విషాదం: ఖమ్మంలో పెట్రోల్ పోసుకుని వైద్య విద్యార్థిని మానస ఆత్మహత్య
ఖమ్మం: రాష్ట్రంలో మరో వైద్య విద్యార్థిని బలవన్మరణానికి పాల్పడింది. ఇటీవల వరంగల్‌లోని కాకతీయ మెడికల్ కాలేజీలో చదివిన మెడికో ప్రీతి ఆత్మహత్య చేసుకోవడం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఆ ఘటన మరవకముందే ఇప్పుడు మళ్లీ అలాంటి ఘటనే ఖమ్మంలో చోటుచేసుకుంది. ఖమ్మంలోని సముద్రాల మానస(22) అనే వైద్య విద్యార్థిని పెట్రోల్ పోసుకొని నిప్పంటిచుకుని ఆత్మహత్య చేసుకుంది.
మహబూబాబాద్‌కు చెందిన మానస ఖమ్మంలోని మమత మెడికల్ కళాశాలలో నాలుగో సంవత్సరం చదువుతోంది. వైద్య కళాశాల ఎదురుగా ఉన్న హాస్టల్లో ఉంటోంది. హస్టల్ భవనంలోనే గదిలో నిప్పంటించుకొని బలవన్మరణానికి పాల్పడింది. ఆమె మృతదేహాన్ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

అయితే ఆమె ఎందుకు ఇలా ఆత్మహత్య చేసుకుందో అనే విషయాలపై ఇంకా స్పష్టత లేదు. వేధింపులా? చదువు ఒత్తిడా? మానసికంగా ఆత్మస్థైర్యం కోల్పోయిందా అన్న కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నారు.
బాసర ట్రిపుల్ ఐటీలో మరో షాకింగ్ ఘటన: విద్యార్థుల ఆందోళన
బాసర ట్రిపుల్ ఐటీ మరోసారి వార్తల్లోకెక్కింది. ఈసారి సిబ్బంది వ్యవహారతీరు కారణమైంది. వేసవి సెలవులు కావడంతో ఇంటికి వెళ్లిన విద్యార్థులు తిరిగి హాస్టల్‌కు రాగా.. వారి బట్టలు, సామాన్లు కనిపించలేదు. ఈ విషయం గురించి సిబ్బందిని అడగ్గా వారు నిర్లక్ష్యంగా సమాధానమిచ్చారు. విద్యార్థులు లేని సమయంలో హాస్టల్స్ గదుల తాళాలు పగల గొట్టిన సిబ్బంది.. విద్యార్థుల బట్టలు, సామాన్లు బయట పడేశారు.
జూన్ 7వ తేదీ నుంచి విద్యార్థులకు సెమిస్టర్ పరీక్షలు ఉండటంతో వారు తిరిగొచ్చారు. దీంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఈ వ్యవహారంపై విద్యార్థుల తల్లిదండ్రుల మండిపడుతున్నారు. పిల్లలు.. పడేసిన సామాన్లు కోసం వెతుక్కోవాలా? లేదా పరీక్షలు రాయాలా? అని ప్రశ్నిస్తున్నారు. తమ పిల్లలకు ఏవైనా ఆటంకాలు కలిగితే.. అందుకు బాసర ట్రిపుల్ ఐటీ అధికారులు, సిబ్బందే బాధ్యత వహించాలని హెచ్చరించారు. అయితే, విద్యార్థుల బట్టలు, సామాన్లు ఎందుకు బయటపడేశారనేది తెలియాల్సి ఉంది. ఇప్పటికే పలుమార్లు విద్యార్థులు తమ సమస్యలు తీర్చాలంటూ ఆందోళనలు చేసిన విషయం తెలిసిందే.
-
వేసవి సెలవుల షెడ్యూల్ లో కీలక మార్పులు, తాజా ఉత్తర్వులు..!! -
పెళ్లి కాకపోయి ఉంటే ఆ హీరోతో డేటింగ్ చేస్తా - అనసూయ -
ప్రతి మిడిల్ క్లాస్ ఫ్యామిలీని కదిలిస్తుంది ఈ సినిమా! -
రైతు భరోసా అమలులో కీలక మార్పులు, ఇక వారికీ వర్తింపు - నిధుల జమ ముహూర్తం..!! -
బంగారం ధరలు.. మళ్లీ మొదటికి -
పచ్చని చెట్ల మధ్య దాగి ఉన్న తెల్లపామును చూశారా..? -
రైలు బయల్దేరే ముందు ఎక్కే స్టేషన్ మార్పు..! రైల్వే కొత్త రూల్..! -
పేలిన ధరల బాంబు- ఒక్కో సిలిండర్ పై రూ. 195.50 పెంపు -
డబ్బింగ్ సినిమాతో తమిళంలో రజనీకాంత్ రికార్డులను బద్ధలు కొట్టిన రాజశేఖర్ -
పవన్ కళ్యాణ్‌ని నిండాముంచిన హరీష్ శంకర్.. -
ప్రదీప్ రంగనాథన్ 'LIK' టీజర్ రివ్యూ: వరుసగా ఎన్ని హిట్స్ కొడతావ్ అన్నా..!! -
ఐఐటీ, నీట్ రాసే ఇంటర్ విద్యార్థులకు లోకేష్ గుడ్ న్యూస్..!












Click it and Unblock the Notifications