చాక్లెట్ ఇస్తానని చెప్పి.. ఇద్దరు బాలికలపై లైంగికదాడి.. కడుపునొప్పి రావడంతో..
ఎన్ని చట్టాలు తీసుకొచ్చినా.. కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పినా మృగాళ్లలో మార్పు రావడం లేదు. నిత్యం ఎక్కడో చోట దారుణాలు జరుగుతూనే ఉన్నాయి. రాష్ట్రవ్యాప్తంగా పోలీసులు రాత్రి పూట పెట్రోలింగ్ నిర్వహిస్తున్నారు. మహిళల రక్షణ కోసం షీ టీంలు కూడా ఏర్పాటు చేశారు. నిర్భయ లాంటి పలు కఠిన చట్టాలు తెచ్చారు. అయినా అఘాయిత్యాలకు అడ్డుకట్ట పడటం లేదు.
నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ఇద్దరు బాలికలపై అత్యాచార ఘటన కలకలం రేగింది. పెయింటర్స్ కాలనీకి చెందిన మహ్మద్ వసీం చాకెట్లు ఆశ చూపి ఇద్దరు బాలికలపై అత్యాచారం చేశాడు. ఈ ఘటనకు సంబంధించి నిందితుడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు. నగరంలో అద్దె ఇంట్లో ఉండే మహ్మద్ వసీం మేస్త్రీగా పనిచేస్తూ జీవించేవాడు. అతడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. కొన్ని రోజులుగా ఇంటి సమీపంలో ఉండే ఇద్దరు బాలికలకు చాక్లెట్లు ఇస్తున్నాడు. గత ఆదివారం సాయంత్రం ఇద్దరికి చాక్లెట్లు కొనిచ్చి, వారిని ఇంట్లోకి తీసుకెళ్లి అత్యాచారం జరిపాడు. ఎవరికైనా చెబితే చంపేస్తానని బాలికలను బెదిరించాడు.

వారు ఎవరికీ చెప్పకుండా ఉండిపోయారు. బాధిత బాలికల్లో ఒకరికి 8 ఏళ్లు, మరో బాలికకు 12 ఏళ్లు ఉంటాయి. అయితే ఓ బాలిక కడుపునొప్పితో బాధపడుతుండటాన్ని గమనించిన తల్లి నిలదీయడంతో విషయాన్ని చెప్పింది. బాలికల కటుంబ సభ్యులు నిందితుడిని నిలదీసి ఆరో టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిందితుడిపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఇటు ఎల్లారెడ్డిలో ఆరేళ్ల చిన్నారిపై అదే కాలనీకి చెందిన ఓ బాలుడు అత్యాచార యత్నానికి పాల్పడ్డాడు. ఇంటి బయట ఆడుకుంటున్న చిన్నారిని 14 ఏళ్ల బాలుడు చాక్లెట్ ఇస్తానని ఇంటి సందులోకి తీసుకువెళ్ళి అత్యాచార యత్నానికి పాల్పడినట్లు తెలిపారు. చిన్నారి అరవడంతో చుట్టుపక్కల వారు బాలుడిని పట్టుకుని పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు సమాచారం.
పదిరోజుల ముందు బస్టాండ్ వద్ద ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో డిగ్రీ యువతిపై సామూహిక అత్యాచారం జరిగింది. గత బుధవారం ఆర్మూర్‌లో మైనర్ బాలికపై చాక్లెట్లు ఆశ చూపి ఓ వ్యక్తి అసభ్యకరంగా ప్రవర్తించాడు. ఇటీవల గుండారం, ఎన్టీఆర్ చౌరస్తా, డిచ్‌పల్లిలో అత్యాచార ఘటనలు వెలుగుచూశాయి. గుండారంలో ఓ మహిళను అత్యాచారం చేసి హత్యచేశారు. సారంగాపూర్‌లో గత ఏడాది మహిళపై సామూహిక అత్యాచారం జరిగింది. నందిపేట మండలంలో బాలికపై అత్యాచారం జరిగింది. గత ఏడేళ్లుగా 324 ఘటనలు చోటుచేసుకున్నాయి.
-
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
విజయ్ సంచలనం.. టీవీకే అభ్యర్థుల ఫుల్ జాబితా విడుదల.. -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
India Post GDS 2nd merit list 2026: పోస్టల్ జాబ్స్ సెకండ్ మెరిట్ లిస్ట్ పై అప్డేట్..!












Click it and Unblock the Notifications