అమెరికాలో గాల్లోనే మాయమైన విమానం.. ఏమైంది?

అమెరికాలో షాకింగ్ ఘటన జరిగింది. అమెరికాలోని అలస్కాలో గాల్లోనే ఓ విమానం మాయమైంది. విమానం అలస్కా మీదుగా ప్రయాణిస్తుండగా మిస్సింగ్ జరిగినట్లు తెలుస్తోంది. ఈ సమయంలో విమానంలో ఓ ఫైలట్ తోపాటు 9 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. అమెరికాకు చెందిన సెస్నా 208బీ గ్రాండ్ కర్వానా విమానం ఉనల్ క్లీట్ నుంచి నోమ్ కు బయల్దేరుతుండగా ఈ ఘటన జరిగింది. స్థానిక కాలమానం ప్రకారం సాయంత్రం 4 గంటల సమయంలో ఈ మిస్సింగ్ జరిగినట్లు అధికారులు భావిస్తున్నారు. ప్రస్తుతం విమానాన్ని వెతికే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు.

సెస్నా 208బీ గ్రాండ్ కర్వానా విమానం మధ్యాహ్నం 2.37 గంటలకు ఉనలక్లీట్ నుండి బయల్దేరింది. అయితే మధ్యాహ్నం 3.16 వరకు సిగ్నల్స్ అందాయి.ఆ తర్వాత సిగ్నల్స్ కట్ అయ్యాయి.దీంతో అధికారులు విమానాన్ని వెతికే పనిని ముమ్మరం చేశారు. వారం రోజుల క్రితం ఫిలదేల్ఫియాలోని ఓ షాపింగ్ మాల్ లో విమానం కూలింది. ఈ ఘటనలో ఆరుగురు మృతి చెందారు. ప్రమాదం జరిగిన ప్రాంతంలో కార్లు, ఇళ్లు దగ్ధమయ్యాయి. మరో ఘటనలో విమానం, జెట్ ఒకదానికొకటి ఢీకొన్న ఘటనలో 64 మంది ప్రయాణికులు మృత్యువాత పడ్డారు.

U S Authorities Search for Plane that Disappeared Mid-Air with 9 on Board
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+