నేపాల్‌లో విమానం అదృశ్యం: 23మంది మృతి
ఖాట్మాండ్: నేపాల్ పర్వతాల్లో బుధవారం ఉదయం బయలుదేరిన ఓ ప్రత్యేక విమానం అదశ్యమైందని నేపాల్ అధికారులు ప్రకటించారు. నేపాల్ పర్వతాలలో చిక్కుకుని ఈ విమానం కనిపించకుండా పోయి ఉండొచ్చునని వారు భావిస్తున్నారు.
అధికారుల తెలిపిన వివరాల ప్రకారం... నేపాల్ లోని పొఖారా ఏరియా నుంచి 23 మంది ప్రయాణికులతో బుధవారం ఉదయం 7.45గంటలకు ఓ విమానం బయలుదేరింది. చివరగా 8:50 గంటలకు ఆ విమానం నుంచి సిగ్నల్స్ అందాయని, ఆ తర్వాత నుంచి విమానం జాడ చిక్కలేదని వెల్లడించారు.

సమాచారం అందుకున్న నేపాల్ ఆర్మీ సిబ్బంది విమానాల సహాయంతో సెర్చ్ ఆపరేషన్ నిర్వహిస్తున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
ఆ విమానం కూలిపోయింది
నేపాల్ పర్వతాల్లో బుధవారం ఉదయం అదృశ్యమైన విమానం కూలిపోయిందని అధికారులు తెలిపారు. ఆ విమానంలో 20మంది ప్రయాణీకులు, ముగ్గురు సిబ్బంది ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. ప్రయాణికుల్లో ఇద్దరు విదేశీయులు, ఇద్దరు చిన్నారులు కూడా ఉన్నారని పేర్కొన్నారు. విమాన శకలాలను గుర్తించినట్లు తెలిపిన అధికారులు, విమానంలోని ప్రయాణికులందరూ మృతి చెందినట్లు తెలిపారు.
'సీయూ బ్యాక్, గోరేపానీ నార్మల్': పైలట్ రోషన్ మనన్దార్ ఆఖరి మాటలు!
టేకాఫ్ అయిన కొద్ది నిమిషాల తరువాత పోఖారా నుంచి జాన్ సోమ్ ట్రాఫిక్ కంట్రోల్ కు అనుసంధానమవుతూ, ఫ్లయిట్ కెప్టెన్ రోషన్ మనన్దార్ "సీయూ బ్యాక్... గోరేపానీ నార్మల్" అని వ్యాఖ్యానించారు. ఆయన మాటలను బట్టి, గోరేపానీ ప్రాంతంలో వాతావరణం ప్రశాంతంగానే ఉందని తెలుస్తోంది.
ఆపై జాన్ సోమ్‌తో కాంటాక్ట్ కావాల్సిన పైలట్ ఆ పని చేయలేదు. విమానం టేకాఫ్ అయిన సమయంలో ఎయిర్ పోర్టు నుంచి సుమారు 5 కి.మీ దూరం స్పష్టంగా కనిపించేలా వాతావరణం ఉంది. వాతావరణం బాగాలేని కారణంగా విమానం మరో మార్గాన్ని ఎంచుకుని ఉండవచ్చని భావిస్తున్నామని పోఖారా చీఫ్ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ జసోదా సుబేదీ తెలిపారు. ఆపై ఎన్నిమార్లు విమానంతో కాంటాక్టు కోసం అధికారులు ప్రయత్నించినప్పటికీ సఫలం కాలేదు. విమానంలో ప్రయాణించిన వారి జాబితాను తారా ఎయిర్ విడుదల చేసింది.












Click it and Unblock the Notifications