పంజ్‌షీర్ పూర్తిగా తమ అధీనంలోకి వచ్చిందని తాలిబాన్‌ల ప్రకటన.. కాదంటున్న ఎన్ఆర్ఎఫ్

పంజ్‌షీర్ లోయ ఇప్పుడు పూర్తిగా తమ అధీనంలోనే ఉందని, ఆ ప్రాంతాన్నీ గెలిచామని తాలిబాన్‌లు ప్రకటించుకున్నారు.
కాబుల్‌కు ఉత్తరాన ఉండే పంజ్‌షీర్‌పై పట్టు కోసం తాలిబాన్లు కొద్దిరోజులుగా తీవ్రంగా పోరాడుతున్నారు.
పంజ్‌షీర్‌లోని నేషనల్ రెసిస్టెన్స్ ఫ్రంట్ ఆఫ్ అఫ్గానిస్తాన్(ఎన్ఆర్ఎఫ్) నుంచి తాలిబాన్లకు గట్టి ప్రతిఘటన ఎదురుకావడంతో కొన్నాళ్లుగా అక్కడ భీకర పోరు సాగుతోంది.
దీంతో రాజధాని కాబుల్ సహా దేశమంతటినీ తమ అధీనంలోకి తెచ్చుకున్నా పంజ్‌షీర్ లోయపై మాత్రం తాలిబాన్లు పట్టు సాధించలేకపోయారు.
కానీ, తాజాగా వారు పంజ్‌షీర్ కూడా తమ అధీనంలోకి వచ్చిందని ప్రకటించారు.
అయితే, తాలిబాన్లు చేసిన ప్రకటనను 'నేషనల్ రెసిస్టెన్స్ ఫ్రంట్ ఆఫ్ అఫ్గానిస్తాన్' ఖండించింది.
ఇవి కూడా చదవండి:
- పది వేళ్లతో 400 సంఖ్య వరకూ లెక్కించే అరుదైన భారతీయ పద్ధతి మీకు తెలుసా?
- ఆయుష్మాన్ భారత్ కంటే మోదీ ప్రతిష్టను పెంచే పథకాలపై ప్రచారాలకే కేంద్ర ప్రభుత్వం ఎక్కువ ఖర్చు పెట్టిందా?
- అఫ్గానిస్తాన్: మహిళలపై టియర్ గ్యాస్, పెప్పర్ స్ప్రేలు ప్రయోగించిన తాలిబాన్లు
- చంద్రంపాలెం హైస్కూల్: 'కార్పొరేట్ స్కూల్ మాన్పించి ఈ సర్కారు బడికి పంపిస్తున్నారు’
- కిసాన్ మహా పంచాయత్: భవిష్యత్ కార్యాచరణపై రైతు సంఘాల దృష్టి
- 'మగతోడు లేకుండా మీరెందుకు బయటికొచ్చారు?'
- తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేపుతున్న కొత్తరకం కరోనావైరస్
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)












Click it and Unblock the Notifications