చిరకాల మిత్రుడికి కడసారి వీడ్కోలు పలికిన మోదీ..!!
టోక్యో: జపాన్ మాజీ ప్రధానమంత్రి షింజో అబే పార్థివదేహానికి ఇవ్వాళ అంత్యక్రియలు ఆరంభం అయ్యాయి. జులై 8వ తేదీన నారా సిటీలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆయన హత్యకు గురయ్యారు. సుమారు రెండున్నర నెలల తరువాత ఆయన పార్థివదేహానికి జపాన్ ప్రభుత్వం అంత్యక్రియలను చేపట్టింది. రెండో ప్రపంచ యుద్ధం తరువాత జపాన్ ప్రభుత్వం అధికార లాంఛనాలతో అంత్యక్రియలను నిర్వహిస్తోండటం ఇది రెండోసారి.

నిరసనల మధ్య..
అధికార లాంఛనాలతో అంత్యక్రియలను నిర్వహించాలా? వద్దా? అనే అంశంపై జపాన్ ప్రభుత్వం ప్రజాభిప్రాయాన్ని సేకరించింది. 60 శాతం మంది దీనికి అనుకూలంగా ఓటు వేశారు. దీనికి వ్యతిరేకంగా జపాన్‌లో పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తమౌతోన్నాయి. అధికార లాంఛనాలతో షింజో అబే పార్థివదేహానికి అంత్యక్రియలను నిర్వహించడాన్ని నిరసిస్తూ వేలాదిమంది రోడ్డెక్కారు. నో స్టేట్ ఫ్యూనరల్ అంటూ బ్యానర్లను ప్రదర్శించారు.

భారీ బందోబస్తు..
నిరసనకారులు అడ్డుపడే అవకాశం ఉన్నందున కట్టుదిట్టమైన భద్రత వ్యవస్థను ఏర్పాటు చేశారు. మూడంచెల భద్రత మధ్య అంత్యక్రియలు కొనసాగుతున్నాయి. లక్షలాది రూపాయలను వ్యయం చేయాల్సి ఉంటుందని, జపాన్ ఆర్థిక వ్యవస్థ దీనికి సహకరించదనేది నిరసనకారుల వాదన. 1.7 బిలియన్ యెన్‌లను జపాన్ ప్రభుత్వం అంత్యక్రియల కోసం ఖర్చు చేస్తోందని టకకగె ఫుజిట అనే నిరసనకారుడు స్పష్టం చేశారు.

రాజ్యాంగ విరుద్ధ చర్యగా..
అధికార లాంఛనాలతో అంత్యక్రియలను నిర్వహించడానికి వ్యతిరేకంగా పలు న్యాయస్థానాల్లో భారీ సంఖ్యలో పిటీషన్లు దాఖలయ్యాయంటే- దీని తీవ్రత ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. తాము పన్నుల రూపంలో చెల్లించే డబ్బును ఎలాంటి చట్టపరమైన ఆధారం లేకుండా ప్రభుత్వ అంత్యక్రియల కోసం ఖర్చు చేస్తోందని, ఇది రాజ్యాంగ వ్యతిరేక చర్యగా పేర్కొన్నారు. పార్లమెంటరీ ఆమోదం లేకుండా ప్రధానమంత్రి కిషిద ఏకపక్షంగా ఈ నిర్ణయం తీసుకున్నారని విమర్శించారు.

కిషిదతో భేటీ..
కాగా- ఈ నిరసనల మధ్యే షింజో అబే అంత్యక్రియలు కొనసాగాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దీనికి హాజరయ్యారు. సోమవారం రాత్రి ప్రత్యేక విమానంలో న్యూఢిల్లీ నుంచి బయలుదేరి వెళ్లిన ఆయన ఈ తెల్లవారు జామున టోక్యోలో దిగారు. అనంతరం ఆ దేశ ప్రధాని ఫ్యుమియో కిషిదతో సమావేశం అయ్యారు. అక్కడి నుంచి నేరుగా బుడోకాన్ హాల్‌కు వెళ్లారు. అంత్యక్రియలకు హాజరయ్యారు. పార్థివ దేహానికి నివాళి అర్పించారు.

100 దేశాల నుంచి ప్రతినిధులు..
ఈ సందర్భంగా భారత్-జపాన్ మధ్య చిరకాలంగా కొనసాగుతూ వస్తోన్న స్నేహం, షింజో అబేతో ఉన్న సంబంధాల గురించి ప్రస్తావించారు. దౌత్య, ఆర్థిక, వాణిజ్యపరంగా రెండు దేశాల మధ్య భావసారూప్యం ఉందని పేర్కొన్నారు. అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్, ఆస్ట్రేలియా ప్రధాని ఆంటోని అల్బెనీస్ సహా 20 దేశాధినేతలు, ప్రధానులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. మరో 100 దేశాల నుంచి విదేశాంగ మంత్రులు, రాయబారులు, హైకమిషనర్లు షింజో అబే అంత్యక్రియల్లో పాల్గొన్నారు.
-
ఇక పెట్రోల్ బంకుల్లోనూ మద్యం.. కొత్త ఎక్సైజ్ పాలసీకి ఆమోదం! -
'ఆ ఒక్క కండీషన్ తో స్టార్ హీరోతో నిజంగానే శోభనం'.. హీరోయిన్ సంచలనం..!! -
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.. -
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఓటీటీలోకి పవన్ కల్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్'.. ఆ రోజు నుంచే స్ట్రీమింగ్..? -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
ప్రభాస్ ఫాలో అవుతున్న ఏకైక తెలుగు హీరో ఎవరో తెలుసా..? -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
ఏపీలో పెరగనున్న అసెంబ్లీ సీట్లు, జిల్లాల వారీ జాబితా - కలిసొచ్చేదెవరికి..!! -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!!












Click it and Unblock the Notifications