ఉ.కొరియా రహస్య ఫోటో లీక్: యావత్ ప్రపంచం నివ్వెరపోయే దాడి, అమెరికాకు హెచ్చరిక

Subscribe to Oneindia Telugu
  North Korea Warns US With 'Greatest Pain And Suffering' ఉ.కొరియా రహస్య ఫోటో లీక్ | Oneindia Telugu

  ప్యోంగ్‌యాంగ్: ప్రపంచ దేశాలన్ని ఏకమైనా.. ఉత్తరకొరియా మాత్రం ఎక్కడా తగ్గే రకంగా కనిపించడం లేదు. ప్రపంచంతో సంబంధం లేదన్నట్లుగా వ్యవహరించే ఆ దేశం.. యుద్ద కాంక్షతో రగిలిపోతూనే ఉంది. అమెరికాను లక్ష్యంగా చేసుకుని ఆ దేశం చేస్తున్న హెచ్చరికలు ప్రపంచవ్యాప్తంగా శాంతి కాముకులను ఆందోళనకు గురిచేస్తున్నాయి.

  ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ తీరును చాలామంది మూర్ఖ స్వభావంగా అభివర్ణిస్తున్నారు. ఆమధ్య ఫిలిప్పీన్ అధ్యక్షుడు రొడ్రిగో సైతం కిమ్ ను పిచ్చోడిగా అభివర్ణించారు. అయితే ఎవరెంత విమర్శించినా.. నచ్చ జెప్పాలని చూసినా.. ఆ దేశం తీరులో మాత్రం మార్పు రావడం లేదు. అగ్రరాజ్యం అయినా సరే 'వి డోంట్ కేర్' అనే రీతిలో యుద్దానికే మొగ్గు చూపుతోంది.

  ఐరాస కల్పించుకున్నా:

  ఐరాస కల్పించుకున్నా:

  ఆఖరికి ఐరాస కల్పించుకున్న సరే ఉత్తరకొరియా వెనక్కి తగ్గలేదంటే ఏ అండ చూసుకుని ఆ దేశం రెచ్చిపోతుందోనన్న అనుమానాలు కలుగుతున్నాయి. రష్యా, చైనాల అండతోనే ఉత్తరకొరియా ఇంతలా రెచ్చిపోతుందనేది అమెరికా సహా పలు దేశాలు వ్యక్తం చేస్తున్న అభిప్రాయం. ఈ నేపథ్యంలో ఉత్తరకొరియా మరోసారి ఘాటైన వ్యాఖ్యలు చేసింది.

  యావత్ ప్రపంచం గుర్తుంచుకునేలా:

  యావత్ ప్రపంచం గుర్తుంచుకునేలా:

  తమ దేశంపై ఐరాస మరిన్ని ఆంక్షలు విధించబోతుందన్న విషయం తెలిసిన వెంటనే ఉత్తరకొరియా ఆగ్రహం వ్యక్తం చేసింది. అదే జరిగితే ప్రతీకారం తీర్చుకోవడం ఖాయమని తేల్చి చెప్పింది. అమెరికా నాటకానికి ఐక్యరాజ్యసమితి వంత పాడటం మొదలుపెట్టిందని తీవ్ర స్థాయిలో విమర్శించింది.

  తమను ఎవరెంతగా నియంత్రించాలని చూసినా.. అమెరికాపై ఉత్తరకొరియా దాడి చేసి తీరుతుందని, ఆ దాడి యావత్ ప్రపంచం చర్చించుకునేలా ఉంటుందని ఉత్తరకొరియా విదేశాంగ శాఖ మరోసారి హెచ్చరికలు జారీ చేసింది.

  అమెరికా-ఐరాస నాటకం

  అమెరికా-ఐరాస నాటకం

  అమెరికా ప్రోద్బలంతో ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి తమ దేశ ఎగుమతులపై నిషేధం విధించిందని ఉత్తరకొరియా విదేశాంగ శాఖ ఆగ్రహం వ్యక్తం చేసింది. తమ అధ్యక్షుడి ఆస్తులు స్తంభించేలా చేసేందుకు ప్రయత్నించడం, తమ దేశానికి చెందిన కార్మికులను విదేశాల్లోని ఉద్యోగాల్లోకి తీసుకోకుండా ఒత్తిడి తేవడంపై ఉత్తరకొరియా ఆగ్రహం వ్యక్తం చేసింది.

  ఐరాస ఆంక్షలతో ప్రస్తుతం ఉత్తరకొరియాకు ఆయిల్ ఉత్పత్తులు, టెక్స్ టైల్ సంబంధిత ఉత్పత్తులపై నిషేధం కొనసాగుతోంది. ఇది ఆ దేశ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపనుండటంతో ఉత్తరకొరియా గగ్గోలు పెడుతోంది. అమెరికా-ఐరాస రెండూ తమ దేశంతో నాటకాలు ఆడుతున్నాయని ఉత్తరకొరియా విమర్శిస్తోంది.

  రహస్య ఫోటోలు లీక్!:

  రహస్య ఫోటోలు లీక్!:

  ప్రపంచదేశాలకు ఉత్తరకొరియా ఇప్పటికీ ఒక మిస్టరీ దేశమే. ఆ దేశ భౌగోళిక, అంతర్గత విషయాల గురించి ఏ దేశానికి పూర్తి స్థాయి సమాచారం లేదు. ఇక్కడ కొనసాగుతున్న నియంత పాలన ప్రపంచ దేశాలతో ఆ దేశ పౌరులకు కమ్యూనికేషన్ లేకుండా చేసింది. ఫోటోలు తీయడం, ఇంటర్నెట్, ఇతరత్రా వాటిపై ఇక్కడ నిషేధం కొనసాగుతోంది.

  తాజాగా తారిక్ జైబి అనే ఫోటోగ్రాఫర్ చాలా ధైర్యం చేసి తీసిన కొన్ని రహస్య ఫోటోలు లీక్ అయ్యాయి. చైనా సరిహద్దులోని డాంగాంగ్ గుండా ఉత్తరకొరియాలో ప్రవేశించిన తారిక్ జైబి కొన్ని ఫోటోలు తీయగలిగాడుజ ఇందులో ఒక ఫోటోను లీక్ చేయగా.. అందులో సముద్ర తీరంలో సైనికుల పహారా మధ్య కొంతమంది అమ్మాయిుల బీచ్ లో నడవడం కనిపించింది. ఉత్తరకొరియాలో అంతా మిలటరీ కనుసన్నుల్లోనే నడుస్తుందని చెప్పడానికి ఇదొక ఉదాహరణ అంటున్నారు.

  ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

  English summary
  Reports from Pyongyang claim that the United States faces will face its greatest ever “pain and suffering” if sanctions, deemed as harsh by North Korea, are approved by the UN later today.

  Oneindia బ్రేకింగ్ న్యూస్
  రోజంతా తాజా వార్తలను పొందండి