Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ఒక్క చుక్క నీటిని కూడా వదులుకోం: భారత్ కు పాకిస్థాన్ స్ట్రాంగ్ వార్నింగ్

పాకిస్థాన్ మరోసారి భారత్ పై కీలక వ్యాఖ్యలు చేసింది. తమకు రావాల్సిన నీటిని ఒక్క చుక్కను కూడా భారత్ కు ఇవ్వబోమని తేల్చి చెప్పింది. తమకు దక్కాల్సిన నీటిని నిలిపివేస్తే యుద్ధానికి సంకేతంగా తాము భావిస్తామని తెలిపింది. ఈమేరకు మరోసారి ఆ దేశ ప్రధాని షెహబాజ్ షరీఫ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు భారత్ ను శత్రు దేశంగా ఆయన అభివర్ణించారు. భారత్ తమకు దక్కాల్సిన నీటిని నిలిపివేస్తుందని మండిపడ్డారు. ఏప్రిల్ 22న పహల్గాం ఉగ్రదాడి తర్వాత పాకిస్థాన్ పై భారత్ కఠిన చర్యలు తీసుకున్న విషయం తెలిసిందే. సింధూ జలాల పంపిణీని రద్దు చేసింది.

అంతకు ముందు పాకిస్తాన్ మాజీ విదేశాంగమంత్రి భిలావల్ భుట్టో కీలక వ్యాఖ్యలు చేశారు. భారత్​ నుంచి ఆరు నదులను స్వాధీనం చేసుకుంటామని హెచ్చరించారు. పాకిస్థాన్ లోని ప్రతీ ​ పౌరుడు భారత్ పై యుద్ధానికి సిద్ధంగా ఉన్నారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ యుద్ధంలో భారత్​ ఓడిపోతుందని వ్యాఖ్యానించారు. భారత్​ సింధూ జలాల ఒప్పందం నిలిపివేత కొనసాగిస్తే, పాక్‌ యుద్ధం గురించి ఆలోచించడం తప్ప మరో మార్గం లేదన్నారు.


మరోవైపు ఇటీవల అమెరికాలో ఏర్పాటు చేసిన బ్లాక్ టై డిన్నర్ లో పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్ పాల్గొని భారత్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. తమకు భారత్ నే కాదు.. సగం ప్రపంచాన్ని ధ్వంసం చేసే శక్తి ఉందని అన్నారు. అలాగే పాకిస్థాన్ కు నీరు వెళ్లకుండా సింధూ నది జలాలను భారత్ నిలిపివేయడంపై అసిమ్ మునీర్ మండిపడ్డారు. సింధూ నదిపై భారత్ కొత్తగా ఓ డ్యామ్ కడుతోందని.. ఆ డ్యామ్ పూర్తయ్యేంత వరకు వేచి చూసి పూర్తయ్యాక 10 మిసైల్స్ తో దాన్ని నేలమట్టం చేస్తామని హెచ్చరించారు. ఆయన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి.

Pakistan Warns India PM Shehbaz Sharif Vows to Protect Every Drop of Water

అయితే తాజాగా పాకిస్థాన్‌ లోని బలూచిస్తాన్ ప్రావిన్స్‌ లో ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. మంగళవారం రాత్రి జరిపిన ఈ దాడిలో 9 మంది పాకిస్థాన్ సైనికులు దుర్మరణం పాలయ్యారు. బలూచిస్తాన్‌ లోని డెరా ఇస్మాయిల్ ఖాన్ జిల్లాలో ఈ ఘటన జరిగింది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+