మైక్రోసాఫ్ట్ అతి పెద్ద తప్పు: మొబైల్‌పై సత్య నాదెళ్ల
ఓర్లాండో: టెక్నాలజీరంగంలో ప్రపంచ అగ్రగామి సంస్థగా ఎదిగిన మైక్రోసాఫ్ట్ కూడా ఓ పెద్ద తప్పు చేసిందని ఆ కంపెనీ సీఈవో సత్య నాదెళ్ల చెప్పారు. భవిష్యత్తు అంతా కంప్యూటర్లదేనని లెక్కలు వేసి, మొబైల్ విప్లవాన్ని గుర్తించడంలో ఘోరంగా విఫలమయ్యామని చెప్పారు.
మొబైల్‌ను విస్మరించడమే మైక్రోసాఫ్ట్ గతంలో చేసిన అతిపెద్ద తప్పని సత్య నాదెళ్ల పేర్కొన్నారు. ఎప్పటికీ కంప్యూటరే ఆధిపత్యం చెలాయిస్తుందనే భావిస్తూ వచ్చామన్నారు. మొబైల్ సృష్టిస్తున్న సాంకేతిక విప్లవాన్ని అంచనా వేయడంలో విఫలమయ్యామన్నారు.
ఆరు అంగుళాల మొబైల్ ఫోన్ ఇపుడు అత్యధికంగా అమ్ముడుపోతున్న పరికరమని అంగీకరిస్తున్నానని చెప్పారు. ఒక వెబ్‌సైట్‌కు ఆయన ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సందర్భంగా పై వ్యాఖ్యలు చేశారు.

1992లో కంపెనీలో తాను చేరిన సమయంలో తమ దృష్టి అంతా ప్రతి ఇంటిలోకీ కంప్యూటర్‌ను తీసుకువెళ్లడం పైనే అని, ఆ లక్ష్యాన్ని తాము సాధించామన్నారు.
రోజుకో ఫోన్‌ను విడుదల చేయడం పైన తనకు నమ్మకం లేదన్నారు. ప్రత్యేకతను నిలుపుకుంటూనే, మార్కెట్ వాటాను అందిపుచ్చుకునే కొన్ని ఫోన్లపైనే మేం దృష్టి సారిస్తామని చెప్పారు. తమ ఉత్పత్తులు, వినూత్నత ప్రమాణాలను అవే చెబుతాయన్నారు.












Click it and Unblock the Notifications