Pakistan: పాకిస్థాన్ గగనతలం నుంచి విమానాలు నడపొద్దు.. యూరోపియన్ ఏజెన్సీ..

యూరోపియన్ ఎయిర్ సేఫ్టీ ఏజెన్సీ పాకిస్తాన్ నగరాలైన కరాచీ, లాహోర్‌లలో తక్కువ ఎత్తులో ప్రయాణించే విమానాలకు ముప్పు ఉందని హెచ్చరించింది. యూరోపియన్ యూనియన్ ఏవియేషన్ సేఫ్టీ ఏజెన్సీ (EASA) దేశంలో పౌర విమానయానానికి ముప్పు కలిగించే హింసాత్మక నాన్-స్టేట్ యాక్టర్ గ్రూపుల పాక్ లో ఉండే అవకాశం ఉందని తెలిపింది.

"పాకిస్తాన్‌లో ప్రస్తుత భద్రతా పరిస్థితి కారణంగా, నిర్ధారిత ఏవియేషన్ నిరోధక ఆయుధాలు, బహుశా MANPADS (మ్యాన్-పోర్టబుల్ ఎయిర్-డిఫెన్స్ సిస్టమ్స్)తో హింసాత్మక నాన్-స్టేట్ యాక్టర్ గ్రూపులు ఉండటంతో పౌర విమానయానానికి ముప్పు కొనసాగుతోంది. FL 260 కంటే తక్కువ ఎత్తులో పనిచేయడానికి అధిక ప్రమాదం" అని శుక్రవారం జారీ చేసిన ప్రకటనలో పేర్కొంది. జనవరి 31, 2024 వరకు పాక్ పై విమానాలు ఎగరకపోవడమే మంచిదని చెప్పింది.

The European agency has said that flights from Pakistans airspace should not be operated

నిర్దిష్ట ప్రాంతం "అడపాదడపా సైనిక కార్యకలాపాలతో ప్రాదేశిక వివాదానికి సంబంధించిన ప్రదేశంగా మిగిలిపోయింది. అందువల్ల పౌర విమానయానానికి నిరంతర ముప్పు పొంచి ఉంది. దీని ఫలితంగా 260 అడుగుల కంటే తక్కువ ఎత్తులో ప్రయాణం చేయడం ప్రమాదకరమని తెపిలిపింది. యూరోపియన్ బాడీ జారీ చేసిన ప్రకటనను పాకిస్థాన్ ఖండించింది. పాకిస్తాన్ సివిల్ ఏవియేషన్ అథారిటీ (పిసిఎఎ) ఆదివారం తన గగనతలం అన్ని రకాల విమాన కార్యకలాపాలకు "సురక్షితమైనది" అని తెలిపింది.

దేశం గగనతలం సురక్షితమైనదని మరియు చొరబాట్లకు వ్యతిరేకంగా రక్షించబడిందని నొక్కి చెబుతూ, ఎయిర్‌క్రాఫ్ట్ ఓనర్స్ అండ్ ఆపరేటర్స్ అసోసియేషన్ ఆఫ్ పాకిస్తాన్ (AOOA) కూడా EASA భద్రతా సర్క్యులర్‌ను ఆపరేటర్‌లకు తిరస్కరించింది. "పాకిస్తాన్ గగనతలం 100 శాతం సురక్షితమైనది" అని అసోసియేషన్ CEO ఇమ్రాన్ అస్లాం ఖాన్ చెప్పినట్లు డాన్ వార్తాపత్రిక పేర్కొంది. పాకిస్తాన్ విమానాశ్రయాలు విమాన కార్యకలాపాలకు కూడా సురక్షితమైనవని, ప్రతిరోజూ అనేక వాణిజ్య, ప్రైవేట్ విమానాలు నడుస్తున్నాయని అస్లాం ఖాన్ ఉద్ఘాటించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+