రష్యా పార్లమెంట్ ఎన్నికల్లో పుతిన్ పార్టీ రికార్డు విజయం
రష్యా పార్లమెంట్(స్టేట్ డ్యూమా)కు జరిగిన ఎన్నికల్లో అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ నాయకత్వంలోని 'యునైటెడ్ రష్యా' పార్టీ రికార్డు స్థాయిలో 355 స్థానాలను కైవసం చేసుకుంది. మొత్తం 450 సీట్లు ఉన్న పార్లమెంట్‌లో ఈ స్థాయిలో మెజారిటీ సాధించడం ఆ పార్టీ చరిత్రలోనే ఇదే తొలిసారి. సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ చీఫ్ ఎల్లా పమ్‌ఫిలోవా వెల్లడించిన ప్రాథమిక ఫలితాల ప్రకారం.. 95 శాతానికి పైగా ఓట్ల లెక్కింపు పూర్తయ్యేసరికి యునైటెడ్ రష్యా పార్టీ 57.83 శాతం ఓట్లను సాధించింది. 2021లో జరిగిన గత ఎన్నికలతో (49.92 శాతం) పోలిస్తే అధికంగా ఓట్ల శాతాన్ని సాధించింది.
పార్టీల ప్రకారం సాధించిన సీట్ల వివరాలిలా..
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ నేతృత్వంలో యునైటెడ్ రష్యా 57.83 ఓట్ల శాతంతో 355 స్థానాలను కైవసం చేసుకుంది. కమ్యూనిస్ట్ పార్టీ 13.81 ఓట్ల శాతంతో 40 స్థానాల్లో విజయం సాధించింది. లిబరల్ డెమోక్రటిక్ పార్టీ 8.98 ఓట్ల శాతంతో 25 స్థానాల్లో గెలిచింది. న్యూపీపుల్ పార్టీ 7.96 ఓట్ల శాతంతో 20 స్థానాల్లో గెలుపొందింది. ఏ జస్ట్ రష్యా పార్టీ 4.96 ఓట్ల శాతం 4 స్థానాలు సాధించింది.

ఓటింగ్ సాతం, తుది ఫలితాల ప్రకటన
మూడో రోజుల పాటు సాగిన ఈ పోలింగ్ లో దాదాపు 59.32 శాతం మంది ఓటర్లు తమ హక్కును వినియోగించుకున్నారు. 2021లో నమోదైన 51.72 శాతంతో పోలిస్తే ఈ సారి ఓటింగ్ శాతం పెరిగింది. ఈ ఎన్నికల్లో ఆన్‌లైన్ లేదా రిమోట్ ఎలక్ట్రానిక్ ఓటింగ్ ద్వారా కూడా పెద్ద ఎత్తున ఓటర్లు ఓట్లు వేశారు. సెప్టెంబర్ 25న ఈ ఎన్నికల్ తుది అధికారిక ఫలితాలను వెల్లడించనున్నారు. దీంతో పాటు పలు రీజియన్లలో జరిగిన గవర్నర్ ఎన్నికల్లో కూడా అధికార పార్టీ మద్దతు ఉన్న అభ్యర్థులే విజయం సాధించారు.
ఉక్రెయిన్ ఆక్రమిత ప్రాంతాల్లో ఓటింగ్, అంతర్జాతీయ స్పందనలు
ఉక్రెయిన్‌పై రష్యా పూర్తిస్థాయి దాడి ప్రారంభించిన తర్వాత జరిగిన తొలి పార్లమెంట్ ఎన్నికలు ఇవే కావడం గమనార్హం, ఉక్రెయిన్ లోని రష్యా ఆక్రమిత ప్రాంతాలలో కూడా ఈ ఎన్నికల పోలింగ్ నిర్వహించారు. దీనిపై ఉక్రెయిన్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఇది చట్టవిరుద్ధమని పేర్కొనగా.. పాశ్చాత్య దేశాలు ఈ చర్యను ఖండించాయి. మరోవైపు ఈ ఫలితాలు రష్యా ప్రజల తీర్పుకు అద్ధ పడుతున్నాయని చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి గువో జియాకున్ వ్యాఖ్యానిస్తూ రష్యాకు తమ మద్దతు ఉంటుందని ప్రకటించారు.














Click it and Unblock the Notifications
