ఇళ్లపై కూలిన ఆర్మీ ఎయిర్క్రాఫ్ట్.. 13 మంది మృతి
ఇస్లామాబాద్ : పాకిస్థాన్లో ఆర్మీ ఎయిర్ క్రాఫ్ట్ కుప్పకూలింది. దీంతో 13 మంది పౌరులు చనిపోయారు. మరో 12 మంది గాయపడ్డారు. ఎయిర్ క్రాఫ్ట్ కూలిపోవడానికి గల కారణం తెలియరాలేదు. ఘటనపై విచారణ జరుపుతున్నామని పాకిస్థాన్ ఉన్నతాధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. మరోవైపు మృతుల కుటుంబాలను ఆదుకుంటామని పాకిస్థాన్ ప్రభుత్వం తెలిపింది.

పాకిస్థాన్ ఆర్మీకి చెందిన ఎయిర్ క్రాప్ట్ మంగళవారం ఉదయం కుప్పకూలింది. రావల్పిండిలోని భవన సముదాయంపై పడిపోయింది. ఈ ప్రమాదంలో ఇద్దరు ఫైలట్లు, ముగ్గురు ఆర్మీ అధికారులతోపాటు 13 మంది పౌరులు చనిపోయారు. మరో 12 మంది గాయపడ్డారు. వారిని చికిత్స నిమిత్తం సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. ఆర్మీ క్రాప్ట్ కూలిపోవడంతో భవన సముదాయం సమీపంలోని ఆరు ఇళ్లు పూర్తిగా ధ్వసమైనట్టు ఆర్మీ అధికారులు తెలిపారు. ప్రమాద ఘటన గురించి తెలిసి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు పాకిస్థాన్ అధ్యక్షుడు ఆరిప్ అల్వీ. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు ప్రధానమంత్రి ఇమ్రాన్ కాన్. మృతుల కుటుంబాలను అన్నివిధాలా ఆదుకుంటామని ప్రకటించారు. గాయపడ్డ క్షతగాత్రులు కోలుకోవాలని ఆకాంక్షించారు. వారికి మెరుగైన వైద్యం అందజేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.
-
Work From Home ఇచ్చేశారు. ప్రభుత్వం, ఐటీ దిగ్గజాల కీలక ప్రకటన! -
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్? -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
తెలంగాణ నూతన డీజీపీ ఖరారు, అనూహ్య ఎంపిక..!! -
న్యూజిలాండ్ ఫస్ట్ సిరీస్- టీ20 వరల్డ్ కప్ ఫైనల్ తర్వాత జట్టులో భారీ మార్పలు -
దేశంలో తొలి `కారుణ్య మరణం`- తీర్పు చెబుతూ కన్నీళ్లు పెట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం -
"ఆయన్ను తట్టుకోలేక నరకం చూశా.. 16 సినిమాలు తిరస్కరించా" -
రిలయన్స్ ఇండస్ట్రీస్ బంపర్ ఆఫర్ ఇచ్చిన డొనాల్డ్ ట్రంప్












Click it and Unblock the Notifications