లోకసభ ఎన్నికలు 2019 : ఒంగోలు నియోజ‌క‌వ‌ర్గం గురించి తెలుసుకోండి

Recommended Video

    Lok Sabha Election 2019: Ongole Lok Sabha Constituency | Sitting MP, MP Performance Report

    ఎందరో యోధులు..మ‌హా మ‌హులు కొలువు తీరిన ఒంగోలు నియోజ‌క‌వ‌ర్గానికి ఎంతో చ‌రిత్ర ఉంది. ప్ర‌కాశం జిల్లా ముఖ్య కేంద్రంగా ఉన్న ఒంగోలు పార్ల‌మెంట్ నియోజ‌క‌వ‌ర్గ ప్ర‌జ‌లు ఎంద‌రో ప్ర‌ముఖుల‌ను లోక్‌స‌భ కు పంపారు. వ్యాపార‌- వాణిజ్య‌- రాజ‌కీయంగా ఈ నియోజ‌క‌వ‌ర్గం ముఖ్య భూమిక పోషిస్తోంది. ఇక‌, సామాజిక వ‌ర్గాల బ‌లా బ‌లాలే ఇక్క‌డ రాజ‌కీ యంగా ప్ర‌భావితం చేస్తాయి. దీంతో..ఒంగోలు పార్ల‌మెంట్ ప‌రిధిలో ప్ర‌తీ సారి ఎన్నిక‌లు ఆస‌క్తి క‌ర‌మే.

    పార్ల‌మెంట్ జ‌నాభా 21 ల‌క్ష‌ల పై మాటే..

    ఒంగోలు లోక్‌స‌భ నియోజ‌క‌వ‌ర్గ ప‌రిధిలో దాదాప 22 ల‌క్ష‌ల మంది ఓట‌ర్లు ఉన్నారు. 2014 ఎన్నిక‌ల ప్ర‌కారం ఇక్క‌డ మొత్తం 21 ల‌క్ష‌ల 22 వేల 411 మంది ఓట‌ర్లు ఉన్నారు. అందులో రూర‌ట్ ఓట‌ర్లు 78.18 శాతం కాగా, అర్బ‌న్ ఓట‌ర్లు 21.82 శాతంగా ఉన్నారు. ఎస్సీలు - 22.47 శాతం, ఎస్టీ జ‌నాభా 3.92 శాతం గా ఉంది. ఇక‌, ఇదే లోక్‌స‌భ నియెక‌వ‌ర్గం నుండి ప్ర‌ముఖ సినీ న‌టుడు కొంగర జ‌గ్గ‌య్య ,మాద‌ల నారాయ‌ణ స్వామి, బెజ‌వాడ పాపిరెడ్డి లాంటి ఉద్దండులు ఇక్క‌డి నుండి గెలిచారు. మాగుంట శ్రీనివాసుల రెడ్డి మూడు సార్లు. మాగుంట సుబ్బ‌రామిరెడ్డి ఒకసారి గెలిచారు.

    1952 నుండి ఇప్ప‌టి దాకా..

    1952 లో ఏర్ప‌డిన ఒంగోలు లోక్‌స‌భ నియోజ‌క‌వ‌ర్గంలో ఇప్ప‌టి వ‌ర‌కు జ‌రిగిన ఎన్నిక‌ల్లో తొలి సారి ద్విస‌భ స‌భ్యులుగా ఇద్ద‌రు స్వ‌తంత్రులు ఎంపీలుగా వ్య‌వ‌హ‌రించారు. ఆ త‌రువాత కాంగ్రెస్, కాంగ్రెస్ (ఐ) నుండి 11 సార్లు, సిపిఐ నుండి ఒక సారి, టిడిపి నుండి రెండు సార్లు, వైసిపి నుండి ఒక‌సారి ఎంపీలుగా గెలిచారు. వీరిలో రెడ్డి సామాజిక వ‌ర్గం నుండి ఎనిమిది మంది నేత‌లు 11 సార్లు నెగ్గారు. క‌మ్మ సామాజిక వ‌ర్గానికి చెందిన వారు అయిదు సార్లు, ఒక సారి ఎస్సీ సామా జిక వ‌ర్గానికి చెందిన వారు గెలుపొందారు.

    #LokSabhaElection2019: All about Ongole Constituency

    2014 లో వైసిపి అభ్య‌ర్ధి గెలుపు..

