తల్లి గుండే తల్లడిల్లిన వేళ, ఇద్దరు పిల్లలపై పేట్రోలు పోసిన వైనం..
కుటుంభ తగదాలు ఇద్దరు పసిపిల్లల ప్రాణాలు బలిగొన్నాయి. తల్లిదండ్రుల మధ్య గొడవల్లో పసి పిల్లలు అని కూడ చూడకుండా కన్నతల్లే వారిపై పెట్రోల్ పోసి నిప్పటించింది. అనంతరం తల్లి కూడ ఆత్మహత్య చేసుకుంది.

కర్నూల్ జిల్లా ఎమ్మిగనూరు మండలం మసీదుపురంలో దారణం , గ్రామంలోని నరసింహులు , పద్మావతి దంపతులకు మనోజ్ కుమార్ 5, సంజీవ్ 4 అనే కుమారులు ఉన్నారు. అయితే ఇద్దరు దంపతుల మధ్య గత కొద్ది రోజులుగా గొడవలు జరుగుతున్నాయి, ఈనేపథ్యంలోనే బుధవారం ఉదయం నరసింహులు ఉదయమే బయటకు వెళ్లాడు, దీంతో ఇద్దరు పడుకున్న పిల్లలపై పెట్రోల్ పోసి నిప్పంటించింది పద్మావతి, అనంతరం ఆమే కూడ పెట్రోల్ పోసుకుని అంటించుకుంది. ఈ పరిస్థితుల్లో చూసిన చుట్టుపక్కల ప్రజలు వెంటనే అమేపై మంటలు ఆర్పారు. అనంతరం చికిత్స కోసం అసుపత్రికి పిల్లలతో పాటు ఆమేను తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దార్యాప్తు చేస్తున్నారు.












Click it and Unblock the Notifications