• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

యూకే ఇండియా వీక్ 2018: భవిష్యత్ యూకే-భారత్ బంధంతో కొత్త ప్రపంచం

|

లండన్: భారత్ యూకేల మధ్య సంబంధాలు నెమ్మదిగా బలోపేతం అవుతున్నట్లుగా కనిపిస్తోందని... రెండు దేశాల మధ్య బంధం దృఢపడితే అవకాశాలు మరింత మెరుగుపడతాయని అభిప్రాయపడ్డారు ఇండియా ఐఎన్‌సీ వ్యవస్థాపకులు, సీఈఓ మనోజ్ లాద్వా.

లండన్‌లో కానీ, ఢిల్లీలో కానీ విదేశీ విధానలపై పట్టున్న నిపుణులను యూకే-భారత్‌ల మధ్య సంబంధాలపై అడిగితే సమాధానం ఆశాజనకంగా ఉంటుందని చెప్పారు. మరింత లోతుగా విశ్లేషించమని కోరితే పదాలను వెతుక్కుంటారని చెప్పారు.

ఇక అసలైన వాస్తవం ఏమిటంటే ఇరు దేశాల మధ్య తరతరాల బంధం ఉండటంతో పాటు రెండు కుటుంబాలు కలిసి ఉన్నట్లుగా ఉంటాయి. అయితే అవసరం వచ్చినప్పుడు మాత్రం తమ మొదటి మిత్రుడు భారత్ అని యూకే విస్మరిస్తుంది... అదే సమయంలో యూకే తొలి స్నేహితుడని భారత్ మరిచిపోతుంది. ఇందుకు సంబంధించి కొన్ని చరిత్రాత్మక కారణాలు సాక్ష్యంగా నిలిచాయి.

UK India Week 2018: Future sealed for UK-India ties

మరి ముఖ్యంగా ప్రపంచ వ్యాప్తంగా బ్రిటన్, భారత్‌లు తమ సుదీర్ఘ భాగస్వామ్యాన్ని కొనసాగించాల్సిన అవసరం ఉంది. తద్వారా ఇరు దేశాలు తమ బలమైన నాయకత్వాన్ని ప్రపంచ దేశాలకు చాటే అవకాశం ఉంది. ఇరుదేశాలు కలిసి కొనసాగడం వల్ల ప్రపంచీకరణ, వాణిజ్యం, పరస్పర సహకారంలో కొత్త విలువలకు ఊపిరిపోసే అవకాశం ఉంటుంది. తద్వారా సుదీర్ఘంగా ఆర్థిక విస్తరణ జరిగే అవకాశం ఉంది.

ఆర్థిక విస్తరణకు మార్గం:

రెండు దేశాలు కలిసి కొనసాగితే కచ్చితంగా ఆర్థిక లక్ష్యాలను చేరుకోగలవని నేను భావిస్తున్నాను. ఇక్కడ దురదృష్టం ఏమిటంటే ఇరుదేశాలు సంబంధాలు బాగానే ఉన్నప్పటికీ కొన్ని అంశాల్లో మాత్రం ఒక్కటిగా ఉండటం లేదు. భారత్‌లోకి బ్రిటీష్ వస్తువులు వచ్చేందుకు కొన్ని నిబంధనలు సరళించాలని లండన్ కోరుతుండగా అందుకు భారత్ ఆలోచిస్తోంది. మరోవైపు భారత్ నుంచి బ్రిటన్‌కు వెళ్లే విద్యార్థులపై కఠిన నిబంధనలు ఎత్తివేయాలని భారత్ కోరుతోంది. ప్రపంచంలో వరసగా ఐదు ఆరవ అతిపెద్ద ఆర్థిక దేశాలుగా ఉన్న బ్రిటన్ భారత్ దేశాలు కొన్ని బేదాభిప్రాయాలను పక్కనబెడితే కలిసి ఎంతో సాధించవచ్చు.

యూరోపియన్ యూనియన్ నుంచి బ్రిటన్ వైదొలిగే వరకు... విహారయాత్ర అంటే భారతీయులకు ముందుగా గుర్తొచ్చేది బ్రిటన్ దేశమే. బ్రెగ్జిట్‌కు ముందు అక్కడ కొలువై ఉన్న భారతీయ సంస్థలు తమ వ్యాపారాన్ని మిగతా యూరప్ ప్రాంతాల్లో కూడా విస్తరింపజేయాలని భావించాయి. రెండు దేశాలకు చెందిన పలువురు పారిశ్రామికవేత్తలు తమ వ్యాపారాలను విస్తరించేందుకు ఎంతో కృషి చేశారు. ఇందులో భాగంగా వారు పెట్టుబడులు కూడా పెట్టారు. తద్వారా యూకే భారత్ సంబంధాలను మరో అడుగు ముందుకు తీసుకెళ్లడంలో ప్రముఖ పాత్ర పోషించారు.

