జగన్‌పై కేసులు నిజమైనవే, తిరుపతిలో టీడీపీ గెలిస్తే వైసీపీ అరాచకాలకు చెక్: చంద్రబాబు
సీఎం జగన్‌పై ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు విరుచుకుపడ్డారు. విపక్ష నేతలపై కావాలని కేసులు పెట్టడం సరికాదన్నారు. దేవినేని ఉమ కేసు విషయాన్ని ఆయన ప్రస్తావించారు. తమ పార్టీకి చెందిన నేతల కన్నా.. జగన్‌పై ఉన్నవే నిజమైన కేసులు అని చెప్పారు. టీడీపీ శ్రేణులను వేధించడం కోసమే కేసులు కట్టారని చంద్రబాబు ధ్వజమెత్తారు. ఈ విషయం ప్రజలకు కూడా తెలుసు అని చెప్పారు. వారు వైసీపీకి బుద్ది చెబుతారని తెలిపారు. జగన్ అరాచకాలకు చెక్ పెట్టాల్సిన అవసరం ఉందన్నారు.

తప్పుడు కేసులే
సీఎం జగన్ పై ఉన్న కేసుల అన్నీ నిజమైన కేసులని చంద్రబాబు అన్నారు. దేవినేని ఉమపై బోగస్ కేసు నమోదు చేశారని మండిపడ్డారు. తప్పుడు కేసులకు తెలుగుదేశం పార్టీ భయపడదు, భయపడబోదు అన్నారు. తెలుగుదేశం పార్టీ ఎన్నో రోజులు ఉండదని వైసీపీ నేతలు ప్రచారం చేస్తున్నారని... తెలుగుజాతి ఉన్నంత కాలం టీడీపీ ఉంటుందని చెప్పారు. నెల్లూరు జిల్లా వెంకటగిరిలో చంద్రబాబు ఈ కామెంట్స్ చేశారు.

పేదల కోసమే
బడుగు, బలహీన వర్గాల కోసం ఎన్టీఆర్ టీడీపీ పార్టీ ఏర్పాటు చేశారని తెలిపారు. తిరుపతి ఉపఎన్నికలో టీడీపీ గెలిస్తేనే జగన్ అరాచకాలు తగ్గుతాయని చెప్పారు. లేదంటే వారు మరింత రెచ్చిపోయే ప్రమాదం ఉందని చెప్పారు. టీడీపీ హయాంలో నరేగా బిల్లులు ఇంత వరకు చెల్లించకపోవడం దారుణమని మండిపడ్డారు. నరేగా బకాయిలను చెల్లించేంత వరకు న్యాయబద్ధంగా పోరాడుతామని అన్నారు. ఇకపై కార్యకర్తల కోసం ఎక్కువ సమయం కేటాయిస్తానని చెప్పారు.

కేసు ఎందుకంటే
సీఎం జగన్ వీడియో మార్ఫ్ చేశారని మాజీమంత్రి దేవినేని ఉమపై సీఐడీ కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. దీనిపై చంద్రబాబు నాయుడు స్పందించారు. మిగతా నేతలపై కేసులు కూడా సరికాదు అని కామెంట్ చేశారు. జగన్ సర్కార్ చేసే పనులను జనం చూస్తున్నారని.. తగిన సమయంలో బుద్ది చెబుతారని చెప్పారు. తిరుపతి ఉప ఎన్నికలో టీడీపీ జెండా ఎగరడం ఖాయం అని చెప్పారు.












Click it and Unblock the Notifications