ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు 2019: ఆదోని నియోజ‌క‌వ‌ర్గం గురించి తెలుసుకోండి

Recommended Video

    AP Assembly Election 2019 : Adoni Assembly Constituency Report | Oneindia Telugu

    క‌ర్నూలు జిల్లాలోని ఆదోని టౌన్, ఆదోని రూర‌ల్ క‌లిపి ఆదోని నియోజ‌క‌వ‌ర్గంగా ఉంది. పున‌ర్విభ‌జ‌న లో భాగంగా ఆదోని సెగ్మెంట్ మొత్తంగా ఆదోనిలోనే చేరింది. ఇక్క‌డి నుండి టిడిపి నాయ‌కుడు మీనాక్షి నాయుడు మూడు సార్లు విజ‌యం సాధించారు. ఇక్క‌డ ఒక‌సారి గెలిచిన సాయి ప్ర‌సాద‌రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ శివ‌రామిరెడ్డి సోద‌రుడు. మ‌రో సోద‌రుడు మం త్రాల‌యం ఎమ్మెల్యే బాల‌నాగిరెడ్డి. ఆదోని అసెంబ్లీ సెగ్మెంట్ క‌ర్నూలు లోక్‌స‌భ ప‌రిధిలోకి వ‌స్తుంది. ఇక్క‌డ రాజ‌కీయాలు 2009 వ‌ర‌కు ఒక విధంగా..ఆ త‌రువాత మ‌రో విధంగా స‌మీక‌ర‌ణాల్లో మార్పు క‌నిపిస్తుంది.

    14 సార్లు ఎన్నిక‌లు..రెండు పార్టీల పోరు
    1952 నుండి 2014 వ‌ర‌కు ఆదోని నియోజ‌క‌వ‌ర్గానికి 14 సార్లు ఎన్నిక‌లు జ‌రిగాయి. అందులో కాంగ్రెస్ ఏడు సార్లు, టిడిపి నాలుగు సార్లు, పిఎస్పి ఒక‌సారి, ఇద్ద‌రు ఇండిపెండెంట్లు నెగ్గారు. ఇక‌, 2014 ఎన్నిక‌ల్లో వైసిపి గెలుపొందింది. వై సాయి ప్ర‌సాద‌రెడ్డి కాంగ్రెస్ నేత‌గా ఇక్క‌డి నుండి 2004 లో గెలిచారు. 2009 లో టిడిపి అభ్య‌ర్ధి మీనాక్షి నాయుడు చేతిలో ఓడిపో యారు. ఆ త‌రువాత వైసిపి లో చేరిన సాయి ప్ర‌సాద‌రెడ్డి 2014 ఎన్నిక‌ల్లో తిరిగి గెలుపొందారు.

    #AndhraPradeshElections2019: All about Adoni Constituency

    2014 ఎన్నిక‌ల్లో వైసిపి గెలుపు..
    2014 ఎన్నిక‌ల్లో ఆదోని నియోజ‌క‌వ‌ర్గంలో మొత్తం ఓట్లు 211266 ఓట్లు కాగా, అందులో 187884 ఓట్లు పోల‌య్యాయి. వైసిపి నుండి పోటీ చేసిన సాయిప్ర‌సాద రెడ్డికి 72921 ఓట్లు రాగా, టిడిపి అభ్య‌ర్ధి మీనాక్షి నాయుడుకి 55290 ఓట్లు వ‌చ్చాయి. కాగా వైసిపి అభ్య‌ర్ధి సాయి ప్ర‌సాద‌రెడ్డి 17631 ఓట్ల అధిక్యంతో గెలుపొందారు. సాయి ప్ర‌సాద‌రెడ్డి జిల్లాలో వైసిపి కి కీల‌క నేత‌గా మారారు. శాస‌న‌స‌భ‌లోనూ వైసిపి స‌భ్యుడ‌గా ప్ర‌త్యేక హోదా కోసం బ‌లంగా వాయిస్ వినిపించారు.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+