మహానాడు కాదు మాయనాడు.. మంత్రి సురేష్ ఫైర్
ఒంగోలులో టీడీపీ మహానాడు కొనసాగుతోన్న సంగతి తెలిసిందే. మహానాడుని అధికార పక్షం నేతలు టార్గెట్ చేశారు. మహానాడుతోపాటు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై తీవ్ర విమర్శలు చేశారు. అది మహానాడు కాదు మహా ప్రస్థానం అని ఒకరంటే, అది మహానాడు కాదు మాయనాడు అని మరొకరు అన్నారు. టీడీపీ నిర్వహించేది మహానాడు కాదు మాయనాడు అని మంత్రి ఆదిమూలపు సురేశ్ అన్నారు.
ఎన్టీఆర్‌ని వందేళ్లు బతకనివ్వకుండా చంపిన చంద్రబాబుకి శతదినోత్సవ వేడుకలు చేసే అర్హత లేదన్నారు. వైసీపీ గాలి పార్టీ కాదని, దేశంలోనే బలమైన పార్టీ అని చెప్పారు. వైసీపీ గాలికి టీడీపీ గత ఎన్నికల్లో కొట్టుకుపోయిందని, వచ్చే ఎన్నికల్లో నామరూపాలు లేకుండా పోతుందని మంత్రి సురేశ్ అన్నారు. అచ్చెన్నాయుడు అవినీతి చేశారని, అధికార దుర్వినియోగం చేశారని, అందుకే కేసులు నమోదు చేశారని వివరించారు.

టీడీపీలో ఉన్నదంతా దొంగలే అని, గత ఐదేళ్లు దోచుకుతిన్నారని మంత్రి సురేశ్ ఆరోపించారు. చంద్రబాబు, అచ్చెన్నాయుడు దొంగలు కాబట్టే ప్రజలు వాళ్లను ఇంటికి పంపించారని ధ్వజమెత్తారు. టీడీపీ కార్యకర్తలకు ఆయుధాలు ఇచ్చి విధ్వంసం సృష్టించే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపణ చేశారు. ఇదీ అందరికీ తెలుసు అని చెప్పారు.
-
మెగాస్టార్‌కి బహిరంగంగా క్షమాపణలు చెప్పిన సీఎం.. -
విశాఖ టు బెంగళూరు వయా తిరుపతి వందేభారత్ స్లీపర్ రెడీ - రూట్ , ముహూర్తం..!! -
ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు, ఏ బ్రాండ్ ఎంత..!! -
ఢిల్లీలో జగన్ రూటు మారిందా, పార్లమెంట్ సాక్షిగా - కీలక మలుపు..!! -
T20 World Cup: సూర్యకుమార్ యాదవ్ కు ఐసీసీ అనూహ్య షాక్..! -
India Post GDS 2nd Merit List 2026: పోస్టల్ జాబ్స్ రెండో మెరిట్ లిస్ట్ అప్పుడే? -
టీం ఇండియాకు బీసీసీఐ భారీ నజరానా, ఒక్కొక్కరికి ఎంతంటే..!! -
పెట్రోల్ పై కేంద్రం ఎస్మా ప్రయోగం:LPG ఉత్పత్తి పెంచాలని హుకుం -
భారీగా పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు! -
మిథున రాశి 2026 2027 జాతకం.. ఈ ఏడాది వీరి మాటే శాసనం! -
టీమిండియాపై విధ్వంసకర సెంచరీ: కెప్టెన్‌గా ప్రమోషన్ -
వరల్డ్ కప్ గెలిచినా తప్పని చిక్కులు! ఆ ఆటగాడిపై ఐసీసీ వేటు?












Click it and Unblock the Notifications