మేమే: ఐసిస్ వీడియో,పారిస్ శివార్లలో కారు దొరికింది
పారిస్: ఫ్రాన్స్‌లోని పారిస్‌లో జరిగిన తీవ్రవాద దాడిని తామే చేయించామని ఐసిస్ తీవ్రవాదులు చెప్పారు. పారిస్ తీవ్ర దాడిలో 129 మృతి చెందిన విషయం తెలిసిందే. బృందాలుగా విడిపోయిన తీవ్రవాదులు విచక్షణారహితంగా కాల్పులు, ఆత్మహుతి దాడి చేశారు.
కాగా, ఫ్రాన్స్ పాటిస్తున్న విధానాలకు వ్యతిరేకంగా, ప్రతీకారం తీర్చుకునేందుకే దాడులను చేసినట్టు చెబుతున్న ఐసిస్ వీడియో ఒకటి విడుదలైంది.
తమపై బాంబు దాడులు జరుపుతున్నంత కాలం, ఆయా దేశాలకు చెందిన ప్రజలు మార్కెట్‌కు వెళ్లాలన్నా భయపడే పరిస్థితి వస్తుందని, ఒక్క క్షణం కూడా ప్రశాంతంగా ఉండలేరని ఈ వీడియోలో అబూ మర్యామ్ అనే ఉగ్రవాది హెచ్చరికలు చేశాడు.

తమ వద్ద ఆయుధాలు ఉన్నాయని, వాటిని తీసుకువెళ్లే కార్లు ఉన్నాయని, టార్గెట్లు సిద్ధంగా ఉన్నాయని చెబుతున్నట్టు వీడియోలో ఉంది. తమ వద్ద విషం కూడా ఉందని, శత్రువుల్లో ఒక్కరి ఆహారాన్నైనా విషపూరితం చేయాలని, వారికి నిద్ర లేకుండా చూడాలని పక్కనున్న ఉగ్రవాదులకు చెబుతున్నట్లు ఉంది.
పారిస్ శివార్లలో ఉగ్రవాదుల కారు స్వాధీనం
పారిస్‌లో శుక్రవారం రాత్రి ఉగ్రవాదులు భీకర దాడికి వినియోగించిన కారును స్వాధీనం చేసుకున్నారు. పారిస్ శివారు ప్రాంతమైన మోంత్రాయ్ ప్రాంతంలో పోలీసులు దీనిని గుర్తించారు. కాగా, ఉగ్రదాడికి కారణమైన ఎనిమిది మంది ఉగ్రవాదులు హతమైనట్లు పోలీసులు చెప్పారు.
ఇప్పటికే ఓ ఉగ్రవాది ఎవరనేది గుర్తించారు. తాజాగా రెండో ఉగ్రవాదిని కూడా గుర్తించారు. అహ్మద్ అల్ముహ్మద్ అనే ఉగ్రవాది పాస్‌పోర్టు లభించింది. ఉగ్రవాదులు సిరియా నుంచి గ్రీస్ మీదుగా ఫ్రాన్స్ చేరుకొని ఉంటారని పోలీసులు భావిస్తున్నారు.












Click it and Unblock the Notifications