Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

బెదిరింపులకు భయపడబోం: కరీంనగర్ హిందూ ఏక్తా యాత్రలో అసోం సీఎం హిమంత బిశ్వవర్మ

కరీంనగర్: తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వం, బీఆర్ఎస్, ఎంఐఎం పార్టీలపై అసోం సీఎం హిమంత బిశ్వశర్మ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. తెలంగాణాలో రాజాకార్ల రాజ్యం నడుస్తోందని.. రామరాజ్యం ఏర్పాటే తమ లక్ష్యమని అన్నారు. కరీంనగర్‌లో తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ఆధ్వర్యంలో నిర్వహించిన హిందూ ఏక్తా యాత్రలో సీఎం హిమంత బిశ్వశర్మ పాల్గొని ప్రసంగించారు.

తెలంగాణ రాష్ట్రంలో రజాకార్ల రాజ్యం పోయి.. రామరాజ్యం రాబోతుందన్నారు హిమంత బిశ్వశర్మ. ఓవైసీ బెదిరింపులకు ఎవరూ భయపడబోరని.. ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తానని సవాల్ విసిరారు. ఒవైసీ ఇంట్లోకి కూడా వస్తా.. ఏం చేస్తాడో చూస్తానన్నారు. బీఆర్ఎస్, ఎంఐఎంలు ఒక్కటేనన్నారు. అసోంలో 6 వేల మదర్సాలనూ బంద్ చేయించామని.. వచ్చే ఏడాది మరో 1000 మదర్సాలనూ మూసివేస్తామన్నారు సీఎం హిమంత బిశ్వశర్మ.

assam CM Himanta Biswa Sarma in Karimnagar hindu ekta yatra

ధనిక రాష్ట్రం అయిన తెలంగాణలో పెట్రోల్, డీజిల్ ధరలు అధికంగా ఎందుకున్నాయని హిమంత బిశ్వ శర్మ ప్రశ్నించారు. అసోంలో లీటర్ డీజిల్ 92 రూపాయలే ఉందన్నారు. తెలంగాణలో ఉద్యోగులకు జీతాలివ్వడం లేదని.. బీజేపీ ప్రభుత్వం రాగానే ఒకటో తారీఖునే జీతాలిస్తామన్నారు. అంతేగాక,తెలంగాణలో భారీగా ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పారు. తెలంగాణ సర్కార్ పేరు ఢిల్లీలో మారుమోగుతోందని.. బీఆర్ఎస్ పెద్దలు లిక్కర్ దందాలు చేస్తున్నారని ఎద్దేవా చేశారు.

బీఆర్ఎస్ ప్రభుత్వానికి వీఆర్ఎస్ తప్పదని జోస్యం చెప్పారు హిమంత బిశ్వశర్మ. భారత్‌లో త్వరలోనే సివిల్ కోడ్ యూనిఫామ్ అమలు చేస్తామని హిమంత బిశ్వ శర్మ చెప్పారు. భారత్‌ను ఎవ్వరూ భయపెట్టలేరని.. జమ్మూకశ్మీర్‌లో 370 ఆర్టికల్‌ను రద్దుచేశామన్నారు. కేరళ స్టోరీని సెక్యులర్ వాదులు వ్యతిరేకిస్తున్నారని.. ఒక్కసారి వాళ్లు అస్సాం వచ్చి చూస్తే అర్థమవుతుందన్నారు. అసోం రాష్ట్రంలో లవ్ జిహాద్‌ను అడ్డుకున్నామన్నారు. తాను అసోం వెళ్లి తెలంగాణలో మార్పు మొదలైందని చెప్తానన్నారు. మోడీ పేద ప్రజల అభివృద్ది కోసం కష్టపడుతున్నారని తెలిపారు.

ఒక్క కర్ణాటక రాష్ట్రంలో గెలిచిన కాంగ్రెస్ పార్టీ అతివిశ్వాసంతో అవాకులు చెవాకులు పేలుతోందని హిమంత మండిపడ్డారు. కాంగ్రెస్ గెలుపు కర్ణాటకకు మాత్రమే పరిమితమన్నారు. కాగా, కరీంనగర్‌లో జరిగిన హిందూ ఏక్తా యాత్రలో భారీ ఎత్తున యువకులు హాజరయయారు. కరీంనగర్ మొత్తం కాషాయమయమైంది. జైశ్రీరాం, జై భజరంగ భళీ అంటూ యువత కదంతొక్కారు. అంతకుముందు హైదరాబాద్ విమానాశ్రయం చేరుకున్న హిమంత బిశ్వశర్మకు రాష్ట్ర బీజేపీ నేతలు ఘన స్వాగతం పలికారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+