    2014 లో జ‌రిగిన ఎన్నిక‌ల్లో వైసిపి నుండి పోటీ చేసిన వైవి సుబ్బారెడ్డి స‌మీప ప్ర‌త్య‌ర్ధి..టిడిపి అభ్య‌ర్ధి మాగుంట శ్రీనివా సుల రెడ్డి పై 15,658 ఓట్ల మెజార్టీతో గెలిచారు. వైసిపి కి ఆ ఎన్నిక‌ల్లో 5 ల‌క్షల 89 వేల 960 ఓట్లు రాగా, టిడిపి అభ్య‌ర్ధికి 5 ల‌క్ష‌ల 74 వేల 302 ఓట్లు ద‌క్కాయి. ఇక‌, లోక్‌స‌భ ప‌రిధిలోని అసెంబ్లీ సెగ్మెంట్ల వారీగా చూస్తే.. ఎర్ర‌గొండ‌పాలెం లో 19,378 ఓట్లు..మార్కాపురం లో 8,309 ఓట్లు, గిద్ద‌లూరు లో 12,302 ఓట్ల చొప్పున వైసిపి కి మెజార్టీ ద‌క్కింది. ఇక‌, ద‌ర్శి లో 1,025 ఓట్లు, ఒంగోలు లో 13,528 ఓట్లు, క‌నిగిరి లో 5,148 ఓట్లు టిడిపికి మెజార్టీ వ‌చ్చింది. అయితే, వైసిపి అభ్య‌ర్ధి ఈ ఎన్నిక‌ల్లో విజ‌యం సాధించారు.

    2014 లో పోలింగ్ స‌ర‌ళి..82 శాతం..

    ఒంగోలు లోక్‌స‌భ ప‌రిధిలో 2014 ఎన్నిక‌ల ప్ర‌కారం మొత్తం ఓట‌ర్లు 14 ల‌క్ష‌ల 70 వేల 483 మంది ఉన్నారు. అందులో పోల్ అయిన ఓట్ల‌ను ప‌రిశీలిస్తే మ‌హిళా ఓట్లు ఏడు ల‌క్ష‌ల 34 వేల 238, పురుష ఓట్లు ఏడు ల‌క్ష‌ల 36 వేల 245 ఓటు హ‌క్కు వినియోగించుకున్నారు. 2014 ఎన్నిక‌ల్లో మొత్తం గా 82 శాతం పోలింగ్ న‌మోదైంది.

    ఎంపీగా వైవి సుబ్బారెడ్డి స‌మ‌ర్ధ‌త‌..

    వైసిపి అధినేత జ‌గ‌న్ కు బంధువు అయిన వైవి సుబ్బారెడ్డి అనూహ్యంగా ఒంగోలు ఎంపీగా బ‌రిలోకి దిగి విజ‌యం సా ధించారు. ఇక‌, ఎంపీగా సుబ్బారెడ్డి లోక్‌స‌భ లో ఇప్ప‌టి డిసెంబ‌ర్ చివ‌రి దాకా 54 చ‌ర్చ‌ల్లో పాల్గొన్నారు. ప్ర‌యివేటు మెంబ‌ర్ బిల్లులు రెండు ప్ర‌వేశ పెట్టారు. ఇక‌, స‌భ్యుడిగా లోక్‌స‌భ లో 388 ప్ర‌శ్న‌లు సంధించారు. కాగా..ఇక‌, స‌భ్యుడిగా వైవి సుబ్బారెడ్డి హాజ‌రు 76 శాతంగా న‌మోదైంది.

    తాజా ప‌రిస్థితి..

    ఇక‌, ఒంగోలు నుండి 2014 లో గెలిచిన వైవి సుబ్బారెడ్డి కేంద్ర ప్ర‌భుత్వం పై అవిశ్వాస నోటీసు ఇచ్చారు. ఇక‌, ఏపికి ప్ర‌త్యేక హోదా కోసం వైసిపి ఎంపీలు రాజీనామా చేసారు. అందులో వైవి సుబ్బారెడ్డి ఉన్నారు. ఈ సారి ఎలాగైనా అధికారంలోకి రావాల‌ని భావిస్తున్న వైసిపి అధినాయ‌క‌త్వం వైవి సుబ్బారెడ్డిని పార్టీ వ్యూహాల అమ‌లు కోసం ఆయ‌న సేవ‌లు వినియోగంచుకోవాల‌ని భావిస్తున్న‌ట్లు స‌మాచారం. దీంతో..ఒంగోలు అభ్య‌ర్ధిగా సుబ్బారెడ్డి ఉంటారా లేదా అనేది అనుమాన‌మే. ఇక‌, టిడిపి నుండి సిట్టింగ్ ఎమ్మెల్సీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి పోటీ చేసే అవ‌కాశం ఉంది. రెండు పార్టీలు హోరా హోరీ పోరులో జ‌న‌సేన ప్ర‌భావం ఎంత వ‌ర‌కు ఉంటుంద‌నేది వేచి చూడాలి.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+