల కరోలిన్‌స్కా ఇన్‌స్టిట్యూట్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
నాటకాలు, గద్య నాటకాల్లో ఆయన చేసిన కృషిని గుర్తిస్తూ సాహిత్యంలో నోబెల్ బహుమతి 2023ని అందజేయనున్నట్లు తెలిపారు. ఏడేళ్ల వయస్సు ఉన్నప్పుడు జోన్ ఫొస్సే ఓ ప్రమాదానికి గురయ్యారు. అందులో నుంచి కోలుకున్న తరువాత సాహిత్యం వైపు మొగ్గు చూపారు. సమాజాన్ని ఉత్తేజ పరిచే ఎన్నో నాటకాలు, నాటికలు, గద్య, పద్య సాహిత్యాలు, నవలలను జోన్ ఫొస్సే రచించారు. చిన్న పిల్లల కోసం పలు పుస్తకాలను రాశారు.












Click it and Unblock the Notifications