జగిత్యాల వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కాలువలో పడ్డ కారు.. ఇద్దరు మృతి

|
Google Oneindia TeluguNews

చిన్న నిర్లక్ష్యం ప్రాణాలను తీస్తోంది. రెప్పపాటులో ఏమైనా జరగొచ్చు.. ఇక రాత్రి ప్రయాణాల్లో జరిగే ప్రమాదాల గురించి అయితే చెప్పక్కర్లేదు. అయితే జగిత్యాల జిల్లాలో మాత్రం ప్రమాదం జరిగిన రెండు రోజులకు వాహనం వెలుగుచూసింది. అందులో ఉన్న ఇద్దరు మృతిచెందారు. వాహనం కాలువలో పడటం.. ఫోన్లు స్విచాప్ కావడంతో వారి ఆచూకీ కనుగొనడం కాస్త ఆలస్యం జరిగింది.

జగిత్యాల జిల్లా మెట్ పల్లికి చెందిన పూదరి నర్సగౌడ్.. స్థానిక టీఆర్ఎస్ నేత, మాజీ సర్పంజ్ కూడా.. ఇతని కుమారుడు రేవంత్ గౌడ్.. అతని స్నేహితుడు ప్రసాద్.. వీరిద్దరూ కలిసి టవేరా వాహనంలో బయల్దేరారు. రేవంత్‌కు ఇటీవల పెళ్లి జరిగిందని తెలుస్తోంది. వారిద్దరూ సోమవారం రాత్రి వాహనంలో బయల్దేరారు. రాత్రి 12 గంటల సమయంలో వారి వాహనం వెల్లుల్ల బ్రిడ్జీ వద్ద ఢీ కొంది. ఆ వెంటనే కాలువలో నిటారుగా పడి.. మునిగిపోయింది. వెంటనే డోర్ లాక్ కావడంతో.. బయటకు తీసే వీలు లేకుండా పోయింది. ప్రమాదం రాత్రి జరగడంతో.. ఎవరూ చూడలేదు.

tavera fell into canal, two dead

సోమవారం రాత్రి గడిచింది. మంగళవారం వారి ఆచూకీ తెలియలేదు. వారి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఎక్కడ కూడా అనుమానం రాలేదు. దీంతో సీసీ టీవీ ఫుటేజీ కూడా మెట్ పల్లి నుంచి వాహనం వెళ్లేది కనిపించింది. వెల్లుల్ల వద్ద కల్వర్ట్ గ్రిల్ ఊడిపోయాయి. దీంతో అక్కడ కారు పడిపోయిందా అనుకొని చూశారు. వారు ఊహించిన విధంగానే కారు అందులో ఉంది. అందులో ఉన్న ఇద్దరూ కూడా విగతజీవులుగా మారారు. ఇంకేముంది వారి కుటుంబాల్లో విషాదఛాయలు అలుముకున్నాయి.

English summary
tavera fell into canal, two dead
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X