Punjab News: పంజాబ్ CM మరో పంజాబ్ సీఎం లేఖ.. సరిహద్దులు దాటిన గాలి సమస్య
Pakistan News: గాలి కాలుష్యం తీవ్రత దేశ రాజధాని ఢిల్లీలో విపరీతంగా పెరుగుతోంది. దీంతో స్కూల్స్ మరియు ఆఫీసులకు వెళ్లేందుకు సైతం సామాన్యులు ఇబ్బంది పడుతున్నారు. అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు కూడా కొన్ని రోజుల కిందట ఘాటుగా స్పందించింది. చుట్టుపక్కల రాష్ట్రాల రైతుల పంట వ్యర్థాలను తగలబెట్టకుండా చర్యలు చేపట్టాలని ఆదేశించింది. కాగా ఈ సెగ పొరుగు దేశం పాకిస్థాన్‌కి కూడా గట్టిగా తగిలింది.
పొగ సమస్యను పరిష్కరించడానికి భారత్‌లోని పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్‌కు పాకిస్థాన్ పంజాబ్ ప్రావిన్స్ CM మర్యం నవాజ్ షరీఫ్ లేఖ రాయాలని భావిస్తున్నట్లు ప్రకటించారు. కలుషిత గాలి సమస్య సరిహద్దులను దాటి ఇరు దేశాల్లోని పంజాబ్ రాష్ట్ర ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సమస్యను రాజకీయ కోణంలో కాకుండా మానవతావాదంతో చూడాల్సిన అవసరం ఉందన్నారు. దీపావళి సందర్భంగా ఈ సమస్య మరింత పెరగకుండా ఉండేందుకు అందరం కలిసి పనిచేయాలన్నారు.

లాహోర్ ప్రపంచంలోని అత్యంత కలుషిత నగరంగా నిలిచింది. ఇక్కడ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ (AQI) సోమవారం రాత్రి 708కి చేరుకుంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ వార్షిక గైడ్‌లైన్ విలువ కంటే ఇది 86.2 రెట్లు ఎక్కువ కావడం గమనార్హం. వాయు కాలుష్యం ఈ స్థాయిలో ఉండటంతో ప్రజలో అత్యవసరమైతే మినహా ఇళ్లలో నుంచి బయటకు రావద్దని అధికారులు ఆదేశించారు. ఏదైనా కారణం వల్ల బయటక వెళ్లాల్సి వస్తే తప్పకుండా మాస్క్ ధరించాలని సూచించారు.
Maryam Nawaz Sharif called for cooperation with India to effectively tackle the issue of smog pic.twitter.com/wp9DUBIYeg
— Shiraz Hassan (@ShirazHassan) October 30, 2024
ప్రజలు తమ ఇళ్లలో కిటికీలు మరియు తలుపులను మూసివేశాయలని రాష్ట్ర ప్రభుత్వం అత్యవసర హెచ్చరికను జారీ చేసింది. పాఠశాల సమయాలను సవరించి, పిల్లల భద్రత కోసం తల్లిదండ్రులు మరియు పాఠశాల యాజమాన్యం కఠినమైన భద్రతా చర్యలు తీసుకోవాలని కోరింది. పెద్దఎత్తున పొగ విడుదల చేసే వాహనాలకు వెంటనే జరిమానాలు విధించాలని, జిగ్‌జాగ్ సాంకేతికత లేని ఇటుక బట్టీలను ధ్వంసం చేయాలని ఉత్తర్వులు ఇచ్చింది.












Click it and Unblock the Notifications