Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

మంత్రులు వ‌ర్సెస్ సిట్టింగ్ లు : ఆ ముగ్గురికి సీట్లు ఖ‌రారు: నెల్లూరులో నువ్వా నేనా..!

Recommended Video

    AP Assembly Elections 2019:TDP Announced Three Assembly Contestants In Nellore

    నెల్లూరు లో ఎవ‌రిది పై చేయి. టిడిపి నుండి ముగ్గురు అభ్య‌ర్దుల అధికారిక ప్ర‌క‌ట‌న‌. వైసిపి అభ్య‌ర్ధులు దాదాపు ఖ‌రారు. మ‌రి..గెలిచేదెవ‌రు. ఈ ముగ్గురు లో ఇద్ద‌రు మంత్రులు ఉన్నారు. ఇక‌, వైసిపి ఫైర్ బ్రాండ్ అనిల్ కుమార్ యాద‌వ్ పై మంత్రి నారాయ‌ణ పోటీ చేస్తున్నారు. వీరిలో ఎవ‌రు ఎవ‌రిని ఓడిస్తారు..ఏం జ‌రుగుతోంది..

    అనిల్ కుమార్ పై నారాయ‌ణ పోటీ..

    అనిల్ కుమార్ పై నారాయ‌ణ పోటీ..

    నెల్లూరు సిటీ లో సిట్టింగ్ వైసిపి ఎమ్మెల్యే అనిల్ కుమార్ పై మంత్రి నారాయ‌ణ‌ను పోటీ దింపింది టిడిపి అధినాయక త్వం. 2004 లో కాంగ్రెస్ నుండి పోటీ చేసి ఓడిన అనిల్..2014 లో వైసిపి అభ్య‌ర్దిగా ఎవ‌రి చేతిలో ఓడారో..ఆయ‌న మీదే తిరిగి గెలిచారు. 2014 ఎన్నిక‌ల్లో టిడిపి నుండి పోటీ చేసిన శ్రీధ‌ర్ కృష్ణారెడ్డికి 55285 ఓట్లు రాగా, వైసిపి నుండి పోటీ చేసి గెలిచిన అనిల్ కు 74372 ఓట్లు వ‌చ్చి 19087 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. వైసిపి ప్ర‌తిప‌క్షంలో ఉన్నా..అనిల్ కుమార్ స‌భ‌లోనూ..నియోక‌వ‌ర్గంలోనూ క్రియాశీల‌కంగా వ్య‌వ‌హ‌రిం చారు. ఫైర్ బ్రాండ్ గా మారారు. నియోక‌వ‌ర్గ స‌మ‌స్య‌ల మీదా దూకుడుగానే వ్య‌వ‌హ‌రించారు. ఇక‌, ఇప్పుడు మంత్రి నా రాయ‌ణ రానున్న ఎన్నిక‌ల్లో అనిల్ పై పోటీ చేస్తున్నారు. మంత్రి హోదా లో ఉన్న నారాయణ తొలి సారి అసెంబ్లీ ఎ న్నిక‌ల బ‌రిలోకి దిగుతున్నారు. స్థానికంగా తాను చేసిన అభివృద్ది త‌న‌ను గెలిపిస్తుంద‌ని నారాయ‌ణ చెబుతున్నారు. అయితే, నిత్యం ప్ర‌జ‌ల‌తో మ‌మేకం అయ్యే అనిల్ ను ఓడించ‌టం అంత సులువు కాద‌న్న‌ది వైసిపి నేత‌ల వాద‌న‌. మ‌రి ఇక్క‌డ ఎవ‌రు పై చేయి సాధిస్తారో చూడాలి.

