ఏడాది చిన్నారిని కొట్టి చంపి, చెత్తబుట్టలో పడేసింది
న్యూయార్క్: అమెరికాలోని మోంటానాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఓ 13ఏళ్ల చిన్నారిని కంటికి రెప్పలా చూసుకోవాల్సిన ఆయా.. ఆమెను తీవ్రంగా కొట్టి చంపేసింది. ఆ తర్వాత చిన్నారి మృతదేహాన్ని చెత్తకుప్పలో పడేసింది. అనంతరం ఏమీ ఎరగనట్లు చిన్నారి కనిపించకుండా పోయిందని పోలీసులకు ఫిర్యాదు చేసింది.
ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే.. కెంజ్లే ఓల్సన్ అనే 13ఏళ్ల పాపకు జెనెల్లీ రెడ్ డాగ్(42)ను సంరక్షకురాలిగా నియమించారు చిన్నారి తల్లిదండ్రులు అజుర్, జెమ్యాన్. ఆ తర్వాత రెండు వారాలపాటు వారు బయటికి వెళ్లారు.
కాగా, చిన్నారిని జాగ్రత్తగా చూసుకోవాల్సిన జెనెల్లీ.. ఆమెను తీవ్రంగా కొట్టింది. దీంతో చిన్నారి ప్రాణాలు కోల్పోయింది. చిన్నారి మృతదేహాన్ని సమీపంలోని ఓ చెత్తబుట్టలో పడేసింది జెల్లీ.

ఆ ఆర్వాత తనకు ఏమీ తెలియదన్నట్లుగా చిన్నారి కనిపించడం లేదంటూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. డకోటాకు చెందిన ఇద్దరు ఆమెను కిడ్నాప్ చేశారని ఫిర్యాదులో పేర్కొంది.
కాగా, విచారణ జరిపిన పోలీసులు.. జెల్లీనే నిందితురాలిగా తేల్చారు. తమదైన శైలిలో పోలీసులు విచారించగా.. తానే చంపినట్లు ఒప్పుకుంది జెల్లీ. శుక్రవారం కోర్టులో హాజరుపర్చగా కోర్టుకు ఆమె కస్టడీ విధించింది. మంగళవారం కోర్టు ఆమెకు శిక్ష ఖరారు చేయనుంది. తమ కూతురును హత్య చేసిన జెల్లీని కఠినంగా శిక్షించాలని ఆమె తల్లిదండ్రులు డిమాండ్ చేశారు.












Click it and Unblock the Notifications