Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

పాక్‌ కు సపోర్ట్ ..ఆ రెండు ముస్లిం దేశాలకు భారత్ రిటర్న్ గిఫ్ట్..

జమ్మూ కాశ్మీర్ లోని పహల్గామ్ లో ఏప్రిల్ 22న జరిగిన టెర్రరిస్టుల మారణహోమంలో 26 మంది భారత టూరిస్టులు మృతి చెందిన విషయం తెలిసిందే. ఆ తర్వాత ఉగ్రవాదాన్ని పెంచిపోషిస్తున్న పాకిస్థాన్ పై భారత్ ఆపరేషన్ సింధూర్ చేపట్టింది. పాకిస్థాన్, పాకిస్థాన్ ఆక్రమిత కాశ్మీర్(POK)లోని 9 కీలక స్థావరాలపై భారత సైన్యం దాడులకు పాల్పడింది. ఉగ్ర స్థావరాలను ధ్వంసం చేసింది. వందలాది ఉగ్రమూకలను హతమార్చింది. అయితే ఆపరేషన్ సింధూర్ సమయంలో పాకిస్థాన్ కు రెండు ముస్లిం దేశాలు మద్దతుగా నిలిచాయి. అవి టర్కీ, అజర్ బైజాన్.. ఈ రెండు దేశాలు పాకిస్థాన్ కు ఆయుధాలు, సైనికులను పంపించాయి. టర్కీ సరఫరా చేసిన వందల కొద్దీ డ్రోన్ లను భారత్ సరిహద్దుల్లోని గ్రామాలపై ప్రయోగించింది పాకిస్థాన్. అయితే భారత్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఎస్-400 వాటిని సమర్థవంతంగా ఎదుర్కొంది.

అయితే 4 రోజులపాటు జరిగిన ఆపరేషన్ సింధూర్ లో పాకిస్థాన్ కు సపోర్ట్ గా నిలిచిన టర్కీ, అజర్ బైజాన్ పై భారత్ ఆంక్షలు విధించింది. ఉగ్రవాద దేశానికి సపోర్ట్ చేసిన ఈ రెండు దేశాల నుంచి వాణిజ్యాన్ని, ఎగుమతులు, దిగుమతులను నిలిపివేసింది. దీంతో ఆ సమయంలోనే భారత్ దెబ్బకు ఈ దేశాలు విలవిల్లాడాయి. అయితే తాజాగా ఓ రిపోర్టు బయటకు వచ్చింది. ఈ రిపోర్టు ప్రకారం.. ఈ రెండు దేశాలకు భారత్ నుంచి పర్యాటకుల సంఖ్య పూర్తిగా తగ్గిపోయినట్లు తేలింది. టూరిజంపైనే అధికంగా ఆధారపడిన టర్కీ, అజర్ బైజాన్ కు.. ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన భారత్ నుంచి టూరిస్టులు రాకపోవడం అతిపెద్ద దెబ్బగా విశ్లేషకులు చెబుతున్నారు.

భారత్ నుంచి అజర్ బైజాన్ కు టూరిస్టుల సంఖ్యలో దాదాపు 56 శాతం తగ్గిపోయింది. అలాగే టర్కీ కి కూడా భారత్ నుంచి పర్యటకుల సంఖ్య 33.3 శాతం తగ్గిపోయింది. దీంతో ఈ రెండు దేశాల ఆర్థిక వ్యవస్థ పూర్తిగా దెబ్బతినే ప్రమాదం ఉంది. టర్కీ, అజర్ బైజాన్ టూరిస్ట్ దేశాలుగా ప్రసిద్ధి చెందాయి. భారత్ నుంచి ఏటా పర్యటకులు ఈ దేశాలను సందర్శించేవాళ్లు. క్రమంగా పర్యటకుల సంఖ్య పెరిగింది. అయితే ఆపరేషన్ సింధూర్ సమయంలో ఈ రెండు దేశాలు పాకిస్థాన్ కు సపోర్ట్ గా నిలిచిన కారణంగా ఆ రోజు నుంచి భారత్ పర్యటకులు ఈ రెండు దేశాల్లో పర్యటనకు ఇష్టపడటం లేదు. దీంతో టర్కీ, అజర్ బైజాన్ ల పర్యటక రంగం దెబ్బతిన్నట్లుగా తెలుస్తోంది.

ఆపరేషన్ సింధూర్ తర్వాత ఈ రెండు దేశాలను భారత్ బాయ్ కాట్ చేసినట్లుగా చెప్పవచ్చు. ట్రావెల్ బుకింగ్స్ పోర్టల్ లో టర్కీ, అజర్ బైజాన్ కు బుకింగ్స్ తగ్గిపోయాయి. అప్పటికే బుక్ చేసుకున్న టికెట్లను క్యాన్సిల్ చేసుకున్నారు. ట్రావెల్ బుకింగ్ సైట్స్ ఈ రెండు దేశాలను నాన్- ఎసెన్షియల్ ట్రావెల్ ప్రాంతాల్లోకి మార్చాయి. గత వారం నుంచి అజర్ బైజాన్, టర్కీ దేశాలకు బుకింగ్స్ 60 శాతం తగ్గాయని.. బుకింగ్ టికెట్స్ క్యాన్సిల్ 250 శాతం పెరిగిందని మేక్ మై ట్రిప్ సంస్థ ఓ ప్రకటనలో పేర్కొంది.

Operation Sindh Fallout Declining Indian Tourist Numbers in Turkey and Azerbaijan

అజర్ బైజాన్ టూరిజం బోర్డు అందించిన వివరాల ప్రకారం.. ఆపరేషన్ సింధూర్ కు ముందు ఏటా ఈ దేశానికి భారత పర్యటకుల సంఖ్య 33 శాతం పెరుగుతూ వచ్చేది. కానీ ఆ తర్వాత గత నాలుగు నెలలుగా 56 శాతం మేర తగ్గుతూ వస్తోందని తెలిపింది. టూరిజం రంగం అజర్ బైజాన్ లో కీలకంగా ఉంది. ఇప్పుడు ఈ రంగం దెబ్బతినడంతో అజర్ బైజాన్ ఆర్థిక పరిస్థితి చతికిలపడింది. ఇక భారత్ కు చెందిన డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) లెక్కల ప్రకారం.. 2024లో భారత్ నుంచి టర్కీకి ప్రయాణించిన టూరిస్టుల సంఖ్య 5.05 లక్షలుగా ఉన్నట్లు పేర్కొంది. రానున్న కాలంలో భారత్ నుంచి టర్కీ, అజర్ బైజాన్ ముస్లిం దేశాలకు టూరిస్టుల సంఖ్య మరింత తగ్గిపోయే అవకాశం ఉన్నట్లు తాజాగా ఈ రిపోర్టు అంచనా వేసింది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+