మిథునరాశిలో 'బుధాదిత్య యోగం'.. 16 వరకు ఈ రాశులను ఎవరూ ఆపలేరు!

జ్యోతిషశాస్త్రంలో గ్రహాల కదలికలకు, వాటి కలయికలకు ఎంతో ప్రాధాన్యత ఉంది. ముఖ్యంగా నవగ్రహాలకు రాజైన 'రవి' (సూర్యుడు), బుద్ధి కారకుడైన 'బుధుడు' ఒకే రాశిలో కలిసినప్పుడు అత్యంత శక్తివంతమైన 'బుధాదిత్య యోగం' ఏర్పడుతుంది. సాధారణంగా ఈ కలయిక ఏ రాశిలో జరిగినా సానుకూల మార్పులు ఉంటాయి. కానీ, ఈసారి జూలై 7 నుంచి 16 వరకు.. బుధుడికి సొంత రాశి అయిన మిథునరాశిలోనే ఈ అద్భుత యోగం ఏర్పడుతుండటంతో దీని శక్తి మరిన్ని రెట్లు పెరగనుంది.

సమస్యల ఊబిలో కూరుకుపోయిన వారిని సైతం బయటపడేసి, రాజభోగాలు అందించే సత్తా ఈ యోగానికి ఉంది. జూలై 16 వరకు సాగే ఈ ప్రత్యేక గ్రహాల కూటమి వల్ల ముఖ్యంగా నాలుగు రాశుల వారికి కెరీర్, మనీ, పర్సనల్ లైఫ్‌లో ఊహించని అదృష్టం వరించబోతోంది. ఆ లక్కీ రాశుల వివరాలు తెలుసుకుందాం.

ధనస్సు రాశి, మకర రాశివారికి బాగా కలిసిరావాలంటే ఏం చేయాలి?
ధనస్సు రాశి, మకర రాశివారికి బాగా కలిసిరావాలంటే ఏం చేయాలి?
Horoscope Budhaditya Yoga in Gemini No one can stop these zodiac signs until the 16th

వృషభ రాశి

వృషభ రాశి వారికి ఈ యోగం 'ధన స్థానం'లో ఏర్పడుతోంది. దీనివల్ల మీ ఆర్థిక, కుటుంబ పరిస్థితులు మునుపెన్నడూ లేనంతగా మెరుగుపడతాయి. షేర్ మార్కెట్, వ్యాపార పెట్టుబడుల్లో మీరు ఊహించిన దానికంటే అద్భుతమైన లాభాలు వస్తాయి. వృత్తి, వ్యాపారాల్లో రాబడి ఇబ్బడిముబ్బడిగా పెరుగుతుంది. ఉద్యోగస్తులకు ప్రమోషన్‌తో పాటు జీతం భారీగా పెరిగే ఛాన్స్ ఉంది. ఇంట్లో ఉన్న గొడవలు, సమస్యలు తొలగిపోయి సుఖసంతోషాలు వెల్లివిరుస్తాయి. సమాజంలో మీ మాటకు, చేతకు గౌరవం పెరుగుతుంది.

మిథున రాశి

మిథున రాశిలోనే ఈ బుధాదిత్య యోగం ఏర్పడుతుండటంతో ఈ రాశి వారికి డబుల్ బెనిఫిట్స్ ఉంటాయి. మీ ప్రతిభాపాటవాలు, శక్తిసామర్థ్యాలు బయటకు వస్తాయి. ఊహించని విధంగా ధన యోగాలు, రాజయోగాలు పట్టి మీ జీవనశైలి పూర్తిగా మారిపోతుంది. ఆర్థిక, వ్యక్తిగత ఇబ్బందుల నుంచి శాశ్వత ఉపశమనం లభిస్తుంది. గత కొంతకాలంగా వేధిస్తున్న ఆరోగ్య సమస్యలు కుదుటపడతాయి. ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి కచ్చితంగా శుభవార్తలు అందుతాయి. సమాజంలో ఉన్నతమైన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి.

మేష రాశి, వృషభరాశి వారికి బాగా కలిసిరావాలంటే ఏం చేయాలి?
మేష రాశి, వృషభరాశి వారికి బాగా కలిసిరావాలంటే ఏం చేయాలి?

సింహ రాశి

సింహ రాశి వారికి లాభ స్థానంలో రాశ్యాధిపతి అయిన రవితో బుధుడు జతకట్టడం వల్ల పట్టిందల్లా బంగారమే కానుంది. ఆఫీసులో మీ పనితీరుకు ప్రత్యేక గుర్తింపు లభిస్తుంది. ఊహించని పదోన్నతులు దక్కుతాయి. కెరీర్‌లో టాప్ పొజిషన్‌కు చేరుకుంటారు. ఆర్థిక పరిస్థితి ఎంత బాగుంటుందంటే.. మీరు ఇతరులకు అప్పు ఇచ్చే స్థాయికి ఎదుగుతారు. వ్యాపారాలు వేగ పుంజుకుని, లాభాల వర్షం కురుస్తుంది. చాలా రోజులుగా ఎదురుచూస్తున్న ఒక గుడ్ న్యూస్ ఈ సమయంలో వింటారు.

కన్యా రాశి

కన్యా రాశి వారికి దశమ స్థానంలో (కర్మ స్థానం) ఈ యోగం కలగడం వల్ల పూర్తి రాజయోగాలు, రాజపూజ్యాలు లభిస్తాయి. రాజకీయ రంగంలో ఉన్న వారికి అపారమైన క్రేజ్, ప్రాబల్యం పెరుగుతుంది. కొద్దిపాటి ప్రయత్నంతోనే ప్రభుత్వ ఉద్యోగం సాధించే అవకాశాలు మెండుగా ఉన్నాయి. కాంపిటీటివ్ ఎగ్జామ్స్, ఇంటర్వ్యూలలో అభ్యర్థులు ఘనవిజయాలు సాధిస్తారు. నిరుద్యోగులకు కలలో కూడా ఊహించని రేంజ్‌లో మల్టీనేషనల్ కంపెనీల నుంచి జాబ్ ఆఫర్స్ వస్తాయి. ఉద్యోగం మారాలనుకునే వారికి ఇది పర్ఫెక్ట్ టైమ్.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+