2018లో ఫేస్‌బుక్‌ను నిషేధిస్తాం: రష్యా గట్టి హెచ్చరిక
ఫేస్‌బుక్ పైన నిషేధం విధిస్తామని రష్యా టెలికాం సంస్థ అధినేత అలెగ్జాండర్ హెచ్చరించారు. ఫేస్‌బుక్ తమ చట్టాలకు అనుగుణంగా పని చేయడం లేదని ఆరోపించారు.
మాస్కో: ఫేస్‌బుక్ పైన నిషేధం విధిస్తామని రష్యా టెలికాం సంస్థ అధినేత అలెగ్జాండర్ హెచ్చరించారు. ఫేస్‌బుక్ తమ చట్టాలకు అనుగుణంగా పని చేయడం లేదని ఆరోపించారు.
మాస్కోలో ఆయన మీడియాతో మాట్లాడారు. విదేశీ మెసేజింగ్ సర్వీసులు, సెర్చ్ ఇంజన్లు, సామాజిక మాధ్యమాల వెబ్‌సైట్లు నిబంధనలకు విరుద్ధంగా ప్రజల వ్యక్తిగత సమాచారాన్ని నిక్షిప్తం చేస్తున్నాయన్నారు.

2014లో రష్యాలో రూపొందిన చట్టం ప్రకారం రష్యన్లకు సంబంధించిన సమాచారాన్ని రష్యాలోని సర్వర్లలోనే నిక్షిప్తం చేయాల్సి ఉంటుందన్నారు.
అయితే ఫేస్‌బుక్, ట్విట్టర్ వంటి సంస్థలు ఈ నిబంధనలు పాటించకుండా రష్యన్ల వ్యక్తిగత సమాచారాన్ని వారి ప్రమేయం లేకుండా తీసుకుంటున్నాయన్నారు. తమ హెచ్చరికలను పరిగణనలోకి తీసుకోకుంటే 2018లో దానిపై నిషేధం విధిస్తామని హెచ్చరించారు. ఇప్పటికే లింక్డ్ ఇన్ తమ దేశంలో నిషేధం ఎదుర్కొంటోందన్నారు.












Click it and Unblock the Notifications