Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

లీటర్‌ పెట్రోల్‌ రూ.2వేలు.. కేజీ చక్కెర రూ.7వేలు.. ఎక్కడో తెలుసా..?

ఇజ్రాయెల్- హమాస్ ల మధ్య భీకర పోరు ఏళ్లకు ఏళ్లుగా సాగుతూనే ఉంది. అమెరికా లాంటి అగ్ర దేశాలు మధ్యవర్తిత్వం చేయాలని చూసినా చర్చలు ఫలించలేదు. దీంతో అక్కడి ఆధిపత్య పోరు నానాటికీ పెరిగిపోతోంది. యుద్ధం కారణంగా అక్కడి ప్రజల పరిస్థితి దయనీయంగా మారింది. అనేక మంది ప్రజలు ఆహారం కొనే పరిస్థితి లేక దాతల కోసం ఎదురుచూస్తున్నారు. నిత్యావసరాల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. ఈ నేపథ్యంలో కొద్ది రోజుల నుంచి వారికి కొత్త కష్టం వచ్చి పడింది.

ఇజ్రాయెల్- హమాస్ యుద్ధంతో ఇప్పటికే ఆకలితో అలమటిస్తున్న పాలస్తీనియన్లకు తాజాగా కొత్త కష్టాలు వచ్చాయి. కరెన్సీ కష్టాలు అధికం అయ్యాయి. ఆహారం, ఇంథనం, వైద్యం కోసం ఇప్పటి వరకు ఎలాంటి ఇబ్బందులు పడ్డారో.. ఇప్పుడు కరెన్సీ కోసం ఇబ్బందులు ప్రారంభం అయ్యాయి. ఉద్రిక్తతల కారణంగా అక్కడి వాణిజ్య వ్యవస్థలు మూతబడ్డాయి. బ్యాంకులు, ఏటీఎమ్ లు మూసివేశారు. దీంతో అక్కడి ప్రజలు రోజువారీ ఖర్చులకు అవసరమైన డబ్బు కోసం మిడిల్ మెన్(మధ్యవర్తులను) ఆశ్రయించాల్సి వస్తోంది. అటు దళారులు సైతం ఇదే అదనుగా కమిషన్ ను భారీగా పెంచేశారు. గతంలో ఐదు శాతం ఉన్న కమిషన్ ఇప్పుడు 40 శాతానికి చేరింది. దీంతో అక్కడి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

Palestinians Endure Severe Hardships as Israel-Hamas Conflict Drives Petrol to Rs 2 000 Liter

గాజా ప్రజలు ఇజ్రాయెల్‌ కరెన్సీ షెకెల్‌ ను రోజూ వారీ లావాదేవీలకోసం ఉపయోగిస్తారు. హమాస్- ఇజ్రాయెల్ ఉద్రిక్తతల కారణంగా పాలస్తీనియన్లకు నగదు సరఫరాను ఇజ్రాయెల్ నిలిపి వేసింది. దీంతో స్థానికులకు ఇబ్బందిగా మారింది. మరోవైపు ద్రవ్యోల్బణం, నిరుద్యోగిత పెరిగిపోతున్నాయి. మరోవైపు చక్కెర, పెట్రోల్ ధరలు భారీగా పెరిగిపోయినట్లు స్థానికులు వాపోతున్నారు. భారత కరెన్సీ ప్రకారం చూస్తే పాలస్తీనాలో కేజీ చక్కెర రూ.7వేలు.. లీటర్‌ పెట్రోల్‌ రూ.2 వేలుగా ఉన్నట్లు సమాచారం.

ఇక ఇటీవల వరల్డ్ ఫుడ్ ప్రోగ్రాం(WFP) కూడా ఇదే విషయంపై ఆందోళన వ్యక్తం చేసింది. గాజాలోని ప్రజలు కరవుతో అల్లాడుతున్నారు. యుద్ధం మళ్లీ తీవ్రతరం కావడంతో బోర్డర్లు అన్నీ మూసేశారు. ఆహార నిల్వల కొరత ఏర్పడింది. ప్రజలు ఇబ్బందుల్లో ఉన్నారు.. అని వరల్డ్ ఫుడ్ ప్రోగ్రాం అక్కడి పరిస్థితిని వివరించింది. ఈ ఏడాది మార్చి 2 నుంచి ప్రపంచ దేశాల సాయం ఆగిపోయిందని.. అప్పటి నుంచి అక్కడి పిల్లలు పౌష్టికాహార లోపంతో ఉన్నారని వరల్డ్ ఫుడ్ ప్రోగ్రాం పేర్కొంది. గాజాలో దాదాపు 4 లక్షల 70 వేల మంది క్రిటికల్ హంగర్ సమస్యతో ఉన్నారని వివరించింది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+