వైరల్ వీడియో: SCO సదస్సులో పాక్ ప్రధానికి మోడీ-పుతిన్ షాక్..! బిత్తరపోయిన వేళ..!
భారత్ తో నిత్యం వైరం కోరుకునే పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ కు ఇవాళ గట్టి షాక్ తగిలింది. చైనాలోని తియాంజిన్ లో ఇవాళ షాంఘై సహకార సమాఖ్య (ఎస్సీవో) సదస్సు ప్రారంభమైంది. ఇందులో ప్రధాని మోడీతో పాటు పలు ప్రపంచ దేశాధినేతలు పాల్గొన్నారు. అసలే అమెరికా-భారత్ వార్ సాగుతున్న వేళ ఈ సదస్సుకు ఎక్కడ లేని ప్రాధాన్యం ఏర్పడింది. అమెరికాకు వ్యతిరేకంగా ఎస్సీవో కూటమిలోని దేశాలు జట్టుకట్టవచ్చనే వాదనల నేపథ్యంలో ఈ సదస్సులో పలు కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి.
ఇవాళ ఎస్సీవో సదస్సుకు హాజరైన ప్రధాని మోడీని రష్యా అధ్యక్షుడు వ్లాదిమీర్ పుతిన్, చైనా అధ్యక్షుడు షీ జిన్ పింగ్ సాదరంగా ఆహ్వానించారు. చాలా సేపు ఈ ముగ్గురూ నవ్వుతూ పలు విషయాలు మాట్లాడుకున్నారు. అనంతరం ప్రధాని మోడీ విడివిడిగానూ పుతిన్, షీ జిన్ పింగ్ తో మాట్లాడుతూ కనిపించారు. ఇదే క్రమంలో ప్రధాని మోడీ రష్యా అధినేత పుతిన్ తో కలిసి మాట్లాడుతూ సాగిపోతుండగా మధ్యలో పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ కనిపించారు. అయితే వీరిద్దరూ ఆయన్ను పట్టించుకోలేదు.

Pakistan PM Shehbaz Sharif looks on as PM Modi and President Putin walk past him at the SCO Summit. pic.twitter.com/7u9FgnS6an
— Tar21Operator (@Tar21Operator) September 1, 2025
షెహబాజ్ షరీఫ్ పక్కనే నిలబడి ఉండగానే ఆయన ముందు నుంచి ప్రధాని మోడీ, పుతిన్ జంట నవ్వుతూ మాట్లాడుకుంటూ వెళ్లిపోయిన దృశ్యాలు ప్రపంచవ్యాప్తంగా వైరల్ అయ్యాయి. దీంతో పాకిస్తాన్ ప్రధాని ఎస్సీవో సదస్సులో ఒంటరయ్యారన్న చర్చ సాగుతోంది. అసలే ఇవాళ జరుగుతున్న ఎస్సీవో సదస్సులో తీవ్రవాదానికి వ్యతిరేకంగా పోరాటం, డబుల్ గేమ్స్ కు చెక్, పహల్గాం ఉగ్రదాడికి ఖండన వంటి ప్రధాని మోడీ లేవనెత్తిన పలు అంశాలకు సదస్సు డిక్లరేషన్ లో ఆమోదం తెలిపింది. అదే సమయంలో అదే పహల్గా దాడికి కారణమైన పాకిస్తాన్ ప్రధానిని ఎవరూ పట్టించుకోకపోవడం చర్చనీయాంశంగా మారింది.












Click it and Unblock the Notifications