పుతిన్‌తో మోదీ మైండ్ బ్లాకింగ్ డీల్! లీకైన సంచలన విషయాలు

ప్రపంచ రాజకీయం ఇప్పుడు భారత రాజధాని న్యూఢిల్లీ వైపు అత్యంత ఆసక్తిగా చూస్తోంది. బ్రిక్స్ (BRICS) శిఖరాగ్ర సదస్సు 2026 వేదికగా భారత ప్రధాని నరేంద్ర మోదీ, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ మధ్య జరిగిన ద్వైపాక్షిక చర్చలు అంతర్జాతీయంగా తీవ్ర ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ఉక్రెయిన్ యుద్దం ప్రారంభమైన తర్వాత రష్యా వెలుపల పుతిన్ నేరుగా పాల్గొంటున్న తొలి బ్రిక్స్ సదస్సు ఇదే కావడం గమనార్హం.

ప్రపంచ ఆర్థిక వ్యవస్థలను కుదిపేస్తున్న సంక్షోభాలు, ఇంధన కొరత , మారుతున్న భౌగోళిక సమీకరణాల నడుమ సరిగ్గా మధ్యాహ్నం 3:30 గంటలకు ప్రారంభమైన ఈ భేటీ దాదాపు రెండు గంటల పాటు అత్యంత కీలక అంశాలపై సాగింది. ప్రస్తుతం పశ్చిమాసియాలో ఇరాన్ ఉద్రిక్తతలు పెరిగిపోతున్న వేళ, భారత్‌కు నిరంతర ఇంధన భద్రత కల్పించడంపై ఈ భేటీలో ప్రధానంగా చర్చించారు.

PM Modi and Putin Hold Bilateral Talks in New Delhi Focus on Energy Security and Ukraine Peace Process

దీంతో పాటు 2030 నాటికి ఇరుదేశాల మధ్య ద్వైపాక్షిక వర్తకాన్ని ఏకంగా 100 బిలియన్ డాలర్లకు పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. రక్షణ రంగం, సాంకేతికత, సివిల్ న్యూక్లియర్ ప్రాజెక్టులు, ఫార్మా ఉత్పత్తులు , ఎరువుల సరఫరాలో మునుపెన్నడూ లేని విధంగా భాగస్వామ్యాన్ని బలోపేతం చేసుకోవాలని ఇరు నాయకులు నిర్ణయించారు. అంతేకాకుండా, రష్యాలోని తయారీ రంగానికి అవసరమైన నైపుణ్యమున్న భారతీయ కార్మికులను పంపించే ప్రతిపాదనపై కూడా సానుకూల చర్చ జరిగింది.

పుతిన్ రాకముందే హడావుడి.. సెక్యూరిటీ టీమ్ ల్యాండ్ అయిపోయింది..
పుతిన్ రాకముందే హడావుడి.. సెక్యూరిటీ టీమ్ ల్యాండ్ అయిపోయింది..

"ఇది యుద్దాల యుగం కాదు".. మోదీ మరోసారి స్పష్టీకరణ!

ఉక్రెయిన్ యుద్ధం ఐదో ఏట ప్రవేశించిన నేపథ్యంలో, ఈ వివాదానికి త్వరితగతిన శాంతియుత పరిష్కారం కనుగొనాలని ప్రధాని మోదీ మరోసారి పుతిన్‌ను కోరారు. "అంతులేని యుద్ధం కంటే.. యుద్ధానికి ముగింపు పలకడమే మార్గం" అని మోదీ పుతిన్‌కు సూచించారు. తాము ఈ అంశంలో తటస్థంగా లేమని, ఎల్లప్పుడూ శాంతి వైపే నిలబడతామని భారత్ తన స్పష్టమైన వైఖరిని పునరుద్ఘాటించింది. గడిచిన 11 ఏళ్లలో వీరిద్దరూ భేటీ కావడం ఇది 19వ సారి కావడం, వారి మధ్య ఉన్న వ్యక్తిగత సంబంధాలు ఇరుదేశాల వ్యూహాత్మక బంధానికి కొండంత బలాన్ని ఇస్తున్నాయి.

ఈ తెల్లవారు జామున ఢిల్లీలో దిగిన వ్లాదిమిర్ పుతిన్
ఈ తెల్లవారు జామున ఢిల్లీలో దిగిన వ్లాదిమిర్ పుతిన్

చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ రాకతో ఉత్కంఠ!

ఒకవైపు పుతిన్‌తో భేటీ ముగియగా, మరోవైపు శనివారం నుంచి ప్రారంభం కానున్న రెండ్రోజుల బ్రిక్స్ సదస్సు కోసం చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ భారత్‌కు రాబోతుండటం రక్షణ వర్గాల్లో తీవ్ర ఉత్కంఠను రేపుతోంది. 2019 తర్వాత జిన్‌పింగ్ భారత్‌లో పర్యటించడం ఇదే తొలిసారి. తూర్పు లడఖ్ సరిహద్దు వివాదం తర్వాత ఇరుదేశాల మధ్య దౌత్య సంబంధాలు క్రమంగా సాధారణ స్థితికి వస్తున్నప్పటికీ.. సరిహద్దు సమస్యలు, తీవ్ర వర్తక లోటు , వ్యూహాత్మక పోటీ సవాళ్లుగా మారిన తరుణంలో మోదీ-జిన్‌పింగ్ భేటీ అంతర్జాతీయంగా సంచలనం సృష్టించబోతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+