జగిత్యాల వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

పీసీసీ ఇంపార్టెంట్ కాదు, ఏఐసీసే.. ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి హాట్ కామెంట్స్.. రేవంత్‌పై..

|
Google Oneindia TeluguNews

తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో పీసీసీ సెగలు రేపుతోంది. ఒకరిద్దరు కామెంట్స్ చేసినా.. కోమటిరెడ్డి ధిక్కార స్వరం వినిపించినా.. అంతా సద్దుమణిగింది. కానీ మాజీమంత్రి, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి హాట్ కామెంట్స్ చేశారు. పీసీసీ చీఫ్ పదవీ ముఖ్యం కాదని.. జాతీయ స్థాయిలో నేతలు.. సోనియా గాంధీ ముఖ్యం అని చెప్పారు. దీంతో జీవన్ రెడ్డి కూడా పీసీసీ ఆశించారా.. లేదంటే రేవంత్ అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకిస్తున్నారా అనే చర్చకు దారితీసింది.ఇవాళ జగిత్యాలలో జీవన్ రెడ్డి మీడియాతో మాట్లాడారు.

Recommended Video

Revanth expressed his allegiance to congress high command being elected PCC president.
సోనియే..

సోనియే..

పార్టీ బలోపేతానికి అందరూ కృషి చేయాలని చెప్పారు. అయితే రాష్ట్రస్థాయిలో అధ్యక్షుడు ఎవరనే అంశం ముఖ్యం కాదని చెప్పారు. జాతీయ స్థాయిలో సోనియా గాంధీ సూచనలను పాటించాలని చెప్పారు. అంటే ఏఐసీసీ చీఫ్ చెప్పినట్టు నడచుకోవాలని చెప్పారు. ఇక్కడి అధి నాయకత్వాన్ని లెక్కలోకి తీసుకోవద్దనే అంశాన్ని పరోక్షంగా ప్రస్తావించారు.

ఫ్రెండ్‌షిపే ఉండేది.. కానీ

ఫ్రెండ్‌షిపే ఉండేది.. కానీ


వాస్తవానికి రేవంత్ రెడ్డితో జీవన్ రెడ్డి సఖ్యంగా ఉండేవారు. కానీ ఈ కామెంట్స్ మాత్రం కాస్త తేడాగా అనిపిస్తున్నాయి. టీడీపీ నుంచి రేవంత్ రెడ్డి కాంగ్రెస్‌లో చేరిన క్రమంలో.. ఆయనను ఓటుకు నోటు కేసు వెంటాడుతోంది. ఆ సమయంలో జీవన్ రెడ్డిని టీ పీసీసీ చీఫ్ చేస్తారని.. రేవంత్ రెడ్డికి కార్యనిర్వహక అధ్యక్ష పదవీ ఇస్తారని ప్రచారం జరిగింది. కానీ వాస్తవం మాత్రం అందుకు విరుద్దంగా జరిగింది. దీంతో వీరి మధ్య ఏమైనా తేడాలు వచ్చాయా అనే సందేహం వస్తోంది. అందుకే ఇలా కామెంట్స్ చేశారా అనే ప్రశ్న ఉత్పన్నం అవుతుంది.

మరీ టికెట్లు ఎలా..?

మరీ టికెట్లు ఎలా..?


జాతీయస్థాయిలో/ సోనియా గాంధీ సూచనలు, ఆదేశాలు పాటించాలని జీవన్ రెడ్డి అభిప్రాయపడ్డారు. అంటే ఇక్కడ రేవంత్ రెడ్డిని లెక్కచేయం అనే అర్థం వస్తోంది. ఇన్నాళ్లు బానే ఉండి.. ఇప్పుడు సడెన్‌‌గా కామెంట్స్ చేయడంపై సందేహాలు వస్తున్నాయి. వారిద్దరూ నిజంగా బానే ఉన్నారా.. లేదంటే విభేదాలు ఉన్నాయా అనే ప్రశ్న వస్తోంది. సోనియా మాటే శిరోధార్యం అని చెప్పడంతో.. టికెట్లు కూడా ఢిల్లీ నుంచి ఫైరవీ చేసి తెచ్చుకుంటారా అనే సందేహాలు వస్తున్నాయి.

English summary
aicc is priority not tpcc congress mlc jeevan reddy said. but revanth reddy is close to him.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X