కుల్‌భూషణ్ జాదవ్‌కు స్వల్ప ఊరట: అప్పీల్‌కు వెళ్లేందుకు అనుమతి, పాక్ పార్లమెంట్ చట్టం
ఇస్లామాబాద్/న్యూఢిల్లీ: పాకిస్థాన్ జైలులో గత కొన్నేళ్లుగా మగ్గుతున్న భారతీయ మాజీ నేవీ అధికారి కుల్‌భూషణ్ జాదవ్‌కు స్వల్ప ఊరట లభించింది. గూఢచర్యం కేసులో పాకిస్థాన్ కోర్టు విధించిన ఉరిశిక్షపై అప్పీల్‌కు వెళ్లేందుకు కుల్‌భూషణ్‌కు అనుమతి లభించింది.
అంతర్జాతీయ న్యాయస్థానం ఒత్తిళ్లతో పాకిస్తాన్ పార్లమెంట్ దీనిపై చట్టం చేసింది. కుల్‌భూషణ్‌కు అప్పీల్‌కు వెళ్లేందుకు అవకాశం కల్పించాలని ఇంటర్నేషనల్ కోర్టు పాకిస్థాన్ ప్రభుత్వాన్ని ఆదేశించిన విషయం తెలిసిందే. కుల్‌భూషణ్ జాదవ్ అప్పీల్‌కు వెళ్లేందుకు పాకిస్థాన్ ప్రభుత్వం 2020 లోనే పార్లమెంట్‌లో ఆర్డినెన్స్‌ను తీసుకొచ్చింది. దీనిపై పాక్ విపక్షాలు నానా యాగి చేశాయి. అయితే, ఎట్టకేలకు తాజాగా, దీనిపై చట్టం చేసింది పాకిస్థాన్ పార్లమెంటు.

భారత నావికాదళంలో ఆఫీసర్‌గా పనిచేసిన కుల్‌భూషణ్‌ను ఇరాన్ సరిహద్దులో పాకిస్థాన్ అక్కమంగా నిర్భంధించింది. వ్యాపార పనుల మీద అక్కడికి వెళ్లిన కుల్‌భూషణ్‌పై పాకిస్థాన్ ప్రభుత్వం గూఢచర్యం ఆరోపణలను మోపింది. అయతే ఈ ఆరోపణలను భారత ప్రభుత్వం కొట్టిపారేసింది.
Recommended Video
కాగా, పాకిస్థాన్ కోర్టు 2017లో కుల్‌భూషణ్ జాదవ్‌కు ఉరిశిక్ష విధించింది. గూఢచర్యంతో పాటు ఆయనపై ఉగ్రవాదిగా ముద్ర వేశారు పాకిస్థాన్ అధికారులు. పాక్ కోర్టు తీర్పుపై భారత ప్రభుత్వం అంతర్జాతీయ న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. ఈ క్రమంలో ఉరిశిక్ష అమలును అంతర్జాతీయ న్యాయస్థానం తాత్కాలికంగా నిలిపివేసింది.












Click it and Unblock the Notifications