ఏకంగా 1,454 అడుగుల ఎత్తులో ప్రపోజ్ చేసుకున్న రష్యన్ జంట.. వీడియో వైరల్!

ప్రేమ కోసం కొందరు పూలు ఇస్తారు.. మరికొందరు ఖరీదైన ఉంగరాలు బహుమతిగా ఇస్తారు. కానీ ఓ రష్యన్ జంట మాత్రం ప్రపంచంలోనే అత్యంత ప్రసిద్ధి చెందిన భవనాల్లో ఒకటైన న్యూయార్క్ ఎంపైర్ స్టేట్ బిల్డింగ్ శిఖరంపైకి ఎక్కి ప్రేమను వ్యక్తం చేసింది. 1,454 అడుగుల ఎత్తులో జరిగిన ఈ హైరిస్క్ ప్రపోజల్ ప్రపంచవ్యాప్తంగా సంచలనంగా మారింది. అయితే ప్రేమకథలా ప్రారంభమైన ఈ ఘటన చివరకు పోలీసుల అరెస్ట్‌తో ముగిసింది.

ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచిన స్టంట్..

రష్యాకు చెందిన రూఫ్‌టాపర్‌లు, అడ్వెంచర్ కంటెంట్ క్రియేటర్లు ఏంజెలా నికోలావు (Angela Nikolau), వాన్యా బీర్కస్ (Vanya Birkus) అర్ధరాత్రి సమయంలో నల్లటి దుస్తులు, ముఖాలకు మాస్క్‌లు ధరించి ఎంపైర్ స్టేట్ బిల్డింగ్‌లోని సాధారణ ప్రజలకు అనుమతి లేని ట్రాన్స్‌మిషన్ టవర్‌పైకి ఎక్కారు. అక్కడికి చేరుకున్న తర్వాత ప్రపంచ శాంతిని సూచించే సందేశంతో కూడిన నల్లటి బ్యానర్‌ను విప్పి ప్రదర్శించారు. ఆ సమయంలో Observation Deckపై ఉన్న సందర్శకులు ఈ దృశ్యాన్ని చూసి ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. కొందరు వీడియోలు తీయగా, మరికొందరు భయంతో భద్రతా సిబ్బందికి సమాచారం అందించారు.

russian-couple-arrested-after-performing-dangerous-stunt-and-marriage-proposal-on-empire-state-build

1,454 అడుగుల ఎత్తులో లవ్ ప్రపోజల్..

కాగా బ్యానర్ ప్రదర్శన అనంతరం ఈ స్టంట్ మరో ఊహించని మలుపు తీసుకుంది. యాంటెన్నా దిగువ భాగంలోని సన్నని ప్లాట్‌ఫారమ్‌పై వాన్యా బీర్కస్ మోకాళ్లపై కూర్చుని ఏంజెలా నికోలావుకు వివాహ ప్రతిపాదన చేశాడు. వెంటనే ఆమె అంగీకరించడంతో ఇద్దరూ ఒకరినొకరు ఆలింగనం చేసుకుని అక్కడే తమ నిశ్చితార్థాన్ని జరుపుకున్నారు.

ఈ అరుదైన క్షణాన్ని వారు వీడియో రూపంలో సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా, కొన్ని గంటల్లోనే లక్షలాది మంది వీక్షించారు. అయితే ఈ వీడియోలు ప్రశంసలతో పాటు తీవ్ర విమర్శలను కూడా ఎదుర్కొంటున్నాయి.

ఈ జంట ఎవరు?

ఏంజెలా నికోలావు ప్రపంచవ్యాప్తంగా "రూఫ్‌టాపర్"గా పేరొందింది. ఎత్తైన భవనాలు, వంతెనలు, క్రేన్లపైకి ఎక్కి అక్కడ ఫోటోలు, వీడియోలు తీసే అడ్వెంచర్ ఆర్టిస్టుగా ఆమెకు మంచి గుర్తింపు ఉంది. తాను చేసే స్టంట్లు కేవలం సాహసం కోసం మాత్రమే కాకుండా "భయం, స్వేచ్ఛ, కళ" వంటి భావాలను వ్యక్తపరిచే ప్రయత్నమని ఆమె గతంలో పలు ఇంటర్వ్యూల్లో వెల్లడించింది.

వాన్యా బీర్కస్ కూడా ఇదే తరహా అడ్వెంచర్ కంటెంట్ క్రియేటర్. ఈ జంట గతంలో అమెరికాలోని శాన్ ఫ్రాన్సిస్కో బే బ్రిడ్జ్, మలేషియాలోని ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన భవనాల్లో ఒకటైన మెర్డెకా 118, దుబాయ్, హాంకాంగ్, చైనా వంటి దేశాల్లోని పలు భారీ నిర్మాణాలపై కూడా ఇలాంటి సాహసాలు చేసి వార్తల్లో నిలిచింది.

ఎందుకింత ప్రమాదకరం?

ఎంపైర్ స్టేట్ బిల్డింగ్ ట్రాన్స్‌మిషన్ టవర్ సాధారణ సందర్శకులకు పూర్తిగా నిషేధిత ప్రాంతం. అక్కడ టెలివిజన్, రేడియో ప్రసారాలకు సంబంధించిన అత్యాధునిక పరికరాలు, అధిక విద్యుత్ శక్తితో పనిచేసే యాంటెనాలు ఉంటాయి. అంతేకాకుండా అత్యంత వేగంగా వీచే గాలులు, చాలా ఇరుకైన మార్గాలు, భద్రతా పరిమితులు ఉండటంతో చిన్న పొరపాటు కూడా ప్రాణాంతక ప్రమాదానికి దారితీసే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. అలాంటి ప్రాంతంలో ఎలాంటి సేఫ్టీ గేర్ లేకుండా స్టంట్ చేయడం అత్యంత ప్రమాదకరమని భద్రతా నిపుణులు హెచ్చరిస్తున్నారు.

వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు..

ఘటన సమాచారం అందుకున్న వెంటనే న్యూయార్క్ పోలీసులు, భవన భద్రతా సిబ్బంది అప్రమత్తమయ్యారు. పరిశీలనా వేదికను వెంటనే ఖాళీ చేయించి సందర్శకులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. భద్రతా చర్యల్లో భాగంగా భవనం పరిసరాల్లోని కొన్ని రహదారులను తాత్కాలికంగా మూసివేశారు. ఒక పోలీసు హెలికాప్టర్ కూడా భవనం చుట్టూ గస్తీ వేసింది. కొంతసేపటి తర్వాత ఇద్దరూ ఎలాంటి ప్రతిఘటన లేకుండా కిందకు దిగగా, పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. నిషేధిత ప్రాంతంలో అక్రమ ప్రవేశం, ప్రజల భద్రతకు ప్రమాదం కలిగించడం, భద్రతా నిబంధనల ఉల్లంఘన వంటి అభియోగాలపై కేసు నమోదు చేసినట్లు సమాచారం.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+