సరదా కోసం 41 మందిని చంపేశాడు: మృతుల్లో 37మంది మహిళలు
రియో డిజనీరో: తనకు సరదా అనిపించిందని ఓ దుర్మార్గుడు 41 మందిని హత్య చేశాడు. అందులో 37 మంది యువతులు, ముగ్గురు పురుషులు, ఓ చిన్నారి కూడా ఉన్నారు. కాగా, ఇటీవల బ్రెజిల్‌లోని రియో పరిసరాల్లో జరిగిన ఓ యువతి హత్యలో కేసులో అనుమానం వచ్చి 26ఏళ్ల ఓ నల్లజాతి యువకుడు సైల్సన్ జోస్ దాస్ గ్రాకస్‌ను గురువారం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
అతడ్ని విచారించగా పోలీసులకు భయంగోలిపే విషయాలు వెలుగులోకి వచ్చాయి. 'అతనికి మహిళలను హత్య చేయాలని కోరిక ఉందట. అది కూడా తెల్లజాతి వారినే. నల్లజాతి వారిని కాదు. బాధితులను దగ్గరి నుంచి పరిశీలించి సమయం చూసి హత్య చేసేవాడు' అని ఓ పోలీసు అధికారి వెల్లడించారు. అతడు ఓ సైకో అని ఆ అధికారి చెప్పారు.

నిందితుడు చెప్పిన వివరాలు అతడు చేసిన హత్యలకు సరిపోలాయని పోలీసు అధికారి తెలిపారు. 37 మంది మహిళలను, ముగ్గురు పురుషులను, ఇద్దరు చిన్నారులను హత్య చేసినట్లు నిందితుడు గ్రాకస్ పోలీసుల ఎదుట అంగీకరించాడు.
తాను లక్ష్యం చేసుకున్న వారి గురించిన పూర్తి వివరాలను తెలుసుకుని, వారిని గమనిస్తూ సరైన సమయంలో హత్య చేసేవాడినని నిందితుడు గ్రాకర్ తెలిపాడు. తాను మొదట దొంగగా ఉండేవాడనని తెలిపాడు. తన 17ఏళ్ల వయస్సులోనే తొలి హత్య చేశానని చెప్పాడు.
అప్పటి నుంచి తనకు హత్యలపై ఆసక్తి, సరదా కలిగిందని తెలిపాడు. కొంతమందిని తుపాకీతో కాల్చి చంపానని, మరికొందరిని గొంతునులిమి హత్య చేశానని గ్రాకర్ తెలిపాడు. హత్యకు సంబంధించి తన అనవాళ్లు లేకుండా జాగ్రత్తపడేవాడినని, చేతులకు గ్లౌవ్స్ ధరించేవాడినని చెప్పాడు. ఒక హత్య తర్వాత రెండు మూడు నెలల వ్యవధి తీసుకుని మళ్లీ వేట కొనసాగించేవాడనని గ్రాకర్ తెలిపాడు.
తనకు హత్యలు చేసినందుకు ఎలాంటి పశ్చాత్తాపం లేదని చెప్పాడు. ఒకవేళ తనకు 10 నుంచి 20ఏళ్ల జైలు శిక్ష విధిస్తే.. మళ్లీ బయటికి వచ్చిన తర్వాత కూడా హత్య చేస్తానని తెలిపాడు. కాగా, బ్రెజిల్‌లో మరణ శిక్ష అమలులో లేనందున, అతనికి సుమారు 30ఏళ్ల జైలు శిక్ష పడే అవకాశం ఉంది.












Click it and Unblock the Notifications