కిమ్‌కు షాక్: బ్లాకౌట్ బాంబును తయారు చేసిన దక్షిణ కొరియా
సియోల్: ప్రపంచానికి పెను సవాల్‌గా మారిన ఉత్తరకొరియాకు దక్షిణ కొరియా పక్కలో బల్లెంగా మారింది. ఉత్తరకొరియాలో విద్యుత్ వ్యవస్థను కుప్పకూల్చేందుకు బ్లాకౌట్ బాంబును దక్షిణ కొరియా తయారు చేసింది.ఉత్తరకొరియాపై ఈ బాంబును ప్రయోగించేందుకు సిద్దంగా ఉంది దక్షిణ కొరియా.
దక్షిణ కొరియా అత్యంత ఆధునాతనమైన ఆయుధాన్ని సిద్ధం చేసింది. 'బ్లాకౌట్ బాంబ్'గా వ్యవహరించే ఈ ఆయుధాన్ని ప్రయోగిస్తే శత్రుదేశ విద్యుత్తు వ్యవస్థ దాదాపు కుప్పకూలుతుంది.
దీంతో విద్యుత్తు, బ్యాటరీ, జనరేటర్ వంటి వ్యవస్థల ఆధారంగా పనిచేసే ఆయుధాలను శత్రుదేశలు ప్రయోగించడం సాధ్యం కాదు. ఈ ఆయుధాన్ని 'సాఫ్ట్‌బాంబ్'గా కూడా పిలుస్తారు. ఈ బాంబుతో ఎలాంటి ప్రాణ నష్టం మాత్రం ఉండదు.

ఉత్తరకొరియా అధికార పార్టీ వ్యవస్థాపక దినోత్సవాన్ని పురస్కరించుకొని విధ్వంసానికి ఆ దేశం పూనుకొనే అవకాశం ఉందని భావించిన దక్షిణ కొరియా ఈ బాంబును తయారు చేసింది.అక్టోబర్ 10వ, తేదిన ఉత్తరకొరియా అధికార పార్టీ ఆవిర్భావ దినోత్సవం.
రసాయన మార్పులు చేసిన అత్యంత పలుచని గ్రాఫైట్ ఫిలమెంట్స్‌ను బ్లాకౌట్ బాంబ్ కోసం వినియోగిస్తారు. ఇవి గాలిలో దూదిపింజల మాదిరిగా తేలుతాయి. వీటిని శత్రుదేశాల విద్యుత్తు వ్యవస్థలు విస్తరించిన ప్రాంతాల్లో వదులుతారు.
ఈ గ్రాఫైట్ ఫిలమెంట్స్ గాలిలో మేఘాల్లా తేలుతూ వెళ్లి విద్యుత్తు పరికరాలపైకి చేరతాయి. వీటి కారణంగా షార్ట్‌సర్క్యూట్ ఏర్పడి విద్యుత్తు వ్యవస్థ మొత్తం స్తంభించిపోతుంది.
గల్ఫ్ యుద్ధ సమయంలో 85శాతం ఇరాక్ విద్యుత్తు వ్యవస్థను ఈ విధంగానే స్తంభింపజేశారు. నాటో కూటమి సెర్బియాపై కూడా ప్రయోగించింది. దీని ఫలితంగా సెర్బియా పవర్ గ్రిడ్ 70శాతం కుప్పకూలింది. 2007లో బాగ్దాద్‌లోని అల్ ఖైదా అవుట్‌పోస్టుపై ప్రయోగించి సఫలీకృతులయ్యారు. ఇదే రకమైన బాంబు ప్రయోగాన్ని ఉత్తరకొరియాపై ప్రయోగించి ఆ దేశాన్ని దెబ్బతీయాలని దక్షిణ కొరియా భావిస్తోంది.
-
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్‌తో ఛాన్స్ కొట్టేసింది! -
తెలుగు ఇండస్ట్రీ హిట్ హిందీ రీమేక్‌లో శ్రీలీల.. ట్రోలింగ్ చూస్తే ఏడుపే !! -
ఏప్రిల్ 1 నుంచి ఉద్యోగులకు కొత్త రూల్స్- జీతం, పన్ను సహా భారీ మార్పులు..! -
ఇరాన్‌కు రోజుకు రూ. 1,319 కోట్ల ఆదాయం.. అమెరికా అంతమే లక్ష్యంగా..!! -
today rashiphalalu: మీనరాశిని వదిలిపెట్టని ముఖ్యగ్రహాలు.. వీరి పంట పండుతుంది! -
రాజమండ్రి- కాకినాడ పోర్ట్ రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక -
సోషల్ మీడియాలో సెన్సేషన్ గా మారిన "అల్లు అర్జున్" రిలేటివ్.. -
2028 అమెరికా అధ్యక్షుడు ఆయనే.. భారత్ కు గుడ్ న్యూస్..!! -
రోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఈ నీళ్లు తాగితే చాలు- లివర్, కిడ్నీలు క్లీన్..!! -
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
సప్తగిరి ఎక్స్‌ప్రెస్, చర్లపల్లి సూపర్ ఫాస్ట్ రైళ్లకు ఇకపై












Click it and Unblock the Notifications