లేడీ టీచర్ల మీద రేప్ చేసి వీడియోలు తీస్తున్న ప్రిన్సిపాల్, 45 మందితో గేమ్స్ !

కరాచి/ఇస్లామాబాద్: పాకిస్థాన్‌లోని కరాచీలోని గుల్షన్-ఎ-హదీద్‌లోని ఓ ప్రైవేట్ పాఠశాల ప్రిన్సిపాల్‌ అదే స్కూల్ లో పని చేస్తున్న మహిళా టీచర్ల మీద అత్యాచారం చేసి బ్లాక్‌మెయిల్ చేస్తున్నాడనే ఆరోపణలపై సోమవారం అతన్ని అరెస్టు చేశారు. ప్రిన్సిపాల్ ఇర్ఫాన్ గఫూర్ మెమన్ ఇప్పటి వరకు ఇలా 45 మందికి పైగా మహిళలపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారని వెలుగు చూసింది.

కామాందుడైన ప్రిన్సిపాల్ గఫూర్ మెమన్ కామక్రీడల గురించి పాకిస్థాన్‌కు చెందిన జియో టీవీ వెల్లడించింది. షాకింగ్‌ విషయం ఏమిటంటే పోలీసులు ఇర్ఫాన్ గఫూర్ ఫోన్ లో దాదాపు 25 మంది మహిళలపై అత్యాచారం చేస్తున్న సమయంలో తీసిన వీడియో క్లిప్‌లను స్వాధీనం చేసుకున్నారు. స్కూల్ లోని సీసీటీవీ కెమెరాల డిజిటల్ వీడియో రికార్డర్ (డీవీఆర్), ఇర్ఫాన్ గఫూర్ మెమన్ మొబైల్ ఫోన్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

 principal

ఇర్ఫాన్ గఫూర్ మెమన్‌తో పాటు ఓ మహిళా టీచర్‌కు సంబంధించిన సెక్స్ వీడియో క్లిప్పింగ్ వైరల్‌గా మారడంతో ప్రిన్సిపాల్ కామక్రీడల వ్యవహారం వెలుగులోకి వచ్చిందని పోలీసు అధికారులు అంటున్నారు.
వెంటనే ప్రిన్సిపాల్ ఇర్ఫాన్ గఫూర్ కార్యాలయానికి తాళం వేసి అతన్ని 7 రోజుల రిమాండ్‌కు తరలించించిందని స్థానిక మీడియా తెలిసింది.

నెలకు రూ. 1,00,000 పాకిస్తాన్ రూపాయలకు పాఠశాలను లీజ్ కు తీసుకున్నట్లు ఇర్ఫాన్ గఫూర్ మెమన్ చెప్పాడని పోలీసులు అన్నారు. పాఠశాలలో సుమారు 10 మంది మహిళా ఉపాధ్యాయులు, ఐదుగురు పురుష ఉపాధ్యాయులు పని చేస్తున్నారని, 250 మంది విద్యార్థులు చదువుకుంటున్నారని పోలీసులు అన్నారు.

ఇదే స్కూల్ లో మహిళా టీచర్ల మీద లైంగిక వేధింపులు, బెదిరింపులు, బ్లాక్‌మెయిలింగ్‌ల ఆధారంగా ఇర్ఫాన్ గఫూర్ మెమన్‌పై ఎఫ్‌ఐఆర్ నమోదైంది. ఉద్యోగాలు ఇస్తానని మహిళా టీచర్లను మెమన్ లైంగికంగా వేధించేవాడని జియో టీవీకి విచారణాధికారి తెలిపారు. నిందితుడు ఇర్ఫాన్ మహిళల మీద లైంగిక వేధింపులకు పాల్పడిన సమయంలో వీడియోలు చిత్రీకరించడం ద్వారా మహిళలను బ్లాక్‌మెయిల్ చేసేవాడని విచారణాధికారి తెలిపారు.

 principal

పాకిస్థాన్ లోని సింధ్ విద్యాశాఖ మంత్రి రానా హుస్సేన్ ఆదేశాల మేరకు సింధ్ డైరెక్టరేట్ ఆఫ్ ఇన్‌స్పెక్షన్ అండ్ రిజిస్ర్టేషన్ ఆఫ్ ప్రైవేట్ ఇన్‌స్టిట్యూషన్స్ ఈ అంశంపై దర్యాప్తు చేసేందుకు ఒక కమిటీని ఏర్పాటు చేసింది. ప్రత్యేక కమిటీ అధికారులు కామాందుడైన ప్రిన్సిపాల్ వ్యవహారం గురించి పిన్ టూ పిన్ బయటకు లాగుతున్నారని తెలిసింది.

సీసీటీ కెమెరాల డీవీఆర్ లో బాధితులకు సంబంధించిన అనేక వీడియోలలో మరింత మంది నిందితుల వివరాలు వెలుగులోకి వచ్చినందున కనీసం ఇద్దరు అనుమానితులను త్వరలో అరెస్టు చేస్తామని దర్యాప్తు అధికారి హామీ ఇచ్చారు. జిల్లా సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ మలిర్ హాసన్ సర్దార్ మాట్లాడుతూ ఇర్ఫూర్ గఫూర్ మెమన్ లైంగిక వేధింపులకు పాల్పడుతున్నాడని ఐదుగురు మహిళలు ముందుకు వచ్చారు.

ఇప్పటి వరకు ఐదుగురు మహిళలు నిందితుడికి వ్యతిరేకంగా ఫిర్యాదు చెయ్యడానికి ముందుకు వచ్చారని పోలీసు అధికారులు తెలిపారు, విచారణ కొనసాగుతోందని, బాధితుల నుండి అవసరమైన సమాచారం సేకరిస్తున్నామని, పోలీసులు పలుకోణాల్లో విచారణ చేస్తున్నారని అసిస్టెంట్ కమిషనర్ నజీర్ అబ్రో చెప్పారని జియో న్యూస్ తెలిపింది. ఈ విషయంలో విద్యాశాఖ అధికారులు కూడా సీరియస్ అయ్యారని పాకిస్తాన్ మీడియా తెలిపింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+