    కోటంరెడ్డి వ‌ర్సెస్ ఆదాల

    కోటంరెడ్డి వ‌ర్సెస్ ఆదాల

    నెల్లూరు రూర‌ల్ అభ్య‌ర్దిగా టిడిపి మాజీ మంత్రి ఆదాల ప్ర‌భాక‌ర్ రెడ్డి ని ఖ‌రారు చేసారు. ప్ర‌స్తుతం సిట్టింగ్ ఎమ్మెల్యే గా ఉన్న వైసిపి ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధ‌ర్ రెడ్డి ఇక్క‌డి నుండి పోటీ చేయ‌నున్నారు. 2014 ఎన్నిక‌ల్లో పొత్తులో భాగంగా ఇక్క‌డ బిజెపి అభ్య‌ర్ది సురేష్ రెడ్డికి 53450 ఓట్లు వ‌చ్చాయి. వైసిపి నుండి పోటీ చేసిన కోటంరెడ్డి శ్రీధ‌ర్ రెడ్డికి 79103 ఓట్లు రాగా 25653 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. గెలిచిన నాటి నుండి నిత్యం ప్ర‌జ‌ల్లోనే ఉంటున్నారు. ఎంపీగా పోటీ చేయ‌టానికి సుముఖంగా లేక‌పోవ‌టంతో ఆదాలకు నెల్లూరు రూర‌ల్ కేటాయించారు. అయితే, ఇక్క‌డ పోటీ ఎలా ఉం టుంద‌నే దాని పై చ‌ర్చ మొద‌లైంది. సంక్షేమ ప‌ధ‌కాలు త‌మ‌ను గెలిపిస్తాయ‌ని టిడిపి..స్థానికంగా తాము ప్ర‌జ‌ల‌తో క‌లిసి వారి కోసం చేసిన ప‌నులు త‌మ‌ను గెలిపిస్తాయ‌ని వైసిపి చెబుతోంది. మ‌రి..ఈ ఇద్దరి పోటీలో ఎవ‌రికి వారు త‌మ గెలుపు పై ధీమా వ్య‌క్తం చేస్తున్నారు.

    స‌ర్వేప‌ల్లిలో మంత్రి సోమిరెడ్డి వ‌ర్సెస్ కాకాని

    స‌ర్వేప‌ల్లిలో మంత్రి సోమిరెడ్డి వ‌ర్సెస్ కాకాని

    స‌ర్వేప‌ల్లి నియోజ‌క‌వ‌ర్గం నుండి మ‌రో మంత్రి సోమిరెడ్డి చంద్ర‌మోహ‌న రెడ్డిని టిడిపి ఖ‌రారు చేసింది. సోమిరెడ్డి స‌ర్వే ప‌ల్లి లో రెండు సార్లు గెల‌వ‌గా..మూడు సార్లు ఓడిపోయారు. 2014 ఎన్నిక‌ల్లో సోమిరెడ్డికి 80298 ఓట్లు రాగా, వైసిపి అభ్య‌ర్ది కాకాని గోవ‌ర్ద‌న్ రెడ్డికి 85744 ఓట్లు వ‌చ్చి..5446 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. సోమిరెడ్డి పై కాకాని తీవ్ర స్థాయిలో ఆరోప ణ‌లు చేసేవారు. ఆయ‌న ఆరోప‌ణ‌ల్లో నిజం లేదంటూ సోమిరెడ్డి రియాక్ట్ అయ్యారు. ఇక‌, ఇప్పుడు ఎమ్మెల్సీగా ఉంటూ మంత్రి అయిన సోమిరెడ్డి ఎట్టి ప‌రిస్థితుల్లో గెల‌వాల‌నే ల‌క్ష్యంతో ఉన్నారు. అదే విధంగా కాకాని గోవ‌ర్ధ‌న్ రెడ్డి గెలుపు మ‌రోసారి ఖాయ‌మ‌ని వైసిపి నేత‌లు చెబుతున్నారు. ఇక‌, నెల్లూరు ఎంపి గా వైసిపి నుండి తిరిగి మేక‌పాటి రాజ‌మోన రెడ్డి పోటీ చేస్తున్నారు. టిడిపి నుండి బొమ్మిరెడ్డి రాఘ‌వేంద్ర రెడ్డి పోటీకి దిగటం దాదాపు ఖాయంగా క‌నిపిస్తోంది. ఇలా ముందుగానే నెల్లూరు లో టిక్కెట్లు ఖరారు కావ‌టంతో..గెలుపు ఎవ‌రిని వ‌రిస్తుంద‌నే చ‌ర్చ ఆస‌క్తి క‌రంగా మారింది.

    More From
    Prev
    Next
    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+