Kissing my... ట్రంప్ మసాలా స్టేట్‌మెంట్
Trump Tariff: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. మరోసారి కొరడా ఝుళింపించారు. అనేక దేశాలపై కొత్తగా అదనపు వడ్డింపులు వడ్డించారు. భారీగా టారిఫ్‌ను పెంచారు. ఈ జాబితాలో భారత్ సైతం ఉండటం ప్రాధాన్యతను సంతరించుకుంది. 26 శాతం మేర టారిఫ్ విధించారు భారత్‌పై.
మొన్నటికి మొన్న ఆటోమోటివ్ వాహనాలపై భారీగా పన్ను విధించారు ట్రంప్. 25 శాతం వరకు టారిఫ్‌ను పెంచారు. దీనికి సంబంధించిన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్‌పై కిందటి నెల 31వ తేదీ నాడే సంతకం చేశారు. అమెరికాకు ఆటోమోటివ్ వాహనాలను ఎగుమతి చేస్తోన్న భారత్ సహా అన్ని అన్ని దేశాలపైనా దీని ప్రభావం పడినట్టయింది. ఈ టారిఫ్.. ఈ నెల 2వ తేదీ నుంచి అమలులోకి వచ్చింది.

అక్కడితో ఆగట్లేదాయన. ఇప్పుడు కొత్తగా భారత్‌పై 26 శాతం వరకు టారిఫ్ విధించారు. భారత్ నుంచి అమెరికాలో దిగుమతి అయ్యే ప్రతి వస్తువుపైనా ఈ పన్ను వర్తిస్తుంది. అంటే ఇప్పటివరకు ఉన్న టారిఫ్‌కు మరో 26 శాతం మేర అదనపు మొత్తాన్ని చెల్లించాల్సి ఉంటుంది. మేక్ అమెరికా వెల్తీ అగైన్ కాన్సెప్ట్‌లో భాగంగా టారిఫ్‌ను విధించాల్సి వస్తోందంటూ వివరణ ఇస్తోన్నాాయన.
ఇప్పుడు తాజాగా చైనాపై ఏకంగా 104 శాతం మేర టారిఫ్‌ను విధించడం ప్రాధాన్యతను సంతరంచుకుంది. గతంలో అమెరికా విధించిన టారిఫ్‌కు ప్రతీకారంగా చైనా కూడా రంగంలోకి దిగింది. అమెరికా నుంచి దిగుమతి చేసుకునే వస్తువులపై 35 శాతం మేర టారిఫ్‌ను అదనంగా వడ్డించింది. ఈ నేపథ్యంలో అమెరికా కొత్తగా ఈ 104 శాతం టారిఫ్‌ను విధించాల్సి వచ్చింది.
భారత్ సహా ప్రపంచవ్యాప్తంగా 100కు పైగా దేశాలపై అదనపు టారిఫ్‌ల భారాన్ని మోపారు డొనాల్డ్ ట్రంప్. ఆయన వైఖరి పట్ల స్వదేశంలో తీవ్ర వ్యతిరేకత ఎదురవుతోన్నప్పటికీ లెక్క చేయట్లేదు. ఈ విషయంలో ఏ మాత్రం వెనకడుగు వేయట్లేదు. మరోసారి ఇదే అంశాన్ని ప్రస్తావించారు.
నేషనల్ రిపబ్లికన్ కాంగ్రెస్సెనల్ కమిటీ డిన్నర్‌లో పాల్గొన్నారు ట్రంప్. ఈ సందర్భంగా మాట్లాడారు. మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. టారిఫ్‌ను ఎదుర్కొంటోన్న దేశాలన్నీ కూడా తమతో సంప్రదింపులు జరుపుతున్నాయని, ట్రేడ్ డీల్స్‌ను పునరుద్ధరించుకోవడం, పాత టారిఫ్‌ను కొనసాగించేలా చేయాలంటూ ప్రాధేయపడుతున్నాయని అన్నారు. Kissing my Ass...అని చెప్పారు.
ప్లీజ్, ప్లీజ్ సర్, ఒక్క ఒప్పందం కుదుర్చుకోండి.. దీనికోసం తాము ఏదైనా చేస్తాం అంటూ బతిమాలుతున్నాయని డొనాల్డ్ ట్రంప్ పేర్కొన్నారు. విషయంలో మెతకగా వ్యవహరించాలని సూచిస్తోన్నారని, ఇక్కడ తానేం చేస్తోన్నాననేది తనకు బాగా తెలుసునని వారికి చురకలు అంటించారు. మేక్ అమెరికా వెల్తీ అగైన్ కోసమే ఈ కఠిన నిర్ణయాలను తీసుకుంటోన్నానని వివరణ ఇచ్చారు.












Click it and Unblock the Notifications