G20 summit : ఉక్రెయిన్ పై జీ20 దేశాల జోక్యం కోరిన మోడీ-యుద్ధం ఆపేందుకు కీలక సలహా..
ఇండోనేషియాలో జరుగుతున్న జీ20 సదస్సులో ప్రధాని మోడీ ఉక్రెయిన్ యుద్ధం అంశాన్ని లేవనెత్తారు. ఉక్రెయిన్ లో నెలల తరబడి సాగుతున్న యుద్ధంపై స్పందించిన ప్రధాని మోడీ.. జీ20 దేశాధినేతల జోక్యం కోరారు. ఉక్రెయిన్ లో తక్షణం కాల్పుల విరమణ ప్రకటించడంతో పాటు దౌత్య ప్రయత్నాలు ముమ్మరం చేయాలని ప్రధాని మోడీ సలహా ఇచ్చారు.
జీ20 సదస్సులో ప్రధాని మోడీ తన ప్రసంగంలో రెండో ప్రపంచ యుద్ధం నాటి భయానక పరిస్ధితుల్ని గుర్తుచేశారు. తిరిగి అలాంటి పరిస్దితులు అంతర్జాతీయంగా తలెత్తకుండా ఉండేందుకు ఉక్రెయిన్ సంక్షోభం పరిష్కారానికి ప్రపంచ దేశాలు ముందుకు రావాలని ప్రధాని మోడీ కోరారు. ఇప్పటికే తాను ఇరుదేశాధినేతలతో మాట్లాడానని, మిగిలిన దేశాలు కూడా జోక్యం చేసుకుని సమస్య పరిష్కారం కోసంప్రయత్నించాలన్నారు.

ఉక్రెయిన్‌లో కాల్పుల విరమణ, దౌత్య మార్గాన్ని తిరిగి అనుసరించాలని తాను పదేపదే కోరుతున్నట్లు మోడీ తెలిపారు. గత శతాబ్దంలో రెండవ ప్రపంచ యుద్ధం ప్రపంచంలో విధ్వంసం సృష్టించిందని, ఆ తర్వాత అప్పటి నేతలు తీవ్రమైన శాంతి మార్గాన్ని అనుసరించే ప్రయత్నం చేశారన్నారు. ఇప్పుడు ఇది మన వంతన్నారు. కోవిడ్ అనంతర కాలానికి కొత్త ప్రపంచాన్ని సృష్టించే బాధ్యత మన భుజాలపై ఉందని మోడీ తెలిపారు. ప్రపంచంలో శాంతి, సామరస్యం, భద్రతకు హామీ ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు. వచ్చే ఏడాది బుద్ధుడు, గాంధీల పుణ్యభూమిలో( భారత్ లో) జీ20 సమావేశాలు జరగనుందని గుర్తుచేశారు.












Click it and Unblock the Notifications