బీసీసీఐ సంచలనం- టీమిండియా కేప్టెన్‌గా జస్‌ప్రీత్ బుమ్రా అపాయింట్..!!

ముంబై: భారత క్రికెట్ జట్టు ప్రస్తుతం వెస్టిండీస్ పర్యటనలో ఉంది. సుదీర్ఘమైన సిరీస్ ఇది. వచ్చేనెల 13వ తేదీ వరకు టీమిండియా అక్కడే ఉంటుంది. వెస్టిండీస్‌తో రెండు టెస్టులు, మూడు వన్డేలు, అయిదు టీ20 ఇంటర్నేషనల్స్ మ్యాచ్‌లను ఆడనుంది. ఇందులో రెండు టెస్టులు ముగిశాయి కూడా. 1-0 తేడాతో దీన్ని గెలుచుకుంది భారత్.

మూడు వన్డేల సిరీస్‌లో ఈ రెండు జట్లు కూడా 1-1 తేడాతో సమంగా నిలిచాయి. తొలి వన్డేను భారత్ తన ఖాతాలో వేసుకోగా.. రెండో వన్డేలో విండీస్ విజయఢంకా మోగించిన విషయం తెలిసిందే. నిర్ణయాత్మక మూడో వన్డే మంగళవారం షెడ్యూల్ అయింది. తరౌబా స్టేడియం దీనికి ఆతిథ్యాన్ని ఇస్తోంది. 3వ తేదీ నుంచి టీ20 సిరీస్ ఆరంభమౌతుంది.

Jasprit Bumrah named as Team Indias Captain for Ireland T20Is

దీని తరువాత భారత జట్టు ఆసియా గేమ్స్‌లో పాల్గొంటుంది. చైనాలోని హౌంగ్ఝౌలో ఆసియా గేమ్స్ జరుగనున్నాయి. సెప్టెంబర్ 23 నుంచి అక్టోబర్ 8వ తేదీ వరకు ఆసియా గేమ్స్ జరుగనున్నాయి. ఇది టీ20 ఫార్మట్. ఇందులో మహిళలతో పాటు పురుషుల భారత క్రికెట్ జట్టు పాల్గొంటుంది. పురుషుల క్రికెట్ జట్టు ఆసియా గేమ్స్‌లో ఆడటానికి ఉద్దేశించిన ప్రతిపాదనలపై బీసీసీఐ ఇదివరకే ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే.

అనంతరం.. భారత జట్టు ఐర్లాండ్ పర్యటనకు బయలుదేరి వెళ్తుంది. మూడు టీ20 మ్యాచ్‌ల సిరీస్ ఇది. తొలి మ్యాచ్ ఆగస్టు 18వ తేదీన షెడ్యూల్ అయింది. 20, 23 తేదీల్లో మిగిలిన రెండు గేమ్స్ ఉంటాయి. ఈ మూడు మ్యాచ్‌లకు కూడా డబ్లిన్‌ స్టేడియం వేదికగా మారింది. ఈ సిరీస్‌లో ఆడబోయే జట్టును కొద్దిసేపటి కిందటే ప్రకటించింది భారత్ క్రికెట్ కంట్రోల్ బోర్డ్.

ఫాస్ట్ బౌలర్ జస్‌ప్రీత్ బుమ్రాను కేప్టెన్‌గా నియమించింది. గాయం కారణంగా సుదీర్ఘకాలం పాటు క్రికెట్‌కు దూరంగా ఉంటూ వస్తోన్న బుమ్రాకు ఏకంగా కేప్టెన్సీ పగ్గాలను అప్పగించడం ప్రాధాన్యతను సంతరించుకుంది. గాయం వల్ల అంతర్జాతీయ క్రికెట్‌కు దూరమైన ప్రసిద్ధ్ కృష్ణకు కూడా జట్టులో చోటు కల్పించింది.

జస్‌ప్రీత్ బుమ్రా కేప్టెన్‌గా వ్యవహరించే ఈ జట్టులో- రుతురాజ్ గైక్వాడ్ (వైస్ కెప్టెన్), యశస్వి జైస్వాల్, తిలక్ వర్మ, రింకూ సింగ్, సంజు శాంసన్ (వికెట్ కీపర్), జితేష్ శర్మ (వికెట్ కీపర్), శివమ్ దూబే, వాషింగ్టన్ సుందర్, షాబాజ్ అహ్మద్, రవి బిష్ణోయ్, ప్రసిద్ధ్ కృష్ణ, అర్ష్‌దీప్ సింగ్, ముఖేష్ కుమార్, అవేష్ ఖాన్‌ను తీసుకుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+