బాల్క సుమన్‌కు మంత్రి కేటీఆర్ పరామర్శ.. కొప్పుల ఈశ్వర్ కూడా
చెన్నూరు ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ బాల్క సుమన్‌ను మంత్రి కేటీఆర్ పరామర్శించారు. సుమన్ తండ్రి బాల్క సురేష్ ఇటీవల చనిపోయిన సంగతి తెలిసిందే. ఆయన మెట్‌పల్లి మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్‌గా పనిచేశారు. హైదరాబాద్‌లోని యశోద ఆసుపత్రిలో అనారోగ్యంతో గతనెల 28వ తేదీన చనిపోయారు. ఇవాళ మంత్రి కేటీఆర్ సుమన్ స్వగ్రామం రేగుంట వచ్చారు.
మంత్రి కొప్పుల ఈశ్వర్, కోరుట్ల, జగిత్యాల ఎమ్మెల్యేలు విద్యాసాగర్ రావు, సంజయ్ కుమార్, జెడ్పీ చైర్ పర్సన్ దావ వసంత తదితరులు సుమన్‌ను పరామర్శించారు.
మెట్‌పల్లి మార్కెట్ కమిటీ చైర్మన్‌గా పనిచేసిన సురేశ్, టీఆర్ఎస్ పార్టీ క్రియాశీల నాయకుడిగా చురుకైన పాత్రపోషించారు. తెలంగాణ ఉద్యమంలో బాల్క సుమన్ చురుకైన పాత్ర పోషించారు. తండ్రి వెన్నుదన్నుగా ప్రోత్సహించడంతోనే.. సుమన్ విద్యార్థి జేఏసీ నేతగా, రాజకీయాల్లో రాణించగలుగుతున్నారు.

ఈ నెల 10వ తేదీన సురేశ్ కర్మ జరగనుంది. ఆ రోజు సీఎం కేసీఆర్ వస్తారని తెలిసింది. అందుకు సంబంధించి ఏర్పాట్లను అధికారులు పరిశీలిస్తున్నారు. సురేశ్ చనిపోయిన రోజున.. కేసీఆర్ ఫోన్‌లో మాట్లాడారు. ఆయనకు ధైర్యం చెప్పారు. ఇప్పుడు కర్మ రోజున వచ్చి ప్రత్యక్షంగా పలకరించనున్నారు.
బాల్క సుమన్ చొచ్చుకొని వెళతారు. ఆ క్రమంలోనే కేటీఆర్‌తో సాన్నిహిత్యం ఏర్పడింది. ఓ న్యూస్ యాంకర్‌ను సుమన్ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. తర్వాత పెద్దపల్లి లోక్ సభ నుంచి పోటీ చేసి గెలుపొందారు. తర్వాత చెన్నూరు అసెంబ్లీ నుంచి పోటీ చేసి విజయం సాధించారు. ప్రభుత్వ విప్‌గా ఉన్నారు. సుమన్ ఎదుగుతున్న క్రమంలో.. తండ్రి సురేశ్ మరణం వారి కుటుంబాన్ని తీవ్రంగా కలచివేసింది.
అంతకుముందు పల్లె ప్రగతి ద్వారా గ్రామాలు అద్భుతంగా తయారయ్యాయని, పట్టణ ప్రగతి ద్వారా పట్టణాలను కూడా అద్భుతంగా తీర్చిదిద్దుతున్నామని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. కొత్త మున్సిపల్ చట్టాన్ని కఠినంగా అమలు చేస్తున్నామని చెప్పారు. జగిత్యాల జిల్లాలో పలు అభివృద్ధి పనులను ప్రారంభించిన అనంతరం కేటీఆర్ మీడియాతో మాట్లాడారు.
రామన్నకు కృతజ్ఞతలు 🙏 @KTRTRS @trspartyonline @ntdailyonline @TelanganaToday @sakshinews @TV9Telugu @TNewsTelugu pic.twitter.com/2hQmQfnKXg
— Balka Suman (@balkasumantrs) June 7, 2021
-
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
రామ్‌చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
సప్తగిరి ఎక్స్‌ప్రెస్, చర్లపల్లి సూపర్ ఫాస్ట్ రైళ్లకు ఇకపై -
ఉత్తర తెలంగాణా అభివృద్ధిలో గేమ్ ఛేంజర్ ఆ ఎయిర్పోర్ట్.. కేంద్రం మరో కీలక అడుగు! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్‌తో ఛాన్స్ కొట్టేసింది! -
తండ్రి, తనయుడి స్థానాలు ఇవే- డీఎంకే తొలి జాబితా -
జన్మ నక్షత్రం పునర్వసు, పుష్యమి, ఆశ్లేష ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
H-1B Visa: హెచ్1బీ లాటరీ నోటీసుల విడుదల-స్టేటస్ ఇలా చెక్ చేసుకోండి..! -
రాజమండ్రి- కాకినాడ పోర్ట్ రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక -
ఏప్రిల్ లో బ్యాంకులకు వరుస హాలిడేస్ - స్కూళ్లకు వేసవి సెలవులపై తాజా ఉత్తర్వులు..!! -
ఇరాన్‌కు రోజుకు రూ. 1,319 కోట్ల ఆదాయం.. అమెరికా అంతమే లక్ష్యంగా..!! -
బంగారం ధరలు తలకిందులు












Click it and Unblock the Notifications