Lockdown news: ఆ నగరాల్లో లాక్‌డౌన్.. స్కూళ్లు, వ్యాపారాలు, పెళ్లిళ్లకూ నో పర్మిషన్..

Pakistan News: కరోనా విజృంభణతో లాక్‌డౌన్ అనే పదం రోజువారీ కార్యకలాపాల్లో భాగం అయిపోయింది. అత్యవసర సమయాల్లో మాత్రమే ఆయా దేశాలు మరియు ప్రభుత్వాలు ప్రజల కదలికలపై ఆంక్షలు విధిస్తుంటాయి. తాజాగా పొరుగు దేశం పాకిస్థాన్ లోని ఓ ప్రాంతంలో లాక్‌డౌన్ విధించింది. అయితే దీని వెనుక గల కారణం తెలిసి సోషల్ మీడియాలో నెటిజన్లు ఆ దేశాన్ని ట్రోల్ చేస్తున్నారు.

పాకిస్థాన్‌లో పాఠశాలలు, కళాశాలలను మూసివేయాలని షెహబాజ్ షరీఫ్ ప్రభుత్వం హుకూం జారీ చేసింది. వివాహ వేడుకలపైనా నిషేధం విధించాలని నిర్ణయించుకుంది. ఇందుకు కారణం దాయాది దేశంలో షాంఘై కో ఆపరేషన్ సమావేశం జరగనుండటమే. భారత్, చైనా, ఇరాన్ మరియు రష్యా సహా 9 సభ్య దేశాలు ఇందులో పాల్గొంటాయి. మధ్య ఆసియాలో భద్రతా సమస్యల గురించి చర్చించడానికి చైనా మరియు రష్యా 2001లో SCOను స్థాపించాయి. అయితే ప్రభుత్వ నిర్ణయం స్థానికులపై తీవ్ర ప్రభావం చూపనుంది.

Pakistan imposed lockdown in two major cities

చైనా ప్రధాని లీ కియాంగ్ 4 రోజుల పర్యటన కోసం పాకిస్థాన్ వెళ్తున్నారు. దీనికితోడు మంగళ, బుధ వారాల్లో SCO కీలక సమావేశం జరగనుంది. వీటిని దృష్టిలో పెట్టుకుని షెహబాజ్ షరీఫ్ సర్కారు దేశ రాజధాని ఇస్లామాబాద్‌ను కట్టుదిట్టమైన భద్రతా వలయంలో ఉంచింది. ఈ పర్యటనలోనే షాంఘై సహకార సంస్థ సమావేశానికి లీ అధ్యక్షత వహిస్తారు. 11 ఏళ్ల తర్వాత చైనా ప్రధాని తొలిసారిగా పాకిస్థాన్‌ను సందర్శించనున్నారు. ఈ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పాకిస్థాన్ ప్రభుత్వం లాక్ డౌన్ విధించింది.

SCO సమావేశంలో చైనా, రష్యా, బెలారస్, కజకిస్తాన్, కిర్గిస్థాన్, తజికిస్థాన్ మరియు ఉజ్బెకిస్థాన్ ప్రధానమంత్రులతో పాటు ఇరాన్ వైస్ ప్రెసిడెంట్ మరియు భారతదేశ విదేశాంగ మంత్రి పాల్గొంటారని పాకిస్తాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది. దీంతో అధికారులు సోమవారం నుంచి 3 రోజుల పాటు ఇస్లామాబాద్‌లో సెలవు ప్రకటించారు, పాఠశాలలు మరియు వ్యాపారాలు మూసివేయబడ్డాయి. నగరం అంతటా పెద్ద సంఖ్యలో పోలీసులు మరియు పారామిలటరీ బలగాలను మోహరించారు.

ఇస్లామాబాద్ మరియు రావల్పిండిలో పాకిస్థాన్‌ ఆర్మీకి చెందిన దాదాపు 10 వేల మంది సైనికులు మరియు కమాండోలు మోహరించారు. స్థానిక పోలీసులు మరియు ఇతర భద్రతా దళాలకు నేరుగా సైన్యమే ఆదేశాలు ఇస్తున్నట్లు నివేదికలు చెబుతున్నాయి. అక్టోబర్ 12 నుంచి 16 వరకు రెండు నగరాల్లోనూ పెళ్లి మండపాలు, కేఫ్‌లు, రెస్టారెంట్లు, స్నూకర్ క్లబ్‌లను మూసివేయాలని కూడా ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినట్లు తెలుస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+