లోకసభ ఎన్నికలు 2019 : నెల్లూరు నియోజకవర్గం గురించి తెలుసుకోండి
Recommended Video

అసలు సిసలు రాజకీయాలకు కేరాఫ్ చిరునామా నెల్లూరు రాజకీయాలు. తమిళనాడు సరిహద్దుతో కలిసి ఉన్న ఈ జిల్లా రాజకీయాల్లో నెల్లూరు లోక్‌సభ ది ప్రత్యేక స్థానం. ఎందరో హేమా హేమీలు ఇదే జిల్లా నుండి లోక్‌సభలో కాలు పెట్టారు. ప్రధాన పార్టీల్లోని వర్గ పోరాటాలు ఇక్కడి ఎన్నికల ఫలితాలను నిర్ధేశిస్తాయి. రెడ్డి- ఎస్సీ వర్గాలకు చెందిన వారు ఇక్కడ నుండి అనేక సార్లు లోక్‌సభ కు ఎన్నికయ్యారు. కాంగ్రెస్ లోని వర్గ పోరు ఇక్కడి గెలుపు ఓటమలు పై ప్రభావం చూపించే స్థాయిలో ఉండేవి. ఇక, టిడిపి లోని ప్రముఖ నేతలు ఇదే జిల్లా కు చెందిన వారు..
1962 లో ఆవిర్భావం ...19 ఎన్నికలు
నెల్లూరు లోక్‌సభ నియోజకవర్గం 1962లో ఏర్పాటైంది. తొలుత ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గం ఉన్న నెల్లూరు 2009 లో జనరల్ స్థానంగా మారింది. ఈ స్థానంలో ఇప్పటి వరకు 19 సార్లు ఎన్నికలు జరిగాయి. ఇందులో ఒకసారి స్వతంత్ర అభ్యర్ధి, ఏడు సార్లు కాంగ్రెస్ అభ్యర్ధి, మూడు సార్లు టిడిపి, రెండు సార్లు వైసిపి అభ్యర్ధి గెలుపొందారు. జిల్లాలో ముఖ్య నేతలైన మేకపాటి రాజమోహన రెడ్డి, పనబాక లక్ష్మీ ఇక్కడి నుండే మూడు సార్లు చొప్పున లోక్‌సభ కు ఎన్నికయ్యారు. ఇప్పటి వరకు జరిగిన ఎన్నికల్లో ఆరుగురు ఎస్సీ నేతలు 14 సార్లు.. ముగ్గురు రెడ్డి నేతలు అయిదు సార్లు లోక్‌సభ సభ్యులుగా ఎన్నికయ్యారు.
20 లక్షల జనాభా ...
నెల్లూరు లోక్‌సభ నియోజకవర్గ పరిధిలో 20 లక్షల 60 వేల 29 మంది ఓటర్లు ఉన్నట్లు అధికారిక లెక్కలు చెబుతున్నా యి. అందులో గ్రామీణ ప్రాంత జనాభా 65.73 శాతం కాగా, అర్బన్ జనాభా 34.27 శాతంగా ఉంది. ఎస్సీ జనాభా 19.23 శాతం గా ఉంది. ఇక, ఎస్టీ జనాభా 7.87 శాతం గా రికార్డుల్లో నమోదైంది.

16 లక్షల ఓటర్లు..13 వేల మెజార్టీ..
నెల్లూరు లోక్‌సభ పరిధిలో మొత్తం 16 లక్షల ఆరు వేల 140 మంది ఓటర్లు ఉన్నారు. అందులో పురుష ఓటర్లు ఏడు లక్షల 96 వేల 583 మంది కాగా, మహిళా ఓటర్లు 8 లక్షల 9వేల 557 మంది ఉన్నారు. గత ఎన్నికల్లో లోక్‌సభ పరిధిలో మొత్తం 11 లక్షల 87 వేల 648 ఓట్లు పోలయ్యాయి. ఓటింగ్ 74 శాతంగా నమోదైంది.
2014 ఎన్నికల్లో వైసిపి గెలుపు..
నెల్లూరు లోక్‌సభ నుండి 2014 ఎన్నికల్లో వైసిపి అభ్యర్ధి గెలుపొందారు. వైసిపి అభ్యర్ధి మేకపాటి రాజమోహన రెడ్డికి 5 లక్షల 76 వేల 396 ఓట్లు పోలవ్వగా..టిడిపి అభ్యర్ధి ఆదాల ప్రభాకర రెడ్డికి 5 లక్షల 62 వేల 918 ఓట్లు పోలయ్యాయి. ఈ ఎన్నికల్లో వైసిపి అభ్యర్ధి 13,478 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. కాగా, లోక్‌సభ పరిధిలోని కందుకూరు- 288, కావలి-272, ఆత్మకూరు-27620, నెల్లూరు సిటీ -4712, నెల్లూరు రూరల్ -5135 ఓట్ల మెజార్టీ వైసిపికి దక్కింది. మిగిలిన నిమోజకవర్గాలై న కోవూరు- 19155, ఉదయగిరి - 4399 ఓట్ల మెజార్టీ టిడిపికి దక్కింది.
లోక్‌సభ సభ్యుడిగా మేకపాటి ..
సీనియర్ పార్లమెంట్ సభ్యుడైన మేకపాటి రాజమోమనరెడ్డి ఈ సమావేశాల్లో డిసెంబర్ చివరి వరకు సభలో 59 చర్చల్లో పాల్గొన్నారు. ఈ సమావేశాల్లో 310 ప్రశ్నలు సంధించారు. కాగా, మేకపాటి హాజరు 91 శాతంగా నమోదైంది.
హోదా కోసం రాజీనామా..బరిలో ఆయనే
ఏపికి ప్రత్యేక హోదా డిమాండ్ తో వైసిపి సభ్యులతో కలిసి మేకపాటి రాజమోహనరెడ్డి లోక్‌సభ సభ్యత్వానికి రాజీనామా చేసారు. ఆ తరువాత నిరహార దీక్ష చేసారు. ఇక, వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో ఆయన తిరిగి పోటీ చేయటం ఖాయంగా కని పిస్తోంది. ఆయన పోటీ చేస్తారా లేక సోదరుడికి అవకాశం ఇస్తారా అనే చర్చ సైతం కొనసాగుతోంది. ఇక, టిడిపి నుండి ఈ సారి బీద మస్తాన్ రావు బరిలో ఉంటారని ప్రచారం జరుగుతోంది. ఈ జిల్లాలో జనసేనకు అభిమాన గణం ఎక్కువగా ఉన్న ఇప్పటి వరకు అభ్యర్ధులు ఎవరేనది ఇంకా అంచనాకు రాలేదు. ఈ సారి నెల్లూరు లోక్‌సభ నియోజవర్గంలో రెండు పార్టీల మధ్య హోరా హోరీ పోరు మాత్ర తప్పేలా లేదు..












Click it and Unblock the Notifications