కామన్ వెల్త్

భారత్-యూకేలు తమ ఆధిపత్యాన్ని చాటేందుకు అడుగులు ముందుకు పడుతున్నాయి. ఇందులో భాగంగా కామన్ వెల్త్ దేశాలైన 53 దేశాల్లో 21 శతాబ్దంలో చోటు చేసుకున్న మార్పులకు అనుగుణంగా ఎలాంటి కఠిన నిబంధనలు లేని వాణిజ్యం వ్యాపారం జరగాలని అంగీకరించాయి. ఇందుకు కావాల్సిన ప్రోత్సాహకాలు ఇచ్చేందుకు ముందుకు వచ్చాయి.

భారత్ యూకేలు ఒకే ఆలోచనా విధానంతో కొనసాగడం వల్ల ఒకప్పుడు ఏర్పడ్డ చిన్న విబేధాలు తొలగిపోయి... రెండు దేశాలు ఒక్కటై రాజకీయంగా బలోపేతమవుతాయి. అంతేకాదు క్షీణించిపోయిన సంబంధాలు బలోపేతం అయ్యేందుకు కారణమవుతుంది.

నేను ఈ వారం మొదటిలో మీడియాతో చెప్పినట్లుగా " బ్రిటన్ యూరోపియన్ సమాఖ్య నుంచి బయటకు రావడం వల్ల అనేక కష్టాలు ఎదురవుతాయనే నిరాశా వాదం నుంచి బయటకు రావాలి. అది ఆలోచించే బదులు భారత్ లాంటి దేశాలతో సంయుక్తంగా కలిసి భవిష్యత్తుకు పునాది వేసేందుకు శ్రమిస్తే అన్ని విధాలా బాగుంటుంది. భారత్‌ కు యూకే ఓ మంచి అవకాశం కల్పిస్తోంది. ఈ తరంవారు ఇరుదేశాల మధ్య వ్యూహాత్మక సంబంధాలపై చర్చించే అపూర్వ అవకాశం కల్పిస్తోంది. ఇరు దేశాలు కలసి పని చేస్తే కొన్ని అద్భుతాలు సృష్టించొచ్చు.

ఇక్కడ ఇరుదేశాల శ్రమే కాదు... తెరవెనుక రెండు దేశాల మధ్య బంధం బలపడేందుకు ఎంతో మంది సెలబ్రిటీలతో పాటు ఇంకొందరి సామాన్యుల కృషి ఉంది.

ఒకే కలయిక

రెండు దేశాలు పరస్పర సహకారంతో అభివృద్ధిని సాధించొచ్చు. వాణిజ్యం,రక్షణ సాంకేతికత బదిలీ, లండన్‌లో విరాళాల సేకరణ, ప్రజల మధ్య అనుబంధం, సాఫ్ట్ పవర్ ఎగుమతుల రంగాల్లో యూకే భారత్‌లు కలిసి పనిచేస్తే అద్భుతాలు సృష్టించొచ్చు.

యూరోపియన్ యూనియన్ నుంచి యూకే బయటకు రావడం నిజంగా విస్మయానికి గురించేసింది. థెరిసా మే ప్రభుత్వం తమ వాణిజ్య ఒప్పందాలను యూరోపియన్ యూనియన్‌తోనే కాక వాటి దేశాలతో కూడా రద్దు చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ పరిస్థితుల్లో బ్రిటన్ ప్రభుత్వం తమతో భాగస్వామి అయ్యేందుకు సిద్ధంగా ఉన్న దేశాలతో ఒప్పందాలు కుదుర్చుకోవడం చాలా శ్రేయస్కరం, తద్వారా బ్రెగ్జిట్‌తో చవిచూసిన నష్టాలను పూడ్చుకోవచ్చు.

థెరిసా మే కూడా ఇదే పద్ధతిని అనుసరిస్తే చాలా వరకు బ్రిటన్ గట్టెక్కగలదని పరిశీలకులు భావిస్తున్నారు. ఇలా చేస్తే బ్రసెల్స్‌తో సహేతుకమైన ఒప్పందం కుదుర్చుకునే వీలుంటుంది. ఈ క్రమంలోనే యూకే భారత్‌ల మధ్య సత్సంబంధాలు నెలకొంటే వాణిజ్య రంగంలో మంచి ఆరంభం అవుతుంది.

ప్రపంచదేశాల్లో ఉత్తమ ఆర్థిక ప్రగతి దేశంగా ఉన్న బ్రిటన్... సాంకేతికతలో దూసుకెళుతున్న భారత్‌తో జట్టు కడితే మరెన్నో అద్భుతాలు సృష్టించొచ్చు.

బ్రెగ్జిట్ ద్వారా యూకే వైదొలిగిన తర్వాత ప్రధాని థెరిసా మేకు ఆర్థిక పరిస్థితి ఒక సవాలుగా మారింది. అయితే ఆమె ఆలోచనలకు భారత ప్రధాని నరేంద్ర మోడీ ఆలోచనలు తోడైతే అంతర్జాతీయంగా ఇరుదేశాలు దూసుకెళ్లే అవకాశాలున్నాయి.

జీవించి ఉన్న వారధి

బ్రిటీష్ ప్రజాజీవనం వెనక భారతీయుల కృషి ఎంతగానో ఉందని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. బ్రిటన్‌లో స్థిరపడ్డ భారతీయులు ఇరుదేశాల మధ్య వారధిలా నిలుస్తున్నారని చెప్పారు. వీరి ద్వారానే ద్వైపాక్షిక బంధం బలపడుతోందని అభిప్రాయపడ్డారు.

గత నెలలో ప్రధాని నరేంద్ర మోడీ యూకే పర్యటనలో చిన్న బీజం పడింది. ప్రైవేట్ రంగాల్లో ఇరు దేశాలు పలు ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. అదేసమయంలో రెండు ప్రభుత్వాలు సాహసోపేతమైన ఒప్పందాలపై సంతాకాలు చేశాయి.వీటిలో సైబర్ స్పేస్, సైబర్ సెక్యూరిటీ, పట్టణాభివృద్ధి, వాణిజ్య అభివృద్ధి, ఆర్థిక రంగం, పరస్పర విజ్ఞాన సహకారం, పరిశోధనలు, స్మార్ట్ సిటీస్ సహకారం, నైపుణ్యత, విద్య లాంటి అంశాలతో పాటు పశుసంవర్థకం, మత్స్య, వ్యవసాయంలాంటి రంగాల్లో ఒప్పందాలు జరిగాయి.

ఇరు దేశాల ప్రజల మధ్య సత్సంబంధాలు నెలకొన్నప్పుడే కొత్త ఆలోచనలు పుట్టుకొస్తాయి. దీంతో నమ్మకం బలపడి దీర్ఘకాలిక సంబంధాలు నెలకొనేందుకు దోహదం చేస్తాయి.

తన ఉత్పత్తులు ప్రమోట్ చేసుకునేందుకు బ్రిటన్ దేశానికి సరికొత్త మార్కెట్ల అవసరం ఏర్పడింది. ఇది భారత్‌లో కొరవడింది.అమెరికా పలు ఆంక్షలు విధిస్తున్న నేపథ్యంలో యూకే లాంటి భాగస్వామి దేశం భారత్‌కు ఎంతో అవసరం.

అందుకే లండన్ - న్యూఢిల్లీలు ఒక్కటైతే ప్రపంచ వ్యాప్తంగా వాణిజ్య రంగంలో ఎన్నో అద్భుతాలు సృష్టించవచ్చనేది నా అభిప్రాయం. నేను ముందుగా చెప్పినట్లుగా ఇందుకు ఎంతో పట్టుదల శ్రమ అవసరం. కానీ యూకే భారత్‌లు ఒక్కటై తమ సంబంధాలను కొనసాగించేందుకు కావాల్సిన అన్ని అంశాలు ఉన్నాయి. రెండు దేశాలు ఏకమైతే కొత్త ప్రపంచాన్ని సృష్టించే అవకాశముంది.

ఈ ఈవెంట్‌కు డైలీహంట్, ఇండియా #1 న్యూస్, లోకల్ లాంగ్వేజ్ కంటెంట్ అప్లికేషన్, అఫీషియల్ మీడియా పార్ట్‌నర్.

తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
The relationship between India and the UK is gradually moving beyond its nostalgic framework to look towards a future that is ripe with opportunities, writes India Inc. Founder & CEO Manoj Ladwa.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more