వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఇమ్రాన్ ఇన్నింగ్స్ ముగిసినట్టే..? విపక్షాల ఐక్యతారాగం.. అప్పుడే అభ్యర్థి.. ఎవరంటే..

|
Google Oneindia TeluguNews

పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ పదవీ ఊడటం ఖాయం. అతని సొంత పార్టీ ఎంపీలు సభకు హాజరుకాబోమని.. హాజరైన వ్యతిరేకంగా ఓటు వేస్తామని చెబుతున్నారు. దీంతో ఆయన పదవీచుత్యుడు అవడం కన్ఫామ్ అయ్యింది. అందుకోసమే బుధవారం మధ్యాహ్నం నుంచి బిజీగా ఉన్నారు. ఆర్మీ చీఫ్, ఐఎస్ఐ చీఫ్, నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ సమావేశం నిర్వహించారు. ఆ తర్వాత మీడియా సమావేశం ఉంది.. కానీ దానిని దాటవేశారు.

పాకిస్థాన్‌కు ఏడాదిలోపు ఎన్నికలు జరగనున్నాయి. ఎప్పటినుంచో విపక్షాలు ఏకతాటిపైకి వచ్చాయి. ఈ నెల 8వ తేదీన పీఎంఎల్ నేత షరీఫ్ అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. తీర్మానం నెగ్గాలంటే 172 మంది సభ్యుల మద్దతు అవసరం.. అయితే అధికార పీటీఐకు 164 మంది సభ్యుల సపోర్ట్ ఉంది.

Pakistan PM Imran Khan innings nearing end?

ఇలా ఉంటే ప్రతిపక్షాలు కలిసి మీడియా సమావేశం నిర్వహించాయి. తమ ఉమ్మడి అభ్యర్థి ఖలీద్ మక్బుల్ సిద్దిఖీ ఉంటారని ప్రకటించాయి. సో ఇప్పటివరకు అయితే ప్రతిపక్షాలు తమ ప్రయత్నాలను మరింత ముమ్మరం చేశాయి. 3వ తేదీన ఏం జరగనుందో చూడాలీ.. ఒకవేళ ఇమ్రాన్ అవిశ్వాసం నెగ్గితే.. పాకిస్థాన్‌లో ఐదేళ్ల పదవీకాలం పూర్తి చేసుకున్న తొలి ప్రధానిగా అవరించనున్నారు.

ఇమ్రాన్.. పార్టీ పీటీఐకి మద్దతు ఉపసంహరించుకుంటున్నామని బలూచిస్తాన్ అవామీ పార్టీ తెలిపింది. పాకిస్థాన్ దిగువ స‌భ్య‌లో 342 మంది స‌భ్యులు ఉన్నారు. ప్ర‌తిప‌క్షాలు అవిశ్వాసంలో నెగ్గాలంటే వారికి 172 స‌భ్యుల ఓట్లు అవ‌స‌రం. ప్ర‌స్తుతం ఇమ్రాన్ కూట‌మిలో 178 మంది, ప్ర‌తిప‌క్షాల కూట‌మిలో 163 మంది ఉన్నారు. అవిశ్వాస తీర్మానం సందర్భంగా పీటీఐకి చెందిన 24 మంది సభ్యులు ఇమ్రాన్ ఖాన్‌కు వ్యతిరేకంగా ఓటు వేయాలని బహిరంగంగా ప్రకటించారు. ఇమ్రాన్ పార్టీ ఎంపీలు రెబల్స్‌గా మారడంతో ఇప్పుడు ఆయన పదవీకి గండం ఏర్పడింది. గ‌తంలో రెండు సార్లు పాకిస్థాన్ ప్ర‌ధానుల‌పై అవిశ్వాస తీర్మానాల‌ను ప్ర‌వేశ‌పెట్టారు. అవి వీగిపోయాయి. తొలుత 1989లో బెన‌ర్జీ భుట్టోపై అవిశ్వాస తీర్మానం పెట్ట‌గా ఆమె 12 ఓట్ల తేడాతో నెగ్గారు. 2006లో ప్ర‌ధాని షౌకాత్‌ అజీజ్ కూడా అవిశ్వాస తీర్మానాన్ని ఓడించారు.

English summary
Pakistan Prime Minister Imran Khan's government ahead of the April 3 no-confidence vote in the country's National Assembly
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X