హిందూయిజం పరమత సహనానికి అద్దం పట్టిన వివేక్ రామస్వామి
Vivek Ramaswamy: హిందూయిజంపై అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో గతంలో రిపబ్లికన్ అభ్యర్థిగా రేసులో నిలిచిన వివేక్ రామస్వామి- ఓ అమెరికా పౌరుడి మధ్య సాగిన వాగ్యివాదం.. మతపరమైన అసహనానికి ప్రతిబింబించినట్టయింది. ప్రత్యేకించి- భారత్‌తో పోల్చినప్పుడు దీని తీవ్రత రెట్టింపైంది.
హిందూ మతాన్ని కించపరుస్తూ ఓ అమెరికన్ దేశస్తుడు.. వివేక్ రామస్వామితో వాదులాటకు దిగారు. హిందూమతాన్ని ఓ దుష్టశక్తిగా వ్యాఖ్యానించాడు. పరమతంగా అభివర్ణించాడు. అత్యంత సున్నితమైన ఈ వ్యాఖ్యలకు వివేక్ రామస్వామి సమయానుకూలంగా, కోపోద్రికాలకు గురికాకుండా స్పందించడం హిందూ మతం స్వాభావిక సహనానికి నిదర్శనంగా చెప్పుకోవచ్చు.

వారిద్దరి మధ్య చోటు చేసుకున్న ఈ వాగ్వివాదం- హిందూయిజంలో ఉన్న పరమత సహనానికి అద్దం పట్టింది. అదే సమయంలో ఇలాంట తీవ్ర వ్యతిరేక వ్యాఖ్యలు హైందవేతర మతాలను ఉద్దేశించి మాట్లాడితే అది ఎలాంటి పరిస్థితులకు దారి తీయవచ్చనేది చర్చనీయాంశమౌతోంది.
హిందూమతాన్ని అనమ్యతంగా లేదా నాన్- అబ్రహమిక్ విశ్వాసాలకు వ్యతిరేకిగా అమెరికాలో కొంతమంది సువార్త సభల నిర్వాహకులు ముద్రవేశారు. అయినప్పటికీ- తన స్వాభావిక సహనాన్ని ప్రదర్శిస్తోంది హిందూయిజం. అలాంటి వివాదాస్పద వ్యాఖ్యలే ఇస్లాం లేదా క్రైస్తవం మీద చేస్తే ఎలాంటి ప్రతిస్పందన వస్తుందో తెలియదు గానీ దానికి భిన్నంగా సహనాన్ని చూపుతోంది.
Some on the left reject Thomas Jefferson because he was a “slaveholder.” Some on the right reject him because he was a “deist” & “an enemy of Christianity.” Both are foolish. A fun teaching moment tonight. 🇺🇸 pic.twitter.com/kpuXMJhz95
— Vivek Ramaswamy (@VivekGRamaswamy) October 16, 2024
సహనం అనేది హిందూ తత్వశాస్త్రంలో అంతర్భాగం. అందులోని గాఢతను ఈ సందర్భం ఎత్తి చూపుతోంది. ఆ అమెరికన్ పౌరుడితో జరిగిన సంభాషణ సందర్భంగా రెచ్చిపోవడమో లేక న్యాయపరమైన పరిష్కారం కోరడానికి బదులుగా ప్రశాంతంగా, అంతకుమించిన సహనంతో హిందూమతం పట్ల తనకు ఉన్న విశ్వాసాన్ని సమర్థించుకున్నారు వివేక్ రామస్వామి.
భారత‌్‌లో క్రైస్తవ మతానికి వ్యతిరేకంగా అటువంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేసినట్లయితే- దీనిపై వచ్చే రియాక్షన్ చాలా తీవ్రంగా ఉండేదని విమర్శకులు అంచనా వేస్తోన్నారు. హిందూత్వం అనేది మత అసహనానికి ఆజ్యం పోస్తోందంటూ కొన్ని మీడియాలో కథనాలు వెలువడేవి.
భారత్‌ను అన్యమత అసహన దేశంగా చిత్రీకరించడానికి కొన్ని మీడియా సంస్థలు మాత్రమే కాకుండా అంతర్జాతీయ సంఘాలు కూడా తీవ్రంగా తమ ప్రయత్నాలు సాగించేవి. ద్వేషపూరిత ప్రసంగం కోసం ప్రజావ్యాజ్యాల వంటి చట్టపరమైన అవకాశాలను సైతం ఉపయోగించుకునేవే. ఈ వ్యాఖ్యలను ఎదుర్కొనడానికి క్రైస్తవ సంఘాలు శరవేగంగా ఏకతాటిపైకి వచ్చేవి.
If there had been such a publicised exchange in India where a Hindu in a debate with an Indian Christian leader lashed out at Christianity and called it an evil and devilish religion there would an uproar in Christian circles, it would be said how Hindutva had poisoned our… https://t.co/F4pvZQDOri
— Kanwal Sibal (@KanwalSibal) October 20, 2024
పరమత సహనం అనే తన స్వాభావిక సూత్రాన్ని ఆచరించడంలో హిందూయిజానికి ఏది కూడా సాటి రాదు అనే విషయాన్ని వివేక్ రామస్వామి మరోసారి స్పష్టం చేసినట్టయింది. హిందూమతం, దాని నైతికత, సర్వ ధర్మ సంభవంలో చూపించే ప్రగాఢ విశ్వాసం, ఆధ్యాత్మిక విశ్వాసాలను మరింత విస్తృత పరచగలిగింది.
మారుతున్న కాలానికి అనుగుణంగా, క్షణక్షణానికి సరికొత్తగా రూపుదిద్దుకుంటోన్న ఈ ప్రపంచంలో ఎవరు నిజంగా సహన శీలతను కలిగి ఉంటారు? అనే ప్రశ్న ఇక్కడ తలెత్తుతోంది. వివేక్ రామస్వామితో జరిగిన సంఘటన- హిందూ మతం, దాన్ని లక్ష్యంగా సాగిస్తోన్న దాడులను ఎప్పటికప్పుడు ఎదుర్కొంటోండటం మత సహనానికి ఓ ఉదాహరణగా మిగిలిపోయింది.












Click it and Unblock the Notifications