గ్రీన్ లాండ్ అమెరికాదే.. ట్రంప్ సంచలన వ్యాఖ్యలు
గ్రీన్ లాండ్ విషయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. గ్రీన్ లాండ్ ను అమెరికా తప్ప ఏ దేశమూ రక్షించే ప్లేస్ లో లేదని తెలిపారు. గ్రీన్ లాండ్ ను అమెరికాకు అప్పగించి తీరాల్సిందేనని అన్నారు. దావోస్ లోని ప్రపంచ ఆర్థిక సదస్సులో ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు గ్రీన్ లాండ్, డెన్మార్క్ లపై గొప్ప గౌరవం ఉందని తెలిపారు. గ్రీన్ లాండ్ అమెరికా భద్రతకు అలాగే అంతర్జాతీయ భద్రతకు ఎంతో కీలకం అని స్పష్టం చేశారు.
దావోస్ లో నిర్వహించిన ప్రపంచ ఆర్థిక సదస్సుకు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ హాజరయ్యారు. ఈ మేరకు ప్రపంచ ఆర్థిక వేదికను ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశారు. గ్రీన్ లాండ్ ను అమెరికా తప్ప మరో దేశం రక్షించలేదని ట్రంప్ స్పష్టం చేశారు. గ్రీన్ లాండ్ ను అమెరికాకు అప్పగించి తీరాల్సిందేనని స్పష్టం చేశారు. ఆరు సంవత్సరాల తర్వాత దావోస్ సదస్సుకు హాజరైన ట్రంప్ ప్రపంచ ఆర్థిక వేదికను ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశారు. గ్రీన్ లాండ్, డెన్మార్క్ లపై తనకు గౌరవం ఉందని పేర్కొన్నారు.
గ్రీన్ లాండ్ ను తాము రక్షించి డెన్మార్క్ కు తిరిగి ఇచ్చామని, ఇప్పుడు డెన్మార్క్ కృతజ్ఞత లేకుండా ప్రవర్తిస్తోందని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఆరోపించారు. గ్రీన్ లాండ్ డెన్మార్క్ కు ఇవ్వడం ఎంత అవివేకం..? అది ఉత్తర అమెరికాలో భాగమని ట్రంప్ తెలిపారు. అలాగే తన ఏడాది పాలన పట్ల ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారని ట్రంప్ పేర్కొన్నారు. మాజీ అధ్యక్షుడు జో బైడెన్ హయాంలో అమెరికా "స్టాగ్ ఫ్లేషన్" తో చిక్కుకుందని ఆరోపిస్తూ, "నా పాలనలో దానికి విరుద్ధం," అని స్పష్టం చేశారు.

తన నాయకత్వంలో అమెరికా ప్రస్తుతం "ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన దేశం" అని అంతకుముందు ట్రంప్ పునరుద్ఘాటించిన విషయం తెలిసిందే. వైట్ హౌస్ లో ఒక సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంగా, తన పదవీకాలం చరిత్రలోనే అత్యుత్తమం అని ఆయన ప్రకటించారు. "ఇలాంటి పదవీకాలం మరొకటి లేదని నేను అనుకుంటున్నాను. ఏ అధ్యక్షుడికి ఇంతకంటే మంచి ఏడాది పాలన అనుకోను. ప్రస్తుతం ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన దేశంగా ఉన్నాం" అని ట్రంప్ అన్నారు.












Click it and Unblock the Notifications