వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ప్రవక్తపై కామెంట్లు సరికాదు.. ప్రపంచం గమనించాలి: పాక్ ప్రధాని షరీఫ్

|
Google Oneindia TeluguNews

మహ్మద్ ప్రవక్తపై బీజేపీ నేత చేసిన కామెంట్స్ అగ్గిరాజేశాయి. ఈ విషయం ప్రపంచ వ్యాప్తంగా దుమారం రేపుతుంది. ఇప్పటికే ఖతర్ సమన్లు జారీచేయగా.. కువైట్ కూడా సమన్లు ఇష్యూ చేసింది. ఈ అంశంపై పాకిస్థాన్ ప్రధానమంత్రి షెబాజ్ షరీఫ్ కూడా స్పందించారు. ప్రవక్తపై బీజేపీ నేత చేసిన వ్యాఖ్యలను ఖండించారు.

మోడీ నేతృత్వంలో భారత్ మత స్వేచ్చను హరిస్తోందని కామెంట్ చేశారు. అక్కడ ముస్లింలు హింసకు గురవుతున్నారని పేర్కొన్నారు. ఈ విషయాన్ని ప్రపంచం గమనించాలని కోరారు. భారత దేశాన్ని మందలించాలని కరారు. ప్రవక్త ప్రేమ సర్వోన్నత అయినది అని.. ముస్లింలు అంతా ప్రవక్త ప్రేమ, గౌరవం కోసం జీవితాన్ని త్యాగం చేయాలని కోరారు.

World should take note: Pak PM condemns BJP leaders Prophet remarks

ప్రవక్తపై చేసిన కామెంట్లను షరీఫ్ ఖండించారు. ఇటీవల జ్ఞాన్ వ్యాపి మసీదుకు సంబంధించి చర్చ జరిగింది. టీవీ డిబేట్‌లో నుపూర్ శర్మ.. మహ్మద్ ప్రవక్తపై తప్పుగా మాట్లాడారు. దీంతో వివాదం చెలరేగింది. హయత్ జఫార్ హస్మి కలుగచేసుకున్నారు. పోస్లర్లు, బ్యానర్లు అతికించి.. బంద్‌కు పిలుపునిచ్చారు. ముస్లింలను రెచ్చగొట్టి రాళ్లతో దాడి చేయడానికి ఉసిగొల్పారు. దీంతో రెండు గ్రూపుల మధ్య గొడవ జరిగింది. దీంతో 39 మంది.. పోలీసులు, జనం గాయపడ్డారు.

రాళ్లతో దాడి చేసిన వారు, కుట్రదారుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ మేరకు పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా తన కథనంలో పేర్కొంది. ఫోటో, వీడియోల ఆధారంగా ఇప్పటివరకు పలువురిని అరెస్ట్ చేశామని కాన్పూర్ పోలీస్ కమిషనర్ తెలిపారు. ఈ ఘటనలో పోలీసుల తప్పిదం ఉంటే కూడా చర్యలు తప్పవని చెప్పారు. హయత్ ఇంటి వద్ద సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా, క్యాంపస్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా పత్రాలు లభించాయి. ప్రవక్తపై కామెంట్ల అంశం దుమారం రేపుతుంది.

English summary
Pakistan Prime Minister Shehbaz Sharif took to Twitter on Sunday to condemn recent remarks made by BJP leaders on Prophet Muhammad